Chetak Helicopters: చేతక్, చీతా చాపర్లకు స్వస్తి
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:45 AM
కాలంతీరిన చేతక్, చీతా చాపర్ల స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్
వాటి స్థానంలో ఆధునిక లైట్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాలంతీరిన చేతక్, చీతా చాపర్ల స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికోసం 200 ఆధునిక తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటిలో 120 ఆర్మీకి, 80 వాయుసేనకు కేటాయించారు. 1960 దశకం నాటి చేతక్, చీతా హెలికాప్టర్లలో ఆధునిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే మిగ్-21 ఫైటర్ జెట్లలా వీటి క్రాష్ రేటు కూడా ఎక్కువ. పైలట్లకు విజిబిలిటీ సమస్య కూడా ఎదురవుతోంది. అందువల్ల వీటి స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.