Share News

GCMMF: లీటర్‌ అమూల్‌ పాలపై రూ.1 తగ్గింపు

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:09 AM

అమూల్‌ బ్రాండ్‌ కింద డెయిరీ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తున్న గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) దేశవ్యాప్తంగా లీటరు పాల ధరలను రూ.1 మేర తగ్గించింది. ఒక లీటరు ప్యాక్‌లపై మాత్రమే ఈ ధరలు తగ్గాయి.

GCMMF: లీటర్‌ అమూల్‌ పాలపై రూ.1 తగ్గింపు

న్యూఢిల్లీ, జనవరి 24: అమూల్‌ బ్రాండ్‌ కింద డెయిరీ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తున్న గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) దేశవ్యాప్తంగా లీటరు పాల ధరలను రూ.1 మేర తగ్గించింది. ఒక లీటరు ప్యాక్‌లపై మాత్రమే ఈ ధరలు తగ్గాయి. పెద్ద పాల ప్యాక్‌లను వినియోగదారులు కొనేలా ప్రోత్సహించేందుకు ధరలను తగ్గించినట్టు జీసీఎంఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయెన్‌ మెహతా తెలిపారు. ఢిల్లీలో లీటరు అమూల్‌ గోల్డ్‌ పాల ధర రూ.68 నుంచి 67కు, అమూల్‌ తాజా పాల ధర రూ.56 నుంచి రూ.55కు తగ్గించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్‌ టర్నోవర్‌ 8 శాతం మేర పెరిగి రూ.59,445 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్టు మెహతా ఇంతకు ముందు పేర్కొన్నారు. ’


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:12 AM