Afghanistan: అఫ్గాన్‌లో బస్సు దగ్ధం.. 79 మంది దహనం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:17 AM
అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు.
కాబూల్, ఆగస్టు 20: అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 19 మంది పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో, ఇరాన్ నుంచి వస్తున్న శరణార్థుల బస్సు ఒక ట్రక్కు, బైకును వేగంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న చాలా మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.