Share News

ప్రపంచ టాప్‌-50 జాబితాలో 9 భారతీయ విద్యా సంస్థలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:16 AM

భారత్‌లోని 9 యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ‘క్యూఎస్‌’ ప్రపంచ టాప్‌-50 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

ప్రపంచ టాప్‌-50 జాబితాలో 9 భారతీయ విద్యా సంస్థలు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): భారత్‌లోని 9 యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ‘క్యూఎస్‌’ ప్రపంచ టాప్‌-50 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. సబ్జెక్టుల వారీగా ఇచ్చిన ఈ ర్యాంకుల్లో మినరల్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో ధన్‌బాద్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ (ఐఎ్‌సఎం) 20వ ర్యాంకుతో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలిచింది. ఇదే సబ్జెక్టులో ముంబై, ఖరగ్‌పూర్‌ ఐఐటీలు వరుసగా 28, 45 స్థానాలు దక్కించుకున్నాయి. ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌లో ఢిల్లీ, ముంబై ఐఐటీలు టాప్‌-50లో చోటు సంపాదించాయి. ఐఐటీ మద్రాస్‌ (పెట్రోలియం ఇంజనీరింగ్‌), జేఎన్‌యూ (డెవల్‌పమెంట్‌ స్టడీస్‌) టాప్‌-50లో నిలిచాయి.


దంత వైద్య శాస్త్రంలో సవిత మెడికల్‌, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (తమిళనాడు) కూడా టాప్‌-50లో చోటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ సత్తా చాటింది. ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించింది. ఆంగ్ల భాష- సాహిత్యం కోర్సుకు 251-300 బ్యాండ్‌ ర్యాంకింగ్‌ లభించింది. లింగ్విస్టిక్స్‌ 301-350, సోషియాలజీ 301-375, కెమిస్ట్రీ 451-500, ఎకనామిక్స్‌-ఎకనామెట్రిక్స్‌ 501-550, ఫిజిక్స్‌-ఖగోళశాస్త్రం 601-675, బయోలాజికల్‌ సైన్సె్‌సలో 651-700 బ్యాండ్‌ ర్యాంకింగ్‌ దక్కింది.

Updated Date - Mar 13 , 2025 | 06:17 AM