RSS: ఇండియా కాదు.. ‘భారత్’!
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:05 AM
ఈ నేపథ్యంలో పది లక్షల మంది పౌరుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది. ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్’ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించనుంది.

త్వరలో ఆర్‌ఎ్‌సఎస్ ఉద్యమం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: బీజేపీ సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎ్‌సఎస్) మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి వచ్చే నెల మార్చిలో శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో పది లక్షల మంది పౌరుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది. ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్’ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించనుంది. గతంలో ‘జాతీయ విద్యా విధానం’ కోసం ఈ సంస్థే ఉద్యమించింది. దేశంలోని అన్ని వర్గాల వారి నుంచి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదించనున్నట్టు న్యాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కొఠారి ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.