Share News

India warns Pakistan: పాక్ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి.. అణు బెదిరింపులపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

ABN , Publish Date - Aug 14 , 2025 | 07:46 PM

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. రెండు దేశాల్లోనూ ఉద్రిక్తతలు ఇప్పుడే చల్లబడుతున్న నేపథ్యంలో పాక్ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అణుదాడికి దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

India warns Pakistan: పాక్ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి.. అణు బెదిరింపులపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Pakistan Army chief Asim Munir

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. రెండు దేశాల్లోనూ ఉద్రిక్తతలు ఇప్పుడే చల్లబడుతున్న నేపథ్యంలో పాక్ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు (Pakistan). అణుదాడికి దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సహా పలువురు నేతలు భారత్‌ను రెచ్చగొట్టే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు (India-Pakistan).


ఇటీవలి అమెరికాలో పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim Munir).. భారత్‌పై అణు బెదిరింపులకు దిగారు. తమ అస్థిత్వానికి భారత్ ముప్పు తీసుకువచ్చే పరిస్థితి ఎదురైతే ప్రపంచంలో సగభాగాన్ని నాశనం చేస్తామంటూ బెదిరించారు. ఈ వ్యాఖ్యలకు భారత్ దీటుగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా, బాధాకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు చేసింది.


పాక్ నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ హెచ్చరించారు. 'యుద్ధాన్ని ప్రేరేపించేలా, చాలా నిర్లక్ష్యంగా పాకిస్థాన్ నేతలు మాట్లాడుతుండడాన్ని మనం చూస్తున్నాం. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యాంటీ-ఇండియా స్టాండ్ తీసుకుంటున్నార'ని రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.


ఇవి కూడా చదవండి

ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు..ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 07:46 PM