Share News

Air India: 19 రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల కుదింపు

ABN , Publish Date - Jun 22 , 2025 | 08:34 PM

ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడం, విస్తృత ఆపరేషన్ స్టెబిలిటీ, చివరి నిమిషంలో ప్రయాణికులకు అసౌకర్యంగా కలగకుండా నివారించేందుకు విమాన సర్వీసులను కుదించినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

Air India: 19 రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల కుదింపు
Air India Flight

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) మరిన్ని సర్వీసులను తాత్కాలికంగా కుదిస్తున్నట్టు ఆదివారంనాడు ప్రకటించింది. మూడు రూట్లలో సర్వీసులను రద్దు చేస్తున్నామని, 19 దేశవాళీ రూట్లలో (Domestic routes) సర్వీసులను జూలై 15 వరకూ కుదిస్తున్నామని తెలిపింది. ఎయిర్‌లైన్స్ ఇంతకు ముందు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సర్వీసులకు అదనంగా తాజా కుదింపు వర్తించనుంది. జూన్ 21 నుంచి జూలై 15 వరకూ 38 అంతర్జాతీయ విమానాలను తగిస్తున్నామని, మూడు ఓవర్సీస్ రూట్లలో ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని ఇటీవల ఎయిర్ ఇండియా ప్రకటించింది.


కాగా, తాజాగా ఎయిర్ ఇండియా సస్పెండ్ చేసిన, కుదించిన సర్వీసుల్లో... బెంగళూరు-సింగపూర్ (AI2392/2393) సర్వీసును సస్పెండ్ చేయగా, బెంగళూరు-ఛండీగఢ్ సర్వీసుల ఫ్రీక్వెన్సీని 14 వీక్లీ సర్వీసుల నుంచి 7 వీక్లీ సర్వీసులకు తగ్గించింది. ముంబై-బెంగళూరు సర్వీసుల ఫ్రీక్వెన్సీని 91 నుంచి 84కి, ఢిల్లీ-బెంగళూరు సర్వీసులను116 నుంచి 113కి కుదించింది. పునె-సింగపూర్ (AI2111/2110), ముంబై-బాగ్డోగ్రా (AI551/552) సర్వీసులను సస్పెండ్ చేశారు.


ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడం, విస్తృత ఆపరేషన్ స్టెబిలిటీ, చివరి నిమిషంలో ప్రయాణికులకు అసౌకర్యంగా కలగకుండా నివారించేందుకు విమాన సర్వీసులను కుదించినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. తాత్కాలికంగా సర్వీసులను తగ్గించినప్పటికీ నారో-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా 120 డొమెస్టిక్, స్వల్ప దూర అంతర్జాతీయ రూటల్లో ప్రతిరోజూ సుమారు 600 విమానాలను నడుపుతామని తెలిపింది. ఇరాన్‌పై అమెరికా దాడి నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నందున ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలంపై తమ విమానాలను ఆపరేట్ చేయడం లేదని మరో ప్రకటనలో ఎయిర్ ఇండియా తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు

ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు

For National News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 08:35 PM