Cloudbursts Hit Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరుస మేఘ విస్ఫోటాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:01 AM
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం మేఘ విస్ఫోటాలు సంభవించాయు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు..
నాలుగు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్.. ఐదుగురి మృతి.. 11మంది గల్లంతు
దెహ్రాదూన్, ఆగస్టు 29: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం మేఘ విస్ఫోటాలు సంభవించాయు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు. 11మంది గల్లంతయ్యారు. అనేక మంది ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి చాలా ప్రాంతాల్లో రోడ్లు మూసుకుపోయాయి. శుక్రవారం ఉదయం చమోలీ, టెహ్రీ, బాఘేశ్వర్, రుద్రప్రయాగ జిల్లాల్లో మేఘ విస్ఫోటాలు సంభవించాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడటంతో చమోలీ జిల్లాలోని ఓ గ్రామంలో పశువుల కొట్టం పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. అందులో ఉన్న దంపతులిద్దరూ చనిపోయారు. ఇరవైకి పైగా పశువులు గల్లంతైనట్లు తెలుస్తోంది. బాఘేశ్వర్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. భారీ వరదలతో రుద్రప్రయాగ జిల్లాలో ఓ మహిళ చనిపోయింది. అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..