Share News

Kumbh Mela : గతంలోనూ విషాదాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:03 AM

1954లో అతి పెద్ద విషాదం మహా కుంభమేళాలో తొక్కిసలాటలు గతంలోనూ జరిగాయి. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి, 1954లో జరిగిన మహా కుంభమేళా దేశ చరిత్రలోనే అతి పెద్ద విషాదాన్ని మిగిల్చింది. మౌని అమావాస్యను

Kumbh Mela : గతంలోనూ విషాదాలు

1954లో అతి పెద్ద విషాదం

మహా కుంభమేళాలో తొక్కిసలాటలు గతంలోనూ జరిగాయి. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి, 1954లో జరిగిన మహా కుంభమేళా దేశ చరిత్రలోనే అతి పెద్ద విషాదాన్ని మిగిల్చింది. మౌని అమావాస్యను పురస్కరించుకుని 1954 ఫిబ్రవరి 3న అలహాబాద్‌(ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌)లో పుణ్యస్నానం ఆచరించేందుకు 50 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు.

1986లో 200 ప్రాణాలు బలి

1986లో హరిద్వార్‌ వేదికగా జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీర్‌ బహదూర్‌ సింగ్‌ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలతో కలిసి హరిద్వార్‌లోని కుంభమేళా ప్రాంగణానికి వచ్చారు. దీంతో సామాన్య ప్రజలను నదీ తీరానికి వెళ్లనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట తొక్కిసలాటకు దారి తీసి విషాదాన్ని మిగిల్చింది.


2003 నాసిక్‌లో 39 మంది మృతి

2003లో మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన 39 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

12 ఏళ్ల క్రితం 36 మంది దుర్మరణం

సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2013లో మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వచ్చిన 36 మంది చనిపోయారు. ఈ తొక్కిసలాట ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కూలడంతో కలకలం రేగి తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. నాటి కుంభమేళా ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రి అజామ్‌ ఖాన్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2008లో నైనా దేవీ ఆలయం వద్ద 160 మంది

2008 ఆగస్టులో హిమాచల్‌ ప్రదేశ్‌లోని నైనా దేవీ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 160 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అమ్మవారి దర్శనానికి సుమారు 20వేల మంది భక్తులు వేచి ఉండగా.. కొండపై నుంచి రాళ్లు జారి పడుతున్నాయనే వదంతి వ్యాపించి తొక్కిసలాటకు దారి తీసింది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:04 AM