Share News

14 Year Old Student: చదవటం లేదని శిక్ష.. ఊహించని నిర్ణయం తీసుకున్న బాలిక

ABN , Publish Date - Jun 25 , 2025 | 08:04 PM

14 Year Old Student: ఆమెను 9వ తరగతి నుంచి 8వ తరగతిలో కూర్చోబెట్టారు. దాన్ని బాలిక తీవ్ర అవమానంగా భావించింది. మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకుంది.

14 Year Old Student: చదవటం లేదని శిక్ష.. ఊహించని నిర్ణయం తీసుకున్న బాలిక
14 Year Old Student

స్కూలు ఫ్యాకల్టీ తీసుకున్న ఓ నిర్ణయం బాలిక ప్రాణాలు బలి తీసుకుంది. బాలిక సరిగా చదవటం లేదన్న కారణంతో 8వ తరగతి నుంచి 9వ తరగతిలో కూర్చోబెట్టటంతో మానసికంగా కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కేరళలోని పాలక్కాడ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ, తచ్చనట్టుకాకు చెందిన 14 ఏళ్ల ఆషిర్‌నంద.. శ్రీక్రిష్ణాపురంలోని సెయింట్ డామినిక్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.


బాలిక సరిగా చదవటం లేదని, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేదని స్కూలు ఫ్యాకల్లీ ఓ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆమెను 9వ తరగతి నుంచి 8వ తరగతిలో కూర్చోబెట్టారు. దాన్ని బాలిక తీవ్ర అవమానంగా భావించింది. మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో తల్లిదండ్రులు తలుపు దగ్గరకు వెళ్లి పిలిచారు. లోపలినుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరో సారి పిలిచినా బాలిక పలకలేదు.


దీంతో అనుమానం వచ్చి.. తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. బాలిక విగతజీవిగా కనిపించింది. తల్లిదండ్రుల గుండె పగిలింది. కన్నీరుమున్నీరుగా విలపించారు. కొంతసేపటి తర్వాత పోలీసులకు సమాచారం వెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, స్కూలు యజమాన్యం తప్పు కారణంగానే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

వీడు మామూలోడు కాదు.. ప్రాణం కంటే తిండే ఎక్కువైంది..

భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు

Updated Date - Jun 25 , 2025 | 08:16 PM