Share News

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి.. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

ABN , Publish Date - Apr 11 , 2025 | 09:29 PM

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారో ఈ కథనంలో తెలుసుకుందాం

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి.. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
Ambedkar Jayanti

భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఏప్రిల్ 14న జరుపుకోనున్న విషయం తెలిసిందే. అంబేడ్కర్ జయంతిని నేషనల్ హాలిడేగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ఏయే రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయో చూద్దాం.


కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు అధికారిక క్యాలెండర్‌లో కూడా ఏప్రిల్ 14ను సెలవు దినంగా పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించాయి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, ఝార్ఖండ్, సిక్కిమ్‌, తమిళనాడు, గుజరాత్, చండీఘడ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాంలో ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు. మధ్యప్రదేశ్, నాగాలాండ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, బ్యాంకులకు సెలవు ఇచ్చిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్యాకింగ్, ఎస్‌ఎమ్ఎస్ బ్యాకింగ్, వాట్సా్ప్ బ్యాకింగ్ వంటి డిజిటల్ సేవలన్నీ ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.


ఇక అంబేడ్కర్ జయంతిని యూపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు మూసే ఉంటాయని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీలో అంబేడ్కర్ జయంతి నాడు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్‌లకు (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ) ఏప్రిల్ 14న సెలవే. ఏప్రిల్ 14తో పాటు, గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 18), మహారాష్ట్ర అవతరణ దినం (మే 1), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గణేశ్ చతుర్థి (ఆగస్టు 27), దిపావళి (అక్టోబర్ 21,22), గురునానక్ జయంతి (నవంబర్ 5), క్రిస్మస్ (డిసెంబర్ 25) రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్‌లకు సెలవు.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ నిందితుల దారుణం.. తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాడని ఆగ్రహంతో..

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్

ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్

Read Latest and National News

Updated Date - Apr 11 , 2025 | 09:36 PM