Ahmedabad: బ్లాక్ బాక్స్ దొరికింది!
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:32 AM
అహ్మదాబాద్‌లో జరిగి న ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీని కి కారణాలేంటి? సాంకేతిక వైఫల్యమా? పక్షు లు ఢీకొన్నాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపే కీలకమైన బ్లాక్‌బాక్స్ ఎట్టకేలకు లభించింది.
విమాన ప్రమాద కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం
అహ్మదాబాద్, జూన్13: అహ్మదాబాద్‌లో జరిగి న ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీని కి కారణాలేంటి? సాంకేతిక వైఫల్యమా? పక్షు లు ఢీకొన్నాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపే కీలకమైన బ్లాక్‌బాక్స్ ఎట్టకేలకు లభించింది. నారింజ రంగులో దీర్ఘచతురస్రాకృతిలో ఉండే బ్లాక్‌బాక్స్ ద్వారా విమాన ప్రమాదాలకు సంబంధించిన కీలక విషయాలు తెలుస్తాయి. ఏ నిమిషానికి ఏం జరిగిందో దీనిలో నిక్షిప్తమవుతుంది. విచారణాధికారులకు ఇది అత్యంత కీలకం. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐ-171 విమాన ప్రమాదం తర్వా త అందరి దృష్టీ బ్లాక్ బాక్స్‌పైపడింది. దీని కోసం అధికారులు తీవ్రంగా గాలించారు. శుక్రవారం వైద్య విద్యార్థుల హాస్టల్ శిథిలాల్లో పైకప్పు కింద బ్లాక్ బాక్సును గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు గుర్తించారు. ఈ విమానంలో రెండు బ్లాక్ బాక్సులున్నాయి. వీటిలో ఒకటి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) దొరికిందని డీజీసీఏ అధికారవర్గాలు తెలిపాయి.
దీనిలో రికార్డయిన సం భాషణలను విశ్లేషించనున్నట్టు పేర్కొన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ‘మేడే కాల్’ వ్యవహారం వెలుగుచూడడంతో దానిపై దృష్టి సారించనున్నారు. కాగా బ్లాక్ బాక్స్‌లు క్రాష్ రెసిస్టెంట్‌గా పనిచేస్తాయి. తీవ్ర విపత్తులు, అగ్ని ప్ర మాదాలు వంటివి సంభవించినప్పుడు వాటిని గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందిస్తారు. ప్రతి కమర్షియల్ విమానంలోనూ రెండు చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక దాన్ని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్)గా, రెండో దాన్ని ఫ్లైట్ డేటా రికార్డర్(ఎ్‌ఫడీఆర్)గా పేర్కొంటారు. భూమిపై, నదులు, సముద్రాల్లో విమాన ప్రమాదాలు సం భవించినా బ్లాక్ బాక్స్‌లు సమాచారాన్ని పదిలంగా ఉంచుతాయి. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిలో నిక్షిప్తమౌతుంది. ఈ రెం డింటిలోని డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడారో, వ్యవస్థలెలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటనలో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్ఫోటనం జరిగింది. అయినా డీవీఆర్‌తో కూడిన బ్లాక్ బాక్స్ చెక్కు చెదరలేదు.