Share News

4 Day Workweek: వారానికి నాలుగు రోజులే పని దినాలు.. కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి..

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:13 AM

జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇండియాలో మూడు రోజుల వీకాఫ్ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి?..

4 Day Workweek: వారానికి నాలుగు రోజులే పని దినాలు.. కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి..
4 Day Workweek

ప్రతీ ఉద్యోగికి జీతం పడే రోజు ఎంత ముఖ్యమో.. వీకాఫ్ కూడా అంతే ముఖ్యం. వారం మొత్తం గొడ్డులా పని చేసిన ఉద్యోగులు వీకాఫ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు ప్రభుత్వ, కార్పోరేట్ ఆఫీసుల్లో వారానికి రెండు వీకాఫ్‌లు ఉంటాయి. ఐదు రోజులు కష్టపడ్డ ఉద్యోగులు రెండు రోజులు సెలవులు తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పని దినాలు.. మూడు వీకాఫ్‌లు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇండియాలో మూడు రోజుల వీకాఫ్ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి?..


డిసెంబర్ 12వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లయ్‌మెంట్ తమ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో వారానికి నాలుగు రోజుల పని దినాలపై చర్చించింది. ‘మిత్ బస్టర్’ పేరిట ఆ పోస్టు పెట్టింది. వారానికి నాలుగు రోజుల పని దినాలపై ఉన్న అపోహలకు పులుస్టాప్ పెట్టింది. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వారానికి నాలుగు రోజులు వీకాఫ్‌లు కావాలంటే.. ప్రతి రోజూ 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే 3 రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ వస్తాయి. 12 గంటల్లో ఇంటర్వెల్ కూడా ఉంటుంది. వారానికి పని గంటలు 48 గంటలుగానే కొనసాగుతాయి. రోజులో సాధారణ పని గంటల కంటే ఎక్కువ పని చేస్తే జీతాన్ని డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.


పాత లేబర్ లాస్‌కు చెల్లు చీటి

2025, నవంబర్ 21వ తేదీన భారత ప్రభుత్వం 29 పాత లేబర్ లాస్‌ను తొలగించింది. కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకుని వచ్చింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్ కోడ్ 2020లను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ఉద్యోగుల వర్క్‌ప్లేస్ రైట్స్‌ను కాపాడ్డానికి ఈ కొత్త లేబర్ కోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ఏపీలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. సిక్స్‌లేన్‌తో ఊరట

ఏపీలో వీధికుక్కల బెడద.. ఏబీసీ ఆపరేషన్‌తో కట్టడి చేసేందుకు యత్నం

Updated Date - Dec 15 , 2025 | 11:21 AM