Share News

Indian youth: ఉచిత వీసా సమకూరిస్తే విదేశీ కొలువులకు సై

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:28 AM

ఉచితంగా వీసా, నియామకం, అవసరమైన శిక్షణ సమకూరిస్తే విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు దేశం..

Indian youth: ఉచిత వీసా సమకూరిస్తే విదేశీ కొలువులకు సై

న్యూఢిల్లీ, జూలై 14: ఉచితంగా వీసా, నియామకం, అవసరమైన శిక్షణ సమకూరిస్తే విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు దేశంలో ప్రతి పదిమంది యువతలో తొమ్మిది మందికి పైగా (92%) ఆసక్తిగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. సరైన మార్గదర్శకం లేకపోవడం, ఇటీవల కాలంలో వలస ప్రక్రియలో మోసాలు పెరగడం, అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, విశ్వసనీయ వనరులు పరిమితంగా ఉండటం.. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని ఏఐ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ సంస్థ టెర్న్‌ గ్రూప్‌ వెల్లడించింది. విదేశాల్లో ఉద్యోగాలకు ఎక్కువగా డిమాండ్‌ ఉన్న ఇంజనీరింగ్‌, లాజిస్టిక్స్‌, హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన 2,500 మంది అభ్యర్థుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వే ప్రకారం 57 శాతం మందికి దరఖాస్తు ప్రక్రియ ఎలా ప్రారంభించాలో తెలియదు. నమ్మదగని ఏజెంట్లు, విదేశీ నియామక సంస్థలు పెరిగిపోతుండటంతో విదేశాల్లో పనిచేయడానికి 34.60 శాతం మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 04:28 AM