Agni 5 Ballistic Missile: అగ్ని 5 ఇంటర్‌మీడియట్ రేంజ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:44 PM
Agni 5 Ballistic Missile: అగ్ని 5ను ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్‌లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్.
ఇంటర్‌మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని 5‘ పరీక్ష విజయవంతం అయింది. బుధవారం ఒడిశా, చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని 5 పరీక్ష జరిగింది. ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో .. ‘ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. భారత అమ్ములపొదిలోకి మరో అణ్వాయుధం వచ్చి చేరింది’ అని పేర్కొంది.
అగ్ని 5 ప్రత్యేకతలు
అగ్ని 5ను ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్‌లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్. ఇది ఉపరితలం మీదనుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. అగ్ని 5 రేంజ్‌ను మరింత పెంచడానికి డీఆర్‌డీఓ ప్రయత్నిస్తోంది. 7,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేయాలని చూస్తోంది. అగ్ని 5 ఒకే సారి మూడు బాంబులను పేల్చగలదు. డీఆర్‌డీఓ అగ్ని 5లో కొత్త వేరియంట్లను అభివృద్ధి చేస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇండియాలో లాంచ్ అయిన రియల్‌మీ పీ4 ఫోన్లు
కర్నూలులో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారుల మృతి