Share News

Air India: విమాన దుర్ఘటన వేళ.. పార్టీ చేసుకున్న సిబ్బందిపై వేటు

ABN , Publish Date - Jun 27 , 2025 | 09:55 PM

సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్..ఎయిర్ ఇండియా భాగస్వా్మ్యంతో (ఏఐఎస్ఏటీఎస్) దేశంలోని పలు విమాశ్రయాల్లో గ్రౌండ్ సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ ఘటన జరిగిన కొద్దిరోజులకే గురుగ్రామ్‌లోని ఏఐఎస్ఏ‌టీఎస్ కార్యాలయంలో సిబ్బంది పార్టీ చేసుకున్నారు.

Air India: విమాన దుర్ఘటన వేళ.. పార్టీ చేసుకున్న సిబ్బందిపై వేటు

న్యూఢిల్లీ: అహ్మద్‌బాద్ నుంచి జూన్ 12న బయలుదేరిన ఎయిరిండియా విమానం క్షణాల్లోనే కుప్పకూలి 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా స్మృతిపథంలో ఉండగానే, ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఇటీవల తమ ఆఫీసులో పార్టీ చేసుకోవడం సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, తీవ్ర విమర్శలు రావడంతో సిబ్బందిపై సదరు సంస్థ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. నలుగురు సిబ్బందిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది.


ఘటన వివరాల ప్రకారం, సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్..ఎయిర్ ఇండియా భాగస్వా్మ్యంతో (ఏఐఎస్ఏటీఎస్) దేశంలోని పలు విమాశ్రయాల్లో గ్రౌండ్ సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ ఘటన జరిగిన కొద్దిరోజులకే గురుగ్రామ్‌లోని ఏఐఎస్ఏ‌టీఎస్ కార్యాలయంలో సిబ్బంది పార్టీ చేసుకున్నారు. దీంతో సీనియర్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విమాన ప్రమాద బాధితుల కుటుంబాలు మృతదేహాల కోసం ఇప్పటికీ వేచిచూస్తుంటే ఇక్కడ సిబ్బంది ఎంజాయ్ చేస్తున్నారని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ విలువలు, నిబద్ధత, ప్రొఫెషనలిజంపై ప్రశ్నలు కురిపించారు.


దీనిపై ఏఐఎస్ఏటీఎస్ వెంటనే స్పందించింది. నలుగురు సీనియర్ ఉద్యోగులను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. తక్కిన సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆఫీసులో జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, సిబ్బంది ప్రవర్తన సంస్థ విలువలకు అనుగుణంగా లేనందున క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.


ఇవి కూడా చదవండి..

3 రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారుల నియామకం

సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. ఎందుకంటే

For More National News

Updated Date - Jun 27 , 2025 | 10:00 PM