Exam Paper Leak: నీట్‌పై తప్పుడు ప్రచార చానళ్లను గుర్తించాం
ABN , Publish Date - May 02 , 2025 | 04:08 AM
నీట్-యూజీ పరీక్షాపత్రం లీకైందని తప్పుడు ఆరోపణలు చేస్తున్న 106 టెలిగ్రామ్, 16 ఇన్‌స్టాగ్రామ్ చానళ్లను ఎన్టీఏ గుర్తించింది. ఈ దుష్ప్రచారంపై చర్యలు తీసుకునేందుకు ఎన్టీఏ కేంద్ర సైబర్ క్రైం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ, మే 1: ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 4న నిర్వహించే నీట్-యూజీ పరీక్షాపత్రం లీకైందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న సోషల్‌మీడియా చానళ్లను గుర్తించామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 106 టెలిగ్రామ్, 16 ఇన్‌స్టాగ్రామ్ చానళ్లు తప్పుడు ప్రచారంచేస్తున్నట్లు ఆ వర్గాల కథనం. ఈ తప్పుడు ప్రచారం ఆటకట్టించేందుకు ఎన్‌టీఏ ఏర్పాటుచేసిన ప్రత్యేక పోర్టల్‌కు 1500కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నీట్-యూజీ 2025 సమగ్రతను కాపాడేందుకు సదరు మోసపూరిత సోషల్‌మీడియా చానళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ఎన్టీఏ.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్‌కు ఫిర్యాదుచేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News