Share News

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

ABN , Publish Date - Oct 20 , 2025 | 10:53 AM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

చెన్నై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ(BJP) వర్గాలు తెలిపాయి. విమానంలో 25వ తేది రాత్రి 7 గంటలకు కోవై చేరుకోనున్న అమిత్‌షా.. ఆ రోజు రాత్రి అవినాసి రోడ్డులోని ఓ హోటల్‌లో బసచేయనున్నారు. కోవై పీలమేడులో నిర్మించిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని 26వ తేది ఉదయం అమిత్‌ షా ప్రారంభించనున్నారు.


nani2.2.jpg

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ రాష్ట్ర నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఈషా యోగా కేంద్రంలో జరిగే వేడుకల్లో పాల్గొని, రాత్రి 8 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. కోవె రానున్న కేంద్ర మంత్రి అమిత్‌ షాకు విమానాశ్రయం, పార్టీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మేళతాళాలతో స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. పోలీసు శాఖ భద్రత కట్టుదిట్టం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 10:53 AM