Share News

Ajith : రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:22 AM

తెరపైన హీరోయిజాన్ని ప్రదర్శించే నటులకు మనదగ్గర కొదువ లేదు. కానీ నిజం జీవితంలోనూ అలాంటి తెగువను ప్రదర్శించగల అతికొద్దిమంది నటుల్లో అజిత్‌ అగ్రగణ్యుడు. తెరపైన బైకర్‌, రేసర్‌, బిజినె్‌సమాన్‌ , టీచర్‌ లాంటి విభిన్న పాత్రలను తన అద్భుత నటనతో పండించిన అజిత్‌ మేకప్‌ తీశాక నిజ

Ajith : రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే

తెరపైన హీరోయిజాన్ని ప్రదర్శించే నటులకు మనదగ్గర కొదువ లేదు. కానీ నిజం జీవితంలోనూ అలాంటి తెగువను ప్రదర్శించగల అతికొద్దిమంది నటుల్లో అజిత్‌ అగ్రగణ్యుడు. తెరపైన బైకర్‌, రేసర్‌, బిజినె్‌సమాన్‌ , టీచర్‌ లాంటి విభిన్న పాత్రలను తన అద్భుత నటనతో పండించిన అజిత్‌ మేకప్‌ తీశాక నిజ జీవితంలోనూ వాటిని సాకారం చేసుకున్నారు. దక్షిణాదిన అగ్రహీరోగా ఎదిగిన అజిత్‌కుమార్‌ 1971లో పి. సుబ్రమణ్యం, మోహిని దంపతులకు తంజావూర్‌లో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్‌కు వలస వచ్చింది. పదో తరగతి తోనే చదువు ఆపేసిన అజిత్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ గ్యారేజీలో మెకానిక్‌గా జీవితం ఆరంభించారు. అయితే తండ్రికి ఆపని నచ్చకపోవడంతో మధ్యలోనే వదిలేసి ఓ దుస్తుల ఎగుమతి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తర్వాత సొంతంగా దుస్తుల ఎగుమతి వ్యాపారం చేసి నష్టపోయాడు. అయితే ఆ సమయంలోనే పలు దుస్తుల బ్రాండ్స్‌కు మోడల్‌గానూ అజిత్‌ పనిచేశారు. హెర్క్యూలెస్‌ సైకిల్స్‌ కోసం ఓ యాడ్‌ చేసే క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌తో ఆయనకు పరిచయమైంది. ఆయన సూచన మేరకు సినీ రంగంవైపు అజిత్‌ అడుగులేశారు.

1990లో ‘ఎన్‌ వీడు ఎన్‌ కనవర్‌’ చిత్రంలో విద్యార్థిగా చిన్న పాత్రలో తెరపై తొలిసారి కనిపించారు అజిత్‌. ఎస్‌పీ చరణ్‌, అజిత్‌ స్కూల్‌ ఫ్రెండ్స్‌. అలా ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం సూచనతో ‘ప్రేమ పుస్తకం’ చిత్రంలో తొలిసారి హీరోగా అజిత్‌ అవకాశం దక్కించుకున్నారు. ఇప్పటివరకూ అజిత్‌ నటించిన తెలుగు చిత్రం ఇదొక్కటే. అయితే ఆ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘అమరావతి’ ముందు విడుదలైంది. 1995లో వచ్చిన ‘ఆసై’ చిత్రం సూపర్‌హిట్‌ అవ ్వడంతో అజిత్‌ ఇక వెనుదిరిగి చూడలేదు. 1999లో వచ్చిన ‘వాలి’ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన అజిత్‌ తొలిసారి ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోగా తన కెరీర్‌ను సుస్థిరం చేసుకున్నారు. మొత్తం మూడు ఫిలింపేర్‌ పురస్కారాలను అందుకున్నారు. 2000లో నటి షాలినీని ఆయన పెళ్లాడారు.


ఇవి కూడా చదవండి

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 04:22 AM