Share News

Chennai News: చదువుకు వయసు అడ్డం కాదుగా.. 72 ఏళ్ల వయస్సులో..

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:26 AM

చదువుకు వయస్సు అడ్డంకి కాదు, ఏ వయస్సులోనైనా ఆసక్తి, పట్టుదల ఉంటే చదువుకోవచ్చని మైలాడుదురైకి చెందిన ఓ వృద్ధుడు ఎలుగెత్తి చాటుతున్నారు. కడలూరు జిల్లా వడలూరు ప్రాంతంలో సెల్వమణి (72) అనే వృద్ధుడు నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Chennai News: చదువుకు వయసు అడ్డం కాదుగా.. 72 ఏళ్ల వయస్సులో..

- 72 యేళ్ల వయసులో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

చెన్నై: చదువుకు వయస్సు అడ్డంకి కాదు, ఏ వయస్సులోనైనా ఆసక్తి, పట్టుదల ఉంటే చదువుకోవచ్చని మైలాడుదురైకి చెందిన ఓ వృద్ధుడు ఎలుగెత్తి చాటుతున్నారు. కడలూరు జిల్లా వడలూరు ప్రాంతంలో సెల్వమణి (72) అనే వృద్ధుడు నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరందరికి పెళ్ళిళ్లు జరిగాయి. ప్రస్తుతం భార్యతోపాటు ఉంటున్నారు. ఐటీఐ చదవిన సెల్వమణి నైవేలి బొగ్గు సొరంగంలో పని చేస్తున్నప్పుడు ఎంకామ్‌, ఎంబీఏ పాసయ్యారు.


రిటైర్‌ అయి పదేళ్లు దాటినా ఆయనకు చదువులపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. మైలాడుదురై జిల్లా కొళ్లిడంమ్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో చేరి ప్రస్తుతం సెకెండ్‌ ఇయర్‌ చదువుతున్నారు. విద్యార్థులతో సమానంగా యూనిఫామ్‌ ధరించి పుస్తకాల బ్యాగ్‌ పట్టుకుని రోజూ కాలేజీకి వెళుతున్నారు. విద్యార్థులంతా ఆయనను ‘తాతయ్యా’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు.


nani4.jpg

వృద్ధాప్య సమస్యల కారణంగా ఇంటిలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు రోజు సపర్యలు చేసిన మీదట ఆయన ఉదయం 9 గంటలకల్లా కాలేజీకి హాజరవుతున్నారు. సాయంత్రం 5 దాకా తరగతులకు హాజరై, మళ్ళీ తన స్వస్థలమైన వడలూరుకు చేరుకుంటారు. ఇంత వయస్సులోనూ చదువుపై ఆయన చూపుతున్న శ్రద్ధకు అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు జోహార్లు అర్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 11:26 AM