-
-
Home » Mukhyaamshalu » telugu Viral trending Weather Telangana Andhra Pradesh national and international Breaking news 16 nov vreddy
-
BREAKING: నీటి కుంటలో పడి చిన్నారులు మృతి..
ABN , First Publish Date - Nov 16 , 2025 | 06:39 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 16, 2025 22:00 IST
నీటి కుంటలో పడి చిన్నారులు మృతి..
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం పందిగుంటలో విషాదం..
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..
గోరింటాకు వేరుతుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిన చిన్నారులు..
ముద్ద అవినాష్..(9).. పిల్లల సుధీర్(8).. అనే చిన్నారులు మృతి.
-
Nov 16, 2025 21:58 IST
సాంకేతిక లోపం.. భారీగా ట్రాఫిక్ జామ్..
కామారెడ్డి: బిక్కనూరు 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
ఫాస్టాగ్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిన వాహనాలు..
టోల్ ప్లాజా వద్ద తరుచూ సాంకేతిక లోపంతో నిలిచిపోతున్న వాహనాలు.
-
Nov 16, 2025 20:22 IST
కానిస్టేబుల్ సస్పెన్షన్
కామారెడ్డి: చోరీ కేసులో పట్టుబడ్డ బైక్‌ను వాడుకున్న కానిస్టేబుల్ విశ్వనాథ్ సస్పెన్షన్
చోరీ కేసులో సీజ్ చేసిన పల్సర్ బైక్‌ను వాడుకుంటున్న విశ్వనాథ్..
ఓ మెకానిక్ షాప్‌లో కనిపించిన బైక్..
గాంధారిలో విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్..
విచారణ జరిపి సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర.
-
Nov 16, 2025 20:14 IST
బీజేపీ అగ్రనేతలతో సమావేశాలు
ఢిల్లీకి చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్, ఉపేంద్ర
బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో పాటు.. కేబినెట్ పదవులపైనా నేతల మధ్య చర్చలు
-
Nov 16, 2025 19:35 IST
కిడ్నీ రాకెట్ కేసులో.. దర్యాప్తు వేగవంతం..
అన్నమయ్య జిల్లా: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం..
ఆరుగురు నిందితులకు వైద్యపరీక్షల తర్వాత జైలుకు తరలింపు..
ఏ1గా ఉన్న డాక్టర్ ఆంజనేయులు, కిడ్నీ మార్పిడి చేసిన ఏ2 డాక్టర్ పార్థసారథి కోసం పోలీసుల గాలింపు..
-
Nov 16, 2025 17:40 IST
సతీష్ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు..
అనంతపురం: సతీష్ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు
మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు..
చెన్నై- ఎగ్మోర్ రైలు నుంచి 3 బొమ్మలను కిందకి పడేసిన పోలీసులు..
A1 కోచ్ డోర్ దగ్గర నుంచి పడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే దానిపై విచారణ..
రైలు బోగీ మెట్ల దగ్గర కూర్చొని ప్రమాదశశాత్తు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో పరిశీలించిన పోలీసులు.
-
Nov 16, 2025 16:57 IST
రేపు భారీ వర్షాలు..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది..
దీని ప్రభావంతో సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ.
-
Nov 16, 2025 16:38 IST
పేలిన గ్యాస్ సిలిండర్.. పూరిల్లు దగ్ధం..
ఉమ్మడి నెల్లూరు: నాయుడుపేట పట్టణం లోతువాణిగుంట కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం..
ఇంట్లో బీరువాలో ఉన్న రెండు లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వస్తు సామాగ్రి దగ్ధం..
ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తప్పిన ప్రమాదం.
-
Nov 16, 2025 14:48 IST
రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం..
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా సమీపంలో కారు దగద్ధం..
ఇద్దరు ప్రయాణికులు క్షేమం.. హైదారాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు..
బైక్‌ను, ట్యాంకర్ లారీని ఢీకొన్న కారులో ఒక్క సారిగా మంటలు.
-
Nov 16, 2025 14:15 IST
భారత్ పరాజయం
ఈడెన్‌గార్డెన్స్: భారత్ పరాజయం..
తొలి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.
-
Nov 16, 2025 12:48 IST
చిత్తూరు: కుప్పంలో దారుణం
వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వైనం
మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్ (27)
అక్టోబర్ 27 నుంచి యువకుడు శ్రీనాథ్ అదృశ్యం
ఆర్థిక లావాదేవీలతో శ్రీనాథ్‌ను ప్రభాకర్ హత్య చేసినట్లు అనుమానం
గతంలో ప్రభాకర్‌పై హత్య కేసు నమోదు
కుప్పం అమరావతి కాలనీలో ఘటన
-
Nov 16, 2025 12:48 IST
articleText
-
Nov 16, 2025 12:46 IST
తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్
రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
పార్టీ ఫిరాయింపు MLAల కేసులో గడువులోగా..
స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్
కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
విడివిడిగా దాఖలైన 2 కేసులను రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
-
Nov 16, 2025 12:17 IST
బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
బిహార్‌లో ఈ నెల 19 లేదా 20న సీఎం ప్రమాణ స్వీకారం
బిహర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్‌కుమార్
పట్నా గాంధీమైదానంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్న సీఎం నితీష్‌కుమార్
-
Nov 16, 2025 11:49 IST
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగింది: బండి సంజయ్
హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందే: బండి సంజయ్
తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ బండి సంజయ్ పిలుపు
మీకోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయి: బండి సంజయ్
మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లే: బండి సంజయ్
అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూనే...
హిందూ ధర్మం కోసం పనిచేయాలి: బండి సంజయ్
హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం: బండి సంజయ్
పవన్‌కల్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల..
ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోంది: బండి సంజయ్
-
Nov 16, 2025 10:37 IST
ఢిల్లీ కారు పేలుడు కేసులో రెండు FIRలు నమోదు
యూనివర్సిటీ, ఉగ్రవాదులకు నిధులపై ఆరా
పేలుడు ఘటనాస్థలిలో 9mm బుల్లెట్లు లభ్యం
9mm కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
రెండు లైవ్, ఒక ఖాళీ షెల్ స్వాధీనం, పోలీసుల దర్యాప్తు
పేలుడు జరిగిన చోట కాట్రిడ్జ్‌లు ఎలా వచ్చాయనే దానిపై ఆరా
జైషే మహ్మద్ మాడ్యుల్‌పై పోలీసుల దర్యాప్తు
అక్రమ మార్గాల్లో ఉమర్ రూ.20 లక్షలు అందుకున్నట్లు దర్యాప్తులో గుర్తింపు
హవాలా డీలర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హవాలా మార్గాలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు
-
Nov 16, 2025 10:21 IST
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం
ఉగ్ర డాక్టర్ల సంబంధాలు, లింకులపై దర్యాప్తు
ఉమర్, ముజమ్మిల్‌తో సంబంధాలు ఉన్నవారిని..
అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
కాల్‌డేటా, నిందితుల సమాచారం అధారంగా దర్యాప్తు
15 మంది వైద్యుల కోసం పోలీసుల గాలింపు
అల్‌ఫలాహ్ యూనివర్సిటీలో అనేక పత్రాలు స్వాధీనం
యూనివర్సిటీ రికార్డులను తనిఖీ చేస్తున్న అధికారులు
-
Nov 16, 2025 09:50 IST
ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ అనుమానాస్సద మృతి కేసు దర్యాప్తు ముమ్మరం
ఈ నెల 13న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లలో ప్రయాణించిన..
1,140 మంది ప్రయాణికుల జాబితాను సేకరించిన పోలీసులు
ప్రయాణికుల్లో పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు
నేడు మరోసారి రైల్వే ట్రాక్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్
-
Nov 16, 2025 09:34 IST
అనంతపురం: RI సతీష్‌కుమార్ పోస్ట్‌మార్టం నివేదికపై ఉత్కంఠ
ప్రత్యేక టీంలతో పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిన్న గుంతకల్లు-తాడిపత్రి మార్గంలో రైళ్ల నుంచి..
ఓ బొమ్మను కిందికి తోసివేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన అధికారులు
సతీష్‌కుమార్ నమూనా బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలన
ఒక బొమ్మ 2 అడుగులు, మరో బొమ్మ 7 అడుగుల దూరంలోనే పడటంతో..
ఘటనపై పలు అనుమానాలు
సీన్ రీకన్‌స్ట్రక్షన్ పర్యవేక్షించిన ఎస్పీ జగదీష్
మరో వైపు సతీష్‌కుమార్ ఫోన్ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి క్షుణ్ణంగా పరిశీలన
గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు
-
Nov 16, 2025 09:34 IST
ఢిల్లీ కారు పేలుడు ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు
ఘటనాస్థలంలో 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: ఒక బుల్లెట్ ఉపయోగించినట్లు గుర్తించిన పోలీసులు
-
Nov 16, 2025 09:33 IST
ఐబొమ్మ, బప్పం టీవీలను మూసివేయించిన పోలీసులు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే క్లోజ్ చేయించిన పోలీసులు
వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐ బొమ్మ, బప్పం టీవీలు క్లోజ్
రవి దగ్గర ఉన్న వందల హార్డ్ డిస్క్‌లను విశ్లేషిస్తున్న పోలీసులు
ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతా వివరాలు పరిశీలిస్తున్న సైబర్‌క్రైమ్ పోలీసులు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కస్టడీకి కోరనున్న పోలీసులు
రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్న పోలీసులు
-
Nov 16, 2025 09:33 IST
ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులకు స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందనలు
దమ్ముంటే పట్టుకోండి అన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు: ఎక్స్‌లో సీవీ ఆనంద్
పైరసీ కేసులో రవిని తప్ప అందరినీ పట్టుకున్నారు: ఎక్స్‌లో సీవీ ఆనంద్
DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్ అని CV ఆనంద్ ట్వీట్
-
Nov 16, 2025 08:50 IST
ఎన్టీఆర్: కంచికచర్ల మం. కీసర దగ్గర ప్రైవేట్ బస్సుకు తప్పినముప్పు
కీసర టోల్‌గేట్ దగ్గర ఎయిర్‌పైప్ లీక్ కావడంతో వేడెక్కి నిలిచిన బస్సు
టోల్‌గేట్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
-
Nov 16, 2025 08:16 IST
నేటినుంచి ఫ్రాన్స్‌లో 'గరుడ-25' పేరుతో వైమానిక విన్యాసాలు
విన్యాసాల్లో పాల్గొననున్న ఫ్రాన్స్ ఎయిర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్
-
Nov 16, 2025 08:12 IST
విజయవాడ: త్వరలోనే రాజకీయాల్లోకి: రంగా కుమార్తె ఆశా కిరణ్
ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటా: ఆశా కిరణ్
రాధా-రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉంది: రంగా కుమార్తె ఆశ
-
Nov 16, 2025 08:12 IST
జనగామ: రఘునాథపల్లి మం. నిడిగొండ దగ్గర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న ఇసుక లారీ-ఆర్టీసీ రాజధాని బస్సు, ఇద్దరు మృతి
ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Nov 16, 2025 08:12 IST
ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో 400 దాటిన AQI
-
Nov 16, 2025 08:11 IST
హైదరాబాద్: ఫిరాయింపు MLAల విచారణ
నేడు మరో ఇద్దరు ఫిరాయింపు MLAల విచారణ
ఉ.11 గంటలకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి,..
మ.12 గంటలకు అరికెపూడి గాంధీని విచారించనున్న స్పీకర్
ఇప్పటికే 8 మంది MLAల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలుచేయని కడియం, దానం
-
Nov 16, 2025 06:40 IST
నేడు పాడేరులో ఒడిశా సీఎం మోహన్ చరణ్ పర్యటన
బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ సభ
బీజేపీ సభ, విగ్రహావిష్కరణకు హాజరుకానున్న మోహన్ చరణ్
-
Nov 16, 2025 06:39 IST
హిందూపురంలో రెండోరోజు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన
నేడు సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న బాలకృష్ణ
-
Nov 16, 2025 06:39 IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీల న్యాయసాధన దీక్షలు
ధర్నాచౌక్‌లో ఉ.10:30 గంటలకు బీసీల న్యాయసాధన దీక్ష
బీసీల న్యాయసాధన దీక్షలో పాల్గొననున్న ఆర్.కృష్ణయ్య