Aero India: 5 నుంచి విమాన రాకపోకలకు అంతరాయం
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:17 AM
ఈనెల 5నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు విమాన రాకపోకలు నిలిపివేయనున్నట్టు కేఐఏ ప్రకటించింది.

బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శనల కారణంగా..
బెంగళూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనల నేపథ్యంలో ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరుకు అనుబంధమైన కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కేఐఏ) నుంచి విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈనెల 5నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు విమాన రాకపోకలు నిలిపివేయనున్నట్టు కేఐఏ ప్రకటించింది. 7, 9 తేదీల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రాకపోకలు ఆపేస్తారు. ఈనెల 10న ఎయిర్‌షో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ రోజున ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు విమాన రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తారు. 11, 12 తేదీల్లో మధ్యాహ్నం 12 నుంచి రెండున్నర గంటలదాకా, 13, 14 తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విమానాల రాకపోకలు ఉండవు. ఇప్పటికే విమాన ప్రయాణాలకు సిద్ధమైనవారు సంబంధిత వైమానిక సంస్థ ల నుంచి వివరాలు తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి