Share News

Amit Shah: నక్సలైట్ల ఏరివేతలో పాల్గొన్న పోలీస్‌ అధికారులతో షా సమావేశం

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:01 AM

డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ, హోం మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌న్లను విజయవంతంగా నిర్వహించిన పోలీస్‌ అధికారులను అభినందించినట్లు అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Amit Shah: నక్సలైట్ల ఏరివేతలో పాల్గొన్న పోలీస్‌ అధికారులతో షా సమావేశం

న్యూఢిల్లీ, జూన్‌ 7: ఛత్తీ్‌సగఢ్‌లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్‌లో చురుగ్గా వ్యవహరించిన పోలీస్‌ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణు దేవ్‌ సాయ్‌, డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ, హోం మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌న్లను విజయవంతంగా నిర్వహించిన పోలీస్‌ అధికారులను అభినందించినట్లు అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఆపరేషన్లు విజయవంతం కావడంలో పాలుపంచుకున్న పోలీసులను కూడా తాను కలుసుకోవాలనుకుంటున్నానని, త్వరలో ఛత్తీ్‌సగఢ్‌లో పర్యటిస్తానని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:01 AM