Arvind Kejriwal: గవర్నర్ పదవా!? రాష్ట్రపతా!?
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:43 AM
వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రిటైర్మెంట్ తర్వాత రాజీవ్‌కుమార్‌కు ఏ పదవిస్తున్నారు?
అందుకే సీఈసీ బీజేపీకి సాగిలపడుతున్నారు
ఎన్నికల్లో బీజేపీ పది శాతం ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు
15 శాతం ఆధిక్యం ఇస్తేనే వాళ్ల అక్రమాలకు అడ్డుకట్ట
ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
హస్తినలో ముగిసిన ప్రచారం.. రేపే 70 సీట్లకు పోలింగ్
హస్తినలో ‘జైలు’ రాజకీయం!.. సానుభూతికి ప్రయత్నం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పదవీ విరమణ తర్వాత ఇస్తామంటున్న పదవుల కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీజేపీ ఒత్తిళ్లకు సాగిలపడిపోయారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ స్థాయిలో బీజేపీకి దాసోహమైందంటే.. దేశంలో అసలు ఎన్నికల కమిషన్ లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాజీవ్ కుమార్ ఈ నెలాఖరులోనే పదవీ విరమణ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు ఏ పదవిని ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ పదవా!? ఏకంగా రాష్ట్రపతి పదవినే ఇచ్చేస్తున్నారా!? చేతులు జోడించి రాజీవ్ కుమార్‌కు విజ్ఞప్తి చేస్తున్నా! మీ విధిని మీరు నిర్వర్తించండి. ఇంకా పదవులు చేపట్టాలనే దురాశను వదిలేసుకోండి. కెరీర్ చివర్లో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు. రాజీవ్ కుమార్ తన బాధ్యతలను నైతిక నిష్ఠతో నిర్వహించాలని, ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోరాదని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు అశాంతిని ప్రోత్సహిస్తోందని, పోలీసులకు అధికారాలు లేకుండా చేశారని, ఢిల్లీ పోలీసులు కూడా భయపడుతున్న ఆ గూండా ఎవరని ప్రశ్నించారు.

10 శాతం ఓట్లు రిగ్గింగ్ చేయొచ్చు
ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)ల ద్వారా బీజేపీ పది శాతం వరకూ ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చంటూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అందుకే మీరంతా పెద్దఎత్తున ఓటింగ్‌కు తరలి రావాలి. ప్రతి ఓటూ చీపురు కట్ట (ఆప్ గుర్తు)కే వేయాలి. 15 శాతం ఓట్ల ఆధిక్యం వస్తేనే.. వాళ్లు ఎన్ని అక్రమాలు చేసినా మన విజయం ఖాయమవుతుంది. వాళ్ల ఈవీఎంలను ఓడించాలంటే పది శాతం.. ఆపైనే ఆధిక్యం మనకు అవసరం’’ అంటూ ఓ వీడియో సందేశాన్ని ఢిల్లీ ఓటర్లకు విడుదల చేశారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల అక్రమాల నేపథ్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ రోజు ప్రతి అంశాన్నీ ఇందులో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ, ఈసీ, తమ వెబ్‌సైట్‌లోని గణాంకాల మధ్య తేడా వస్తే అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వస్తామని చెప్పారు. అలాగే, ఎన్నికకు ముందు బీజేపీ ప్రలోభాలకు చెక్ పెట్టడానికి మురికివాడల్లోని ప్రజలకు స్పై, బాడీ కెమెరాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
మరిన్ని...
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి