Share News

Indian Air Force: సీఐఎస్ సీగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - May 02 , 2025 | 04:18 AM

ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీఐఎస్ సీ)గా బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల సమన్వయంలో కీలకమైన ఈ పదవికి ఆయనను లెఫ్టినెంట్‌ జనరల్‌ జేపీ మాథ్యూ స్థానంలో నియమించారు.

Indian Air Force: సీఐఎస్ సీగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, మే 1: ఎయుర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌.. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీఐఎ్‌ససీ)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల మధ్య సమన్వయంలో సీఐఎ్‌ససీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ జేపీ మాథ్యూ సీఐఎ్‌ససీగా బుధవారం పదవీ విమరణ చేయగా ఆ స్థానంలో ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అశుతోష్‌ దీక్షిత్‌ సెంట్రల్‌ ఎయిర్‌ కమాండ్‌లో ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా పని చేశారు. దాదాపు 40 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అశుతోష్‌ దీక్షిత్‌ వాయు సేనలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:18 AM