-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across world on 17th august VR
-
Breaking News: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
ABN , First Publish Date - Aug 17 , 2025 | 06:21 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 17, 2025 20:09 IST
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్
గతంలో జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన సీపీ రాధాకృష్ణన్
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
-
Aug 17, 2025 18:37 IST
హైదరాబాద్: చిరంజీవిని కలిసిన నిర్మాత నట్టి కుమార్
చిన్న సినిమాల కష్టాలు, బాధలను చిరంజీవికి వివరించా
రేపు ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడతామని చెప్పారు: నట్టి కుమార్
ఏ రేట్లను పెంచినా చిన్నసినిమాలకు 20శాతం తగ్గించాలని చెప్పాం
ఫెడరేషన్ వాదనలు కూడా వింటానని చిరంజీవి చెప్పారు: నట్టి కుమార్
చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం: నట్టి కుమార్
గుడ్‌న్యూస్ చెప్తానని చిరంజీవి చెప్పారు: నిర్మిత నట్టి కుమార్
-
Aug 17, 2025 15:51 IST
ఢిల్లీ: బిహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై ఈసీ వివరణ
రాహుల్‌గాంధీ ఆరోపణలపై స్పందిస్తున్న ఈసీ
ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదాలు లేవు: ఈసీ
రాజ్యాంగం ప్రకారం పౌరులంతా స్వచ్ఛందంగా ఓటు వేయవచ్చు: ఈసీ
అన్ని పార్టీలను మేం సమానంగా చూస్తాం: ఈసీ
ఓటు హక్కు కోసం ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: ఈసీ
ఓటరు జాబితాను బూత్ లెవల్‌లోనే ప్రతిపార్టీ తనిఖీ చేసుకోవాలి
బిహార్‌లో 7 కోట్ల మంది ఓటర్ల జాబితా ఈసీ దగ్గర ఉంది: ఈసీ
బిహార్‌లో ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1వరకు గడువు ఇచ్చాం: ఈసీ
బిహార్‌లో ఇంకా 15 రోజుల గడువు ఉంది: ఈసీ
సంస్కరణల్లో భాగంగానే బిహార్‌లో ఓటరు జాబితా సవరిస్తున్నాం: ఈసీ
పౌరులు, పార్టీల మధ్య ఈసీకి ఎలాంటి వివక్ష ఉండదు: ఈసీ
బిహార్‌లో ఓటరు జాబితాపై అనవసరణ ఆరోపణలు: ఈసీ
బిహార్‌లో ఓటరు జాబితా రూపకల్పనలో స్పష్టమైన వైఖరి అవలంభిస్తున్నాం
రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదు: ఈసీ
బిహార్‌లో కొంతమంది ఓటర్ల ఫొటోలు మీడియాలో వచ్చాయి: ఈసీ
ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాదే: ఈసీ
బిహార్‌లో పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన: ఈసీ
ఓటరు జాబితాలో ఇన్ని జాగ్రత్తలతో వ్యవహరిస్తే ఓట్ల చోరీ సాధ్యమా?
పేద-ధనిక, యువకులు, వృద్ధులు, మహిళలనే భేదం మాకు ఉండదు: ఈసీ
అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తాం: ఈసీ
ఈసీపై అసత్య ఆరోపణలు చేయడం నేతలకు సరికాదు: ఈసీ
బిహార్ ఓటరు జాబితాపై 28.370 మంది అభ్యంతరాలు తెలిపారు: ఈసీ
బూత్ లెవల్‌లో అధికారులు, పార్టీల ఏజెంట్లు కలిసే పరిశీలిస్తారు: ఈసీ
దుష్ప్రచారాలపై మేం ఏ మాత్రం భయపడం: ఈసీ
ఓట్ల చోరీ అని ప్రచారం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
ఎంతగా దుష్ప్రచారం చేసినా మా పని మేం చేసుకుంటాం: ఈసీ
-
Aug 17, 2025 15:50 IST
ABN ఆంధ్రజ్యోతి చేతిలో మేడ్చల్ సరోగసి కేసు FIR కాపీ
సుమోటోగా తీసుకుని FIR నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
మొత్తం నాలుగు కేసులు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
BNS 318(4), 61(2) యాక్ట్ కింద 2 కేసులు, ART యాక్ట్ కింద మరో 2 కేసులు
సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతో పాటు..
వివిధ ఫెర్టిలిటీ ఆస్పత్రులకు చెందిన డాక్యుమెంట్స్ గుర్తించినట్టు FIRలో వెల్లడి
LLH ఫెర్టిలిటీ సర్వీస్ పేరుతో దందా చేస్తున్న నిందితురాలు లక్ష్మి
ఏజెంట్‌గా 2022లో ఫెర్టిలిటీ సెంటర్‌కు ఎగ్ డొనేట్ చేసిన లక్ష్మి
తర్వాత కాంటాక్ట్స్ పెంచుకుని సరోగెంట్ తల్లులను తయారు చేస్తున్న లక్ష్మి
లక్ష్మికి పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నాయని తెలిపిన పోలీసులు
-
Aug 17, 2025 14:58 IST
ఢిల్లీలో రెండు ప్రధాన హైవేలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ ప్రారంభం
వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్తున్నాం: ప్రధాని మోదీ
వికసిత్ భారత్‌కు ఢిల్లీ ప్రతిరూపంగా మారింది: ప్రధాని మోదీ
యమునా నది ప్రక్షాళన వేగవంతం చేశాం: మోదీ
గత ప్రభుత్వం ఢిల్లీని తీవ్ర నిర్లక్ష్యం చేసింది: ప్రధాని మోదీ
ఢిల్లీ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: మోదీ
-
Aug 17, 2025 14:58 IST
బిహార్‌లో రాహుల్‌గాంధీ 'ఓటర్ అధికార్' యాత్ర
ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే మా పోరాటం: రాహుల్‌గాంధీ
దేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోంది: రాహుల్‌గాంధీ
బిహార్‌లో ఓట్ల చోరీ జరిగింది: రాహుల్‌గాంధీ
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఈసీ కాలరాస్తోంది: రాహుల్
బీజేపీతో ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారు: రాహుల్
-
Aug 17, 2025 14:58 IST
కాళేశ్వరంపై హరీష్‌రావు సోయిలేకుండా మాట్లాడుతున్నారు: ఆది శ్రీనివాస్
తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?: ఆది శ్రీనివాస్
కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాళేశ్వరం కట్టింది మీ హయాంలోనే.. కూలింది మీ హయాంలోనే: ఆది శ్రీనివాస్
ఎప్పుడు నీళ్లు నింపాలో.. ఎప్పుడు వదలాలో సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసు
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గుదిబండలా మారింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
Aug 17, 2025 13:03 IST
ప.గో.: మాజీమంత్రి కొట్టు సత్యనారాయణకు ఎమ్మెల్యే శ్రీనివాస్ సవాల్
సత్యనారాయణ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న బొలిశెట్టి శ్రీనివాస్
ఎవరు అవినీతికి పాల్పడ్డారో చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఎవరి అవినీతి తేలితే వారు ఊరు వదిలి వెళ్లిపోవాలి: బొలిశెట్టి శ్రీనివాస్
-
Aug 17, 2025 13:03 IST
హర్యానా: బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటి దగ్గర కాల్పులు
బైక్‌పై వచ్చి 12 రౌండ్ల కాల్పులు జరిపిన ముగ్గురు దుండగులు
కాల్పుల సమయంలో ఇంట్లో లేని ఎల్విష్ యాదవ్
2023 బిగ్‌బాస్ ఓటీటీ-2 విజేత, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్
-
Aug 17, 2025 13:03 IST
విశాఖ: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి లేదు: భట్టి విక్రమార్క
పార్టీ బలంగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కూడా కోరుతున్నారు
భవిష్యత్‌లో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుంది: భట్టి
తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం: భట్టి విక్రమార్క
వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత..
ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది: భట్టి
మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మిస్తే..
ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి: భట్టి
-
Aug 17, 2025 13:02 IST
జమ్మూకశ్మీర్: వరదలతో కిష్త్వోర్ జిల్లా చసోటి ప్రాంతం అతలాకుతలం
శిథిలాల నుంచి ఇప్పటివరకు 50 మృతదేహాలు వెలికితీత
కథువా జిల్లా జోధ్‌లో వరదల్లో చిక్కుకున్న ఆరుగురు గ్రామస్తులు
గ్రామస్తులను రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలు
కుల్లు ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలతో ఆస్తి నష్టం
-
Aug 17, 2025 13:01 IST
మేడ్చల్: సరోగసి కేసులో 6 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు
ఆస్పత్రుల రికార్డ్స్ పరిశీలించనున్న పోలీసులు, DMHO
నిందితురాలు లక్ష్మికి ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు
మహిళల నుంచి ఎగ్స్ తీసుకుని ఫెర్టిలిటీ సెంటర్లకు ఇస్తున్న లక్ష్మి
ప్రస్తుతం లక్ష్మి దగ్గర ఆరుగురు సరోగెంట్ తల్లులు
-
Aug 17, 2025 13:00 IST
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద
ఫుల్‌ట్యాంక్ లెవల్ దాటిన హుస్సేన్‌సాగన్ నీటిమట్టం
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
-
Aug 17, 2025 12:05 IST
ఇవాళ రాత్రి ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్
రేపు పలువురు కేంద్రమంత్రులతో భేటీకానున్న లోకేష్
-
Aug 17, 2025 11:51 IST
జూ.ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనపై స్పందించిన దగ్గుపాటి ప్రసాద్
ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. అంతా బోగస్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
నేను తొలి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని: దగ్గుపాటి ప్రసాద్
జూ.ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా: దగ్గుపాటి ప్రసాద్
నా ప్రమేయం లేకున్నా నాపేరు ప్రస్తావించారు.. కాబట్టి క్షమాపణలు
ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
-
Aug 17, 2025 11:51 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ భేటీ
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చించే అవకాశం
-
Aug 17, 2025 11:50 IST
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోంది: హరీష్‌రావు
కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, రైతుల గురించి తెలియదు
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు నీటి విలువ తెలియదు: హరీష్‌రావు
బీఆర్ఎస్ నేతల మీద కోపం ఉంటే.. రైతులకు శిక్ష వేస్తారా?
బురద రాజకీయాల కోసం వరద నీళ్లను సముద్రంలోకి వదలకండి
కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు: హరీష్‌రావు
కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదు: హరీష్‌రావు
ప్రజలకు కీడు చేస్తే.. అది ప్రభుత్వమే అనుభవిస్తుంది: హరీష్‌రావు
కాళేశ్వరం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలి: హరీష్‌రావు
-
Aug 17, 2025 11:50 IST
హిమాచల్‌ప్రదేశ్: మండి జిల్లాలో ఆకస్మిక వరదలు
పనార్సా, టకోలీ, నాగ్వైన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు
చండీగఢ్-మనాలీ హైవేపై వరద, నిలిచిన రాకపోకలు
-
Aug 17, 2025 11:49 IST
జమ్మూకశ్మీర్: వరద ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం ఆరా
కథువా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్
సహాయక చర్యలు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశం
-
Aug 17, 2025 10:46 IST
హైదరాబాద్: అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్లు కాజేసిన కేటుగాడు
వృద్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్గా భారీ మోసం
రూ. 20 కోట్లు కాజేసి పరారైన మల్కాజ్గిరికి చెందిన దినేష్ పాణ్యం
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతానని..
ప్రతీ నెల బ్యాంకులు ఇచ్చేకంటే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించిన దినేష్
రూ.20 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన 170 మంది బాధితులు
-
Aug 17, 2025 10:46 IST
మేడ్చల్ సరోగసీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం
ఫెర్టిలిటీసెంటర్లతో నిందితురాలు లక్ష్మికి సంబంధాలు
లక్ష్మి డైరీలో సరోగసికి సంబంధించిన వివరాలు
50మందికి పైగా సరోగసి చేయించినట్టు సమాచారం
గతంలో ఏజెంట్, సరోగెంట్‌గా ఉన్న నిందితురాలు లక్ష్మి
IVF సెంటర్ల రికార్డులు పరిశీలించనున్న పోలీసులు
కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం
-
Aug 17, 2025 10:30 IST
కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ఛాంబర్ లేఖ
4 షరతులు, పర్సంటేజీ విధానాన్ని వివరిస్తూ ఫిల్మ్ ఛాంబర్ లేఖ
24 సినిమా సంఘాలతో రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం
ఫిల్మ్‌ఛాంబర్ నిర్ణయాలపై రేపు చర్చించనున్న ఫిల్మ్ ఫెడరేషన్
-
Aug 17, 2025 09:21 IST
హైదరాబాద్: చైతన్యపురి పీఎస్ పరిధిలో స్పా సెంటర్లలో తనిఖీలు
అక్రమంగా నడుస్తున్న 8 స్పా సెంటర్లలో పోలీసుల సోదాలు
40 మందికిపైగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు, సిబ్బంది, కస్టమర్లు
-
Aug 17, 2025 09:17 IST
ఎన్టీఆర్ జిల్లా: ఉధృతంగా ప్రవహిస్తున్న మునేరు
లింగాల వంతెనపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు
ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు పెనుగంచిప్రోలు మీదుగా మళ్లింపు
-
Aug 17, 2025 09:16 IST
హైదరాబాద్: ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ
మల్లు రవి అధ్యక్షతన సమావేశం
రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చించనున్న కమిటీ
-
Aug 17, 2025 07:07 IST
నేటి నుంచి బీహార్‌లో రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర
1,300 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఓటర్ అధికార్ యాత్ర
సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో యాత్ర ముగింపు
-
Aug 17, 2025 06:45 IST
ఢిల్లీ చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
రేపు ప్రధానితో శుభాంశు శుక్లా భేటీ అయ్యే అవకాశం
22, 23 తేదీల్లో జరిగే నేషనల్ స్పేస్ డేలో పాల్గొననున్న శుభాంశు
యాక్సియం-4 విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు శుభాంశు
-
Aug 17, 2025 06:44 IST
రేపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటన
సరిహద్దు వివాదంపై చర్చలకు వస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన
అజిత్ దోవల్ బృందంతో చర్చించనున్న చైనా మంత్రి వాంగ్ యీ
-
Aug 17, 2025 06:44 IST
దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం
నేడు వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
రానున్న మూడురోజులపాటు కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరిక
చెట్ల కింద, శిథిలావస్థలోని భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని సూచన
లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
-
Aug 17, 2025 06:44 IST
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్య
నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య సయోధ్య కుదిరేలా చిరంజీవి కృషి
నేడు నిర్మాతలు, సినీ కార్మిక నాయకులతో వేర్వేరుగా భేటీకానున్న చిరంజీవి
13 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం
-
Aug 17, 2025 06:42 IST
రేపు ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ
రష్యాతో యుద్ధవిరమణ గురించి చర్చించనున్నట్టు జెలెన్‌స్కీ వెల్లడి
ట్రంప్, పుతిన్ భేటీపైనా చర్చించనున్నట్టు తెలిపిన జెలెన్‌స్కీ
-
Aug 17, 2025 06:42 IST
ఢిల్లీ: మ.3 గంటలకు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం
ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
బిహార్ ఓటరు జాబితా, రాహుల్ ఆరోపణలపై స్పందించే అవకాశం
-
Aug 17, 2025 06:42 IST
నేడు ఢిల్లీలో 2 ప్రధాన హైవేలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రూ.11వేల కోట్లతో నిర్మించిన అర్బన్ రోడ్లు ఫేజ్-2,..
ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ శివారు ప్రాంతాలను అనుసంధానిస్తూ కారిడార్
ద్వారక ఎక్స్‌ప్రెస్‌వేతో నోయిడా నుంచి IGI ఎయిర్‌పోర్ట్‌కు తగ్గనున్న దూరం
-
Aug 17, 2025 06:21 IST
ఢిల్లీ: నేడు BJP పార్లమెంటరీ బోర్డు సమావేశం
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ
ఆగస్టు 18న అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం
ఆగస్టు 21న NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్