Share News

Flight: జూన్‌ నుంచి తిరుచ్చి - హైదరాబాద్‌ విమాన సేవలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:16 PM

తిరుచ్చి - హైదరాబాద్‌ మధ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. వచ్చే జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ సేలు అందుబాటులోకి రానున్నాయి. తిరుచ్చి విమానాశ్రయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు ఇండిగో విమాన సేవలను నడుపుతోంది.

Flight: జూన్‌ నుంచి తిరుచ్చి - హైదరాబాద్‌ విమాన సేవలు

చెన్నై: వచ్చే జూన్‌ ఒకటో తేదీ నుంచి తిరుచ్చి - హైదరాబాద్‌(Tiruchi - Hyderabad) ప్రాంతాల మధ్య విమాన సేవలను ప్రారంభించనున్నట్టు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌(Air India Express) సంస్థ వెల్లడించింది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు ఇండిగో విమాన సేవలను నడుపుతోంది. మిగిలిన విమాన సర్వీసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: ‘కాబోయే ముఖ్యమంత్రి నయినార్‌ నాగ్రేందన్‌’


ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి హైదరాబాద్‌ నగరానికి అదనపు విమాన సర్వీసులను నడపాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో ఎయిర్‌ ఇండియా ఈ రెండు ప్రాంతాల మధ్య విమాన సేవలను నడిపేందుకు ముందుకు వచ్చింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సేవలు ప్రతి రోజు ఉదయం 9.45 తిరుచ్చిలో బయలుదేరి, మధ్యాహ్నం 11.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.


అలాగే, హైదరాబాద్‌(Hyderabad)లో ఉదయం 7.35 గంటలకు బయలుదేరి తిరుచ్చికి 9.15 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య విమాన ప్రయాణ చార్జీని రూ.4,200గా నిర్ణయించగా, పూర్తి వివరాల కోసం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్

అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

నదిలో పడవ బోల్తా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 12:16 PM