Hero Vijay: హీరో విజయ్‌తో ఆదవ్ అర్జున్ భేటీ..
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:13 PM
గతంలో డీఎంకేతో అత్యంత సన్నిహితంగా మెలగి, ఆ తరువాత ఆ పార్టీకి బద్దశత్రువులా మారిన పారిశ్రామికవేత్త ఆదవ్ అర్జున్(Industrialist Aadav Arjun) ప్రముఖ సినీ నటుడు విజయ్(Film actor Vijay)తో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం పనయూరులోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) కార్యాలయానికి వెళ్లిన ఆదవ్ అర్జున్.. విజయ్‌తో సమావేశమయ్యారు.

- త్వరలో టీవీకేలో చేరిక.. ఆ వెంటనే కీలక పదవి?
- పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం!
చెన్నై: గతంలో డీఎంకేతో అత్యంత సన్నిహితంగా మెలగి, ఆ తరువాత ఆ పార్టీకి బద్దశత్రువులా మారిన పారిశ్రామికవేత్త ఆదవ్ అర్జున్(Industrialist Aadav Arjun) ప్రముఖ సినీ నటుడు విజయ్(Film actor Vijay)తో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం పనయూరులోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) కార్యాలయానికి వెళ్లిన ఆదవ్ అర్జున్.. విజయ్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారి మధ్య పార్టీ వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా ఆదవ్ అర్జున్ త్వరలోనే టీవీకేలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన పార్టీలో చేరగానే కీలక పదవి ఇచ్చేందుకు విజయ్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ వ్యూహకర్తగా ఆయన్ని నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: MK MPs: గవర్నర్‌కు ప్రవర్తనా నియమావళి రూపొందించండి
ఆదవ్ అర్జున్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకే అధినేత స్టాలిన్(Stalin)కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డీఎంకేకు పని చేయడానికి కూడా ఆదవ్ అర్జునే కారణం. అయితే డీఎంకే అధికారంలోకి వచ్చాక.. ఆదవ్ అర్జున్(Aadav Arjun)ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన.. డీపీఐలో చేరారు. అక్కడా ఆయనకు స్వేచ్ఛ లేకపోవడంతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయ్‌తో భేటీ కావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
జిల్లా నేతలతో విజయ్ భేటీ
టీవీకే అధినేత విజయ్.. బుధవారం కొత్తగా నియమితులైన 19 జిల్లా శాఖ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ప్రజలకు చేరువ కావాలని విజయ్ సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న 19 జిల్లా శాఖల నేతలకు ఆయన వెండి నాణేలను కానుకగా అందజేశారు. ఈ సమావేశం ముగిసిన కాసేపటికి కొన్ని జిల్లాల కార్యదర్శులను నియమిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.
సౌత్‌చెన్నై నార్త్ జిల్లా శాఖ కార్యదర్శి టి.నగర్ కె. అప్పు (టి.నగర్, థౌజెండ్‌లైట్స్), సౌత్ చెన్నై సౌత్ జిల్లా శాఖ కార్యదర్శిగా దాము, (సైదాపేట, విరుగంబాక్కం), చెన్నై ఈస్ట్ జిల్లా శాఖ కార్యదర్శిగా అంబత్తూరు జి. బాలమురుగన్ (అంబత్తూరు, మధురవాయల్), చెన్నై సబర్బన్ జిల్లా శాఖ కార్యదర్శిగా ఈసీఆర్ శరవణన్ (షోళింగనల్లూరు, ఆలందూరు), మైలాడుదురైకి కుట్టి గోపి, కళ్ళకురిచ్చికి ప్రకాష్, కన్నియాకుమారి ఈస్ట్ జిల్లా శాఖ కార్యదర్శిగా మాధవన్, వెస్ట్ జల్లా శాఖ కార్యదర్శిగా సబీన్, నాగపట్టినంకు సుకుమార్, దిండుగల్‌కు ధర్మా, ధర్మపురికి శివా, పుదుకోటకు పర్వేష్ నియమితులయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News