-
-
Home » Mukhyaamshalu » Today Breaking News In Telugu Live Updates Tuesday 11 th February 2025 Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Feb 11 , 2025 | 11:29 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Feb 11, 2025 12:31 IST
వైసీపీలోకి కీలక నేత..
తిరుపతి: వైసీపీలోకి గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు.
రేపు జగన్ సమక్షంలో గాలి జగదీష్ వైసీపీలో చేరే అవకాశం.
జగదీష్ చేరికపై రోజాకు సమాచారం ఇవ్వలేదని ప్రచారం.
నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలనే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం.
-
Feb 11, 2025 12:16 IST
వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం..
ఢిల్లీ: వామనరావు దంపతుల హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ.
కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టడానికి అభ్యంతరం లేదన్న సీబీఐ న్యాయవాది.
కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడానికి.. తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.
తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారన్న పుట్టమధు తరఫు లాయర్లు.
ఇద్దరు న్యాయవాదులను కోర్టు ప్రాంగణంలోనే హత్య చేశారని, సంబంధించిన వీడియోలు ఉన్నాయని తెలిపిన కిషన్‌రావు తరఫు లాయర్లు.
హత్య దృశ్యాలకు మించిన సాక్ష్యాలు ఏం కావాలన్న న్యాయవాది.
మరణ వాగ్మూలంలో ఎవరి పేరు చెప్పలేదన్న పుట్టమధు లాయర్లు.
వివరాలు సమర్పించేందుకు గడువు కోరిన పుట్టమధు న్యాయవాదులు.
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.
-
Feb 11, 2025 12:06 IST
ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
అమరావతి: మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం.
సచివాలయంలో సెక్రటరీల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు.
ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఏడుగురు చనిపోయారని వస్తున్న వార్తలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలుగు ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
-
Feb 11, 2025 11:29 IST
మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలో సిహోరా వద్ద ఘోర ప్రమాదం.
NH-30పై బస్సును ఢీకొట్టిన ట్రక్కు.
కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం.
సిహోరా దగ్గర బస్సును ఢీకొట్టిన ట్రక్కు
ఏడుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు
ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘటన
మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తింపు