Share News

Viral Video: వీడు మామూలోడు కాదు.. ప్రాణం కంటే తిండే ఎక్కువైంది..

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:45 PM

Viral Video: కొన్ని సెకన్ల తర్వాత ఆ బాలుడు డైనింగ్ టేబుల్ దగ్గరినుంచి డోరు దగ్గరకు వచ్చాడు. తండ్రితో పాటు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. కొంత భోజనాన్ని నోటిలో కుక్కుకున్నాడు.

Viral Video: వీడు మామూలోడు కాదు.. ప్రాణం కంటే తిండే ఎక్కువైంది..
Viral Video

భూకంపం వస్తుందంటే ఎవరైనా ఏం చేస్తాం.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సురక్షితమైన ప్రదేశంలోకి పరుగులు పెడతాం. సెకను ఆలస్యం చేసినా ప్రాణాలు పోతాయన్న భయంతో బుర్ర, కాళ్లకు పని చెబుతాం. ఏ పనిలో ఉన్నా సరే.. కోట్లు తెచ్చే పనైనా సరే.. మధ్యలోనే వదిలేస్తాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ బాలుడు ప్రాణాలకంటే తిండే ముఖ్యం అనుకున్నాడు. భూకంపం సమయంలోనూ తిండి తినడానికే మొగ్గు చూపాడు. ఈ సంఘటన చైనాలోని కింగ్‌యాన్‌లో సోమవారం చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనా, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌యాన్‌లో సోమవారం భూకంపం వచ్చింది. రెక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంపం సమయంలో భవనాలు కంపించాయి. దీంతో అందులోని వారు బయటకు పరుగులు తీశారు. భూమి కంపిస్తున్న సమయంలో ఓ బాలుడు తన తండ్రి, తమ్ముడితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారుండే అపార్ట్‌మెంట్ కూడా కంపించింది. దీంతో తండ్రి భయపడిపోయాడు. చిన్న కొడుకును డైనింగ్ హాలు నుంచి డోరు దగ్గరకు లాక్కెళ్లాడు. ‘భూకంపం వస్తోంది’ అని పెద్ద కొడుక్కు చెప్పాడు.


కొన్ని సెకన్ల తర్వాత ఆ బాలుడు డైనింగ్ టేబుల్ దగ్గరినుంచి డోరు దగ్గరకు వచ్చాడు. తండ్రితో పాటు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. కొంత భోజనాన్ని నోటిలో కుక్కుకున్నాడు. తర్వాత ఓ ప్లేటులో ఉన్న మాంసం కర్రీని తీసుకుని తలుపు దగ్గరకు పరిగెత్తాడు. తండ్రి తిట్టడంతో ప్లేటు వెనక్కు తెచ్చాడు. మాంసాన్ని నోటిలో కుక్కుకుని మరీ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

భీమవరంలో దారుణం.. వివాహిత గొంతు కోసిన యువకుడు

అంతరిక్షంలోకి శుభాంశు..మొదటి సందేశం ఇదే..

Updated Date - Jun 25 , 2025 | 05:55 PM