119 మంది అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌కు మరో విమానం
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:08 AM
అక్రమ వలసదారుల తరలింపులో భాగంగా అమెరికా నుంచి మరో విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో మొత్తం 119 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 67 మంది పంజాబ్‌కు చెందినవారున్నారు.
67 మంది పంజాబ్ వాసులు, 33 మంది హరియాణా వాసులు
అమృత్‌సర్‌లో విమానం దిగడంపై పంజాబ్ సీఎం మాన్ అభ్యంతరం
అమృత్‌సర్, ఫిబ్రవరి15: అక్రమ వలసదారుల తరలింపులో భాగంగా అమెరికా నుంచి మరో విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో మొత్తం 119 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 67 మంది పంజాబ్‌కు చెందినవారున్నారు. హరియాణాకు చెందిన వారు 33 మంది, గుజరాత్ 8, యూపీ 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి ఇద్దరేసి ఉన్నారు. హిమాచల్, జమ్మూకశ్మీర్ కు చెందిన ఒక్కొక్కరున్నారు.
మరోవైపు తమ రాష్ట్రంలో విమానాలు దిగడాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. పంజాబీలు మాత్రమే అక్రమంగా వలస వెళ్తారని చెప్పడానికా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఇలాంటి సున్నితమైన విషయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం సరికాదని బీజేపీ విమర్శించింది.