-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN on 15th august IS HERE VR
-
BREAKING: పాకిస్థాన్, పీవోకేలో భారీ వర్షాలు, 154 మంది మృతి
ABN , First Publish Date - Aug 15 , 2025 | 06:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 15, 2025 19:54 IST
పాకిస్థాన్, పీవోకేలో భారీ వర్షాలు, 154 మంది మృతి
వరదలకు వందలమంది గల్లంతైనట్టు తెలిపిన అధికారులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
-
Aug 15, 2025 18:24 IST
ఎట్‌హోం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు..
విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం.
పాల్గొన్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, అన్నాలేజినోవా దంపతులు.
మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
హాజరైన వివిధ రంగాల ప్రముఖులు, ఉన్నతాధికారులు
ఆహ్వానితుల దగ్గరకు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.
-
Aug 15, 2025 17:02 IST
మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశా: సీఎం చంద్రబాబు
ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే: చంద్రబాబు
ఎలక్ట్రిక్ బస్సుల్లో త్వరలో మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో 64లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 'తల్లికి వందనం' ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో ప్రజాచైతన్యం చాలా అవసరం: సీఎం చంద్రబాబు
రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగ హామీ నెరవేరుస్తాం: చంద్రబాబు
-
Aug 15, 2025 17:02 IST
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం చంద్రబాబు
సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే.. ఆనాడు ఎవరూ నమ్మలేదు: సీఎం చంద్రబాబు
ఇప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యింది: సీఎం చంద్రబాబు
ఆడబిడ్డలకు మంచి చేశామనే తృప్తి కలుగుతోంది: చంద్రబాబు
ఏపీ పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం: చంద్రబాబు
వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు నవ్వడమే మర్చిపోయారు: సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఇంటా, బయటా ప్రజలకు ఆనందం లేకుండా పోయింది: సీఎం చంద్రబాబు
రోడ్డు మీదకు వస్తే తిరిగి క్షేమంగా వెళ్తామన్న నమ్మకం ఉండేదా?: సీఎం చంద్రబాబు
ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తాం: సీఎం చంద్రబాబు
-
Aug 15, 2025 17:02 IST
మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్
సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం: పవన్
ఉచిత బస్సు పథకం హామీని నెరవర్చగలమా అని సందేహించాం
చంద్రబాబు కమిట్మెంట్‌కు ఈ పథకం అమలే నిదర్శనం: పవన్
'స్త్రీ శక్తి' పథకానికి 8,450 బస్సులు సిద్ధం చేశాం: పవన్
-
Aug 15, 2025 17:02 IST
సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఉండకూడదు: మంత్రి లోకేష్
మహిళలపై అసభ్య వ్యాఖ్యలు అరికట్టేలా ప్రత్యేక చట్టం తేవాలి: మంత్రి లోకేష్
కొంతమంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు: మంత్రి లోకేష్
అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు: మంత్రి లోకేష్
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం: మంత్రి లోకేష్
మద్యపాన నిషేధం చేస్తానని ఓ రాక్షసుడు చెప్పాడు: లోకేష్
కానీ.. జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీశారు: లోకేష్
తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి.. ఇతర మహిళలకు న్యాయం చేస్తారా?: మంత్రి లోకేష్
సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని వ్యక్తి.. మహిళల గురించి మాట్లాడుతున్నారు: మంత్రి లోకేష్
తల్లి మీద కేసు గెలిస్తే సంబరాలు చేసుకున్నారు: మంత్రి లోకేష్
-
Aug 15, 2025 16:30 IST
అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయి: మంత్రి లోకేష్
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా.. మహిళలే: మంత్రి లోకేష్
మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌ది: మంత్రి లోకేష్
మహిళలకు సాధికారత కల్పించిన ఘనత చంద్రబాబుది: మంత్రి లోకేష్
కొంతమంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు: మంత్రి లోకేష్
అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు: మంత్రి లోకేష్
-
Aug 15, 2025 15:50 IST
సిద్దిపేట: ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్సీ కవిత
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్న కవిత కుమారుడు
కేసీఆర్ ఆశీర్వాదం కోసం కుమారుడిని తీసుకొచ్చిన కవిత
-
Aug 15, 2025 15:21 IST
స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి గుహల నుంచి బస్సులో ప్రయాణించారు.
ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించారు.
మహిళలతో కలిసి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించనున్నారు.
కాగా, విజయవాడ బస్‌స్టేషన్‌లో జెండా ఊపి బస్సులను సీఎం ప్రారంభించనున్నారు.
విజయవాడ సిటీబస్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో నేతలు పాల్గొననున్నారు.
మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వ.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం.
'స్త్రీ శక్తి' పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.
'స్త్రీ శక్తి' పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల భారం పడనుంది.
ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకూ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
Aug 15, 2025 13:30 IST
ఖమ్మం: మున్నేరు పరివాహక ప్రాంతంలో మంత్రి తుమ్మల పర్యటన
మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల
అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలి: తుమ్మల
మున్నేరు, ఆకేరు వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి: తుమ్మల
అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి: మంత్రి తుమ్మల
-
Aug 15, 2025 13:30 IST
BRS హయాంలోనే బనకచర్ల ప్రతిపాదన వచ్చింది: మంత్రి శ్రీధర్‌బాబు
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించుకుంటాం: శ్రీధర్‌బాబు
మా ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సిందే: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ నీటి హక్కుల విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: శ్రీధర్‌బాబు
పేర్లు మార్చి ప్రాజెక్టులు కడితే ఒప్పుకునేదిలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
వామనరావు హత్యకు నిందితులు BRS హయాంలోనే తప్పించుకున్నారు
సీబీఐ దర్యాప్తుతో అసలు దోషులకు శిక్ష తప్పదు: మంత్రి శ్రీధర్‌బాబు
-
Aug 15, 2025 13:05 IST
జమ్మూకశ్మీర్ కిష్టావర్ వరదల్లో 65కు చేరిన మృతులు
ఇప్పటివరకు 25 మృతదేహాల గుర్తింపు
సహాయక చర్యల్లో NDRF, SDRF సిబ్బంది
160 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, 120 మందికిపైగా గాయాలు
కిష్టావర్ మెరుపు వరదల్లో పలువురు గల్లంతు
-
Aug 15, 2025 12:56 IST
కడప: స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే, అధికారుల మధ్య కుర్చీ వివాదం
స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి
తనకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటుచేయలేదని జేసీపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం
కొద్దిసేపు నిలబడి అక్కడనుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి
వేదిక ముందు వరుసలో ప్రత్యేక సీటు వేశామంటున్న అధికారులు
-
Aug 15, 2025 12:15 IST
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం: పొంగులేటి
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసింది: మంత్రి పొంగులేటి
ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది
కోటి మందిని కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
భూ వివాదాలు ఉండకూడదనే భూ భారతి చట్టాన్ని తెచ్చాం: మంత్రి పొంగులేటి
-
Aug 15, 2025 12:14 IST
హైదరాబాద్: మూసీకి కొనసాగుతోన్న వరద ఉధృతి
హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఎత్తి, 5,215 క్యూసెక్కులు విడుదల
నిన్న మూసీకి భారీ వరదతో నామరూపాల్లేకుండాపోయిన ముసారంబాగ్ బ్రిడ్జి
వరద దాటికి కొట్టుకుపోయిన దోభీ ఘాట్లు
వరద తగ్గుముఖం పట్టడంతో GHMC అధికారులు మరమ్మతులు
-
Aug 15, 2025 12:13 IST
రంగారెడ్డి: బాకరంలోని ఫాంహౌస్‌పై SOT దాడులు
డ్రగ్స్ టెస్ట్‌లో ముగ్గురికి పాజిటివ్
పోలీసుల అదుపులో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు
మరికొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తున్న పోలీసులు
భారీగా మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Aug 15, 2025 11:54 IST
మార్పు మన నుంచే మొదలుకావాలి: మంత్రి లోకేష్
మన దేశ పవర్‌ఫుల్ మిస్సైల్ ప్రధాని మోదీ: మంత్రి లోకేష్
వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడింది: లోకేష్
-
Aug 15, 2025 11:48 IST
శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది: ట్రంప్
జెలెన్‌స్కీ, పుతిన్ శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాం: ట్రంప్
పుతిన్‌తో భేటీ రష్యాతో పాటు అమెరికాకు చాలా ముఖ్యం: ట్రంప్
జెలెన్‌స్కీ, పుతిన్‌తో మరో సమావేశం ఉంటుంది: ట్రంప్
పుతిన్, జెలెన్‌స్కీ కలిసిపోతే బాగుంటుందని అభిప్రాయపడ్డ ట్రంప్
యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు: పుతిన్
అణ్వాయుధాలపై నియంత్రణతో శాంతి నెలకొల్పవచ్చు: పుతిన్
-
Aug 15, 2025 11:47 IST
కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఖూనీ చేశారు: షర్మిల
నేడు పులివెందులలో చంద్రబాబు అదే చేశారు: APCC చీఫ్ షర్మిల
ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్లే: షర్మిల
ఇద్దరికి పెద్ద తేడాలేదు. రిగ్గింగ్ చేయడం అంటే వీళ్ళు తాలిబన్ లతో సమానమే
-
Aug 15, 2025 11:19 IST
నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టుపై తగ్గేదిలేదన్న ఏపీ సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి జలాలపై రాజీపడేది లేదన్న తెలంగాణ సీఎం రేవంత్
బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదన్న సీఎం చంద్రబాబు
తెలంగాణ అవసరాలు తీరాకే ఇతరులకు నీరు ఇస్తామన్న సీఎం రేవంత్
సముద్రంలోకి వెళ్లే నీరు వాడుకుంటే తప్పేంటన్న సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్న సీఎం రేవంత్
ఎగువ నుంచి వచ్చే వరదను భరిస్తున్న తమకు..
ఆ నీరు వాడుకునే హక్కు ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
-
Aug 15, 2025 11:10 IST
గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది: రేవంత్
SLBC, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం: రేవంత్
తెలంగాణలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్ బ్రాండింగ్ పెంచేందుకు చర్యలు: సీఎం రేవంత్
యువతను డ్రగ్స్‌కు బానిస చేసే కుట్రలు ఛేదించాం: సీఎం రేవంత్
20 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టాం: సీఎం రేవంత్
-
Aug 15, 2025 09:52 IST
మేడ్చల్‌లో అక్రమ సరోగసీ సెంటర్ గుర్తింపు
అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
అనుమతులు లేకుండా సరోగసీ సెంటర్ నిర్వహిస్తున్న క్లినిక్, ఇద్దరు అరెస్టు
అనుమతులు లేకుండానే ఎగ్ డొనేట్ ల్యాబ్ ఏర్పాటుచేసినట్టు గుర్తింపు
అనుమతులు రాకపోయినా అక్రమంగా సరోగసీ సెంటర్ నిర్వహణ
-
Aug 15, 2025 09:49 IST
20 నెలలైనా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు: రాంచందర్‌రావు
BRS, కాంగ్రెస్‌కి రాజ్యాంగంపై నమ్మకం లేదు: రాంచందర్‌రావు
అవి రెండూ కుటుంబ పార్టీలే: టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
మనుషులకు స్వేచ్చ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు: రాంచందర్‌రావు
రూ.లక్షల కోట్ల స్కామ్ చేసే వ్యక్తులు ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారు
వాళ్లు గెలిస్తే ఓట్ల చోరీ లేదు.. ఓడిపోతే విమర్శలు: రాంచందర్‌రావు
దేశంలో ఓటర్లంతా ఫూల్స్ అని గతంలో ఇందిరా గాంధీ విమర్శించారు
-
Aug 15, 2025 09:46 IST
Xలో కేటీఆర్..
జమ్మూ 46మంది మరణించడం, 100 మందికి పైగా గాయపడటం, ఇంకా కొందరు గల్లంతవడం నన్ను తీవ్రంగా కలచివేసింది
ఈ విషాదంలో కుటుంబాలను, వారి ఆప్తులను కోల్పోయిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్న సిబ్బందికి నా కృతజ్ఞతలు.
గల్లంతైన వారందరి ఆచూకి లభిస్తుందనీ ఆశిస్తున్నాను.
ఈ కష్ట సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారి వెంట మా ప్రార్థనలు ఉంటాయి
-
Aug 15, 2025 08:35 IST
రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
డ్రోన్ దాడులతో వోల్గోగ్రాడ్ రిఫైనరీలో చెలరేగిన భారీ మంటలు
-
Aug 15, 2025 08:34 IST
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చిన హైకోర్టు
పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును విచారించిన హైకోర్టు
ఈనెల 18న కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి
భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
-
Aug 15, 2025 08:06 IST
ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్: మోదీ
మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు: మోదీ
పహల్గామ్‌లో మతం అడిగి మరీ పర్యాటకులను ఉగ్రవాదులు చంపారు: మోదీ
భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు: మోదీ
పహల్గామ్ దాడితో యావత్ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది: మోదీ
ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్: మోదీ
భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: ప్రధాని మోదీ
యుద్ధతంత్రాలు, వ్యూహాలు పూర్తిగా మన జవాన్లే తయారుచేసుకున్నారు: మోదీ
ఆపరేషన్ సిందూర్‌తో మన సత్తా చాటాం: ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశాం: ప్రధాని మోదీ
ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది: ప్రధాని మోదీ
ఇకపై బ్లాక్‌మెయిల్ చేసేవారిని ఉపేక్షించేది లేదు: ప్రధాని మోదీ
-
Aug 15, 2025 07:42 IST
ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం: మోదీ
140 కోట్ల మంది సంకల్ప పండుగ స్వాతంత్ర్య దినోత్సవం: మోదీ
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం: మోదీ
కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నాం: మోదీ
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు: మోదీ
దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం: మోదీ
-
Aug 15, 2025 07:35 IST
ఢిల్లీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు
రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు
'నయా భారత్' ఇతివృత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం
ప్రధాని మోదీకి త్రివిధ దళాల గౌరవ వందనం
ఎర్రకోటపై జాతీయజెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత
-
Aug 15, 2025 07:29 IST
ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలుజిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్
తూర్పుగోదావరి, ప.గోదావరి, గుంటూరు, కృష్ణా..
యానాంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ
-
Aug 15, 2025 06:33 IST
అమరావతి: ఇందిరాగాంధీ స్డేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
9 గంటలకు జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం చంద్రబాబు
-
Aug 15, 2025 06:33 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తావైపు కదులుతున్న అల్పపీడనం
నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
24 గంటలపాటు ఏలూరు, NTR జిల్లాల్లో భారీ వర్షాలు
శ్రీకాకుళం,అల్లూరి, పార్వతీపురంలో భారీవర్షాలు: వాతావరణ శాఖ
-
Aug 15, 2025 06:33 IST
ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలుజిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్
తూర్పుగోదావరి, ప.గోదావరి, గుంటూరు, కృష్ణా..
యానాంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ
-
Aug 15, 2025 06:33 IST
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆళ్లగడ్డ దగ్గర రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ, ముగ్గురు మృతి
18 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం
జగన్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు
-
Aug 15, 2025 06:32 IST
నేడు 79వ స్వాతంత్ర్య దినోత్సవం
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయనున్న ప్రధాని మోదీ
వరుసగా 12వ సారి ఎర్రకోటపై జెండా ఎగరవేయనున్న మోదీ
ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత
-
Aug 15, 2025 06:32 IST
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం కీలక భేటీ
నేడు అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్, పుతిన్ చర్చలు
-
Aug 15, 2025 06:32 IST
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్
ఉ. 9 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండా ఎగరవేత
10 గంటలకు గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
మ.12గంటలకు హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించనున్న సీఎం
సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోమ్‌కు హాజరుకానున్న రేవంత్‌రెడ్డి
-
Aug 15, 2025 06:30 IST
అమరావతి: మహిళలకు ఉచితబస్సు ప్రయాణానికి ప్రభుత్వం శ్రీకారం
విజయవాడలో స్త్రీశక్తి పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
సాయంత్రం నుంచి ఏపీలో మహిళలకు ఉచితబస్సు ప్రయాణం
ఉచిత బస్సు ప్రయాణం ట్రాన్స్‌జెండర్లకూ వర్తింపు
-
Aug 15, 2025 06:14 IST
ఇవాళ మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు కవిత
ఉన్నత విద్య కోసం అమెరికాకు కవిత చిన్న కుమారుడు ఆర్య
కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫాంహౌస్‌కు కవిత కుటుంబసభ్యులు