Khushboo: సినీనటి ఖుష్బుకు కీలక పదవి..
ABN , Publish Date - Jul 31 , 2025 | 10:36 AM
ప్రముఖ సినీనటి ఖుష్బు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైనట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ప్రకటించారు. టి.నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో బుధవారం సాయంత్రం నటి ఖుష్బుతో పాటు ఉపాధ్యక్షులుగా నియమితులైన 14 మంది జాబితా విడుదల చేశారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు
చెన్నై: ప్రముఖ సినీనటి ఖుష్బు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైనట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(Nayanar Nagendran) ప్రకటించారు. టి.నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో బుధవారం సాయంత్రం నటి ఖుష్బు(Khushboo)తో పాటు ఉపాధ్యక్షులుగా నియమితులైన 14 మంది జాబితా విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితో రాష్ట్ర విభాగానికి నూతన నిర్వాహకులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
ఎం.చక్రవర్తి, వీపీ దురైస్వామి, కేపీ రామలింగం, కరునాగరాజన్, శశికళ పుష్ప, కనక సభాపతి, డాల్ఫిన్ శ్రీధర్, ఏజీ సంపత్, జయప్రకాశ్, ఎం.వెంకటేశన్, గోపాల్‌స్వామి, ఖుష్బు, ఎన్.సుందర్ పాల్ కనకరాజ్‌లను పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షులుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కేశవ వినాయగం, బాలగణపతి, రామ శ్రీనివాసన్, ఎం.మురుగానందం, కాత్యాయణి, ఏబీ మురుగానందం నియమితులయ్యారు.

కాగా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులుగా కరాటే త్యాగరాజన్, అమర్‌ప్రసాద్ రెడ్డిలతో పాటు 15 మంది నియిమితులయ్యారు. రాష్ట్ర కోశాధికారిగా ఎస్‌ఆర్.శేఖర్, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఎం.చంద్రన్, ప్రధాన కార్యాలయ ప్రచారకర్తగా నారాయణన్ తిరుపతిలతో పాటు పార్టీ అధిష్టానం అనుమతించిన వారిని పార్టీ పదవులకు ఎంపిక చేసినట్లు నయినార్ నాగేంద్రన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News