Share News

బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్‌ యాత్ర

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:22 AM

కర్ణాటకలోని అలంద్‌ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశంలో ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా...

బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్‌ యాత్ర

  • ఓట్‌ చోరీ యాత్రపై కేంద్ర మంత్రి అమిత్‌ షా

పట్నా, సెప్టెంబరు 18: కర్ణాటకలోని అలంద్‌ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అంశంలో ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. తప్పుడు కథనాలను ప్రచారం చేయడం కాంగ్రె్‌సకు అలవాటైపోయిందని మండిపడ్డారు. బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేందుకే ఓట్‌ చోరీ పేరిట రాహుల్‌ గాంధీ బిహార్‌లో యాత్ర చేపట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌ పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. స్థానిక బీజేపీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ చేపట్టిన యాత్ర మంచి విద్య, ఉద్యోగాలు, విద్యుత్‌, రహదారులు కోసం కాదని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులను రక్షించేందుకని ఆరోపించారు. చొరబాటుదారులకు ఓటు హక్కు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలా ? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:22 AM