-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across globe on 25th august VR
-
BREAKING: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం
ABN , First Publish Date - Aug 25 , 2025 | 06:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 25, 2025 20:07 IST
జమ్మూకశ్మీర్‌లో అత్యధిక వర్షపాతం
జమ్మూలో గత వందేళ్లలోనే ఆగస్టులో కురిసిన రెండో అత్యధిక వర్షపాతం
తావి నదిలో భారీ వరద, మానవతా దృక్పథంతో పాక్‌ను అలర్ట్ చేసిన భారత్
ఒప్పందం ప్రకారం భారత్ సమాచారం అందించిందన్న పాక్ మీడియా
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో సింధు జల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్
-
Aug 25, 2025 20:07 IST
రాజస్థాన్‌లో 2 రోజులుగా భారీ వర్షాలు
జలమయమైన జైపూర్, సికార్‌లోని అనేక ప్రాంతాలు
మునిగిన సికార్ రైల్వే స్టేషన్ ట్రాక్
ఉదయపూర్‌లో ఇళ్ళు, దుకాణాల్లోకి వరద
ఈ నెల 23 నుంచి వరదల్లోనే జైపూర్-ఆగ్రా హైవే
సోమ్ నది వరదపోటుకు ఖేర్వాడా-జాడోల్ రోడ్ మూసివేత
ఉత్తరాఖండ్: కొండచరియలు విరిగిపడటంతో యమునోత్రి హైవే మూసివేత
-
Aug 25, 2025 20:07 IST
దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో నిర్ణయం
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాన్వేంద్రనాథ్రాయ్ ఏపీ హైకోర్టుకు బదిలీ
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఏపీ హైకోర్టుకు బదిలీ
కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ
ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం సిఫారసు
-
Aug 25, 2025 18:31 IST
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం
అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను ఎంపిక చేసిన కేంద్రం
తెలంగాణ నుంచి జాతీయ అవార్డుకు ఇద్దరు టీచర్లు ఎంపిక
-
Aug 25, 2025 16:29 IST
రాహుల్‌కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయం: కేటీఆర్
బడే భాయ్, చోటే భాయ్ కలిసి పనిచేస్తున్నారు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మోదీ, రేవంత్ కలిసి రాహుల్‌ను ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకేరకంగా ప్రజలను మోసం చేస్తున్నారు: కేటీఆర్
ఇద్దరూ కలిసి రాహుల్‌కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయం: కేటీఆర్
ఏటా 2 కోట్ల ఉద్యోగాలని మోదీ, 2లక్షల ఉద్యోగాలని రేవంత్ చెప్పారు: కేటీఆర్
పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ, రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రేవంత్ చెప్పారు: కేటీఆర్
ఇద్దరూ కలిసి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు: కేటీఆర్
-
Aug 25, 2025 16:28 IST
నంద్యాల: MLA బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
శ్రీశైలం దేవస్థానాన్ని మార్కాపురం డివిజన్‌లో కలిపేందుకు కొందరూ జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు: MLA రాజశేఖర్‌రెడ్డి
శ్రీశైలం క్షేత్రాన్ని మనమే కాపాడుకోవాలి: MLA రాజశేఖర్‌రెడ్డి
-
Aug 25, 2025 16:28 IST
భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేటలో ఉద్రిక్తం
ప్రసన్న మృతి కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ..
రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రులు, బంధువుల ధర్నా
ఆందోళనకారను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 25, 2025 16:28 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
329 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
98 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Aug 25, 2025 16:28 IST
నిధులు విడుదల
స్మార్ట్ కార్డుల ముద్రణ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల
రూ.8 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు జారీ
1,46,21,223 క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల కోసం నిధులు
ఒక్కో స్మార్ట్ కార్డు ముద్రణకు రూ.4.66 వ్యయం: ఏపీ ప్రభుత్వం
-
Aug 25, 2025 15:39 IST
గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్..
మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
ఏపీవ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
గణేష్ ఉత్సవ కమిటీల విజ్ఞప్తితో ఏపీ ప్రభుత్వం నిర్ణయం
-
Aug 25, 2025 13:58 IST
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
బీసీ రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై..
న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం
-
Aug 25, 2025 13:57 IST
అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు
సల్వా జుడుం తీర్పును అమిత్‌షా తప్పుగా అర్థం చేసుకున్నారు
తీర్పులో ఎక్కడా నక్సలిజానికి మద్దతు లేదు: మాజీ న్యాయమూర్తులు
తీర్పును తప్పుగా చెప్పడం సుప్రీం స్వతంత్రతపై ప్రభావం చూపుతుంది
రాజకీయ ప్రచారంలో మర్యాద, గౌరవం ఉండాలి: మాజీ న్యాయమూర్తులు
-
Aug 25, 2025 12:53 IST
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నేను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా: సీఎం రేవంత్
డిసెంబర్‌లో మళ్లీ ఆర్ట్స్ కాలేజీలోనే మీటింగ్: సీఎం రేవంత్‌రెడ్డి
నేను వచ్చే రోజు ఒక్క పోలీస్ క్యాంపస్‌లో ఉండడు
విద్యార్థులను నిరసన చేసుకోనివ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి
నన్ను అడ్డుకునే విద్యార్థులకు సమాధానం చెబుతా: రేవంత్‌రెడ్డి
సమస్యలు తీర్చాలనుకుంటున్న నేను.. ఓయూకు ఎందుకు రావొద్దు
ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఇచ్చినా తక్కువే: సీఎం రేవంత్‌రెడ్డి
ఓయూ లేకపోతే తెలంగాణ చరిత్రే లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 25, 2025 11:51 IST
ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి
20 ఏళ్ల తర్వాత ఓయూకు సీఎం రేవంత్‌రెడ్డి
ఓయూలో ఫొటో గ్యాలరీని సందర్శించిన సీఎం రేవంత్
రూ.90కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలకు సీఎం ప్రారంభోత్సవం
హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ ప్రారంభం
-
Aug 25, 2025 11:31 IST
రాజ్యాంగ సవరణపై విపక్షాలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్
ప్రధాని జైలుకెళ్లినా.. రాజీనామా చేయాల్సిందే: అమిత్ షా
విపక్షాలు ఇప్పటికీ జైలునే సీఎం, సీఎం అధికార నివాసాలుగా మార్చేస్తారు
ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది: అమిత్ షా
ఇలాంటి సిద్ధాంతాలకు నేను, మా పార్టీ వ్యతిరేకిస్తున్నాం: అమిత్ షా
-
Aug 25, 2025 11:15 IST
నెల్లూరు: కిలేడీ అరుణ కస్టడీకి కోరిన పోలీసులు
కోర్టు అనుమతితో అరుణను కస్టడీకి తీసుకునే అవకాశం
ప్రస్తుతం ఒంగోలు జైలులో ఉన్న కిలేడీ అరుణ
కిలేడీ అరుణ ఫోన్లలో ప్రముఖుల ఆడియోలు, వీడియోలు
కోర్టు అనుమతితో డేటా తీసుకుంటే, ప్రముఖుల బండారాలు బయటపడే అవకాశం
ప్రముఖులని వలలో వేసుకుని ఆడియోలు, వీడియోలు
గతంలో ఆడియోలు, వీడియోలతో అధికారులని బ్లాక్ మెయిల్ చేసిన అరుణ
రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ నేర సామ్రాజ్యంపై పోలీసుల ఆరా
అరుణ కాల్‌డేటా ఆధారంగా రౌడీలను అరెస్టులు చేస్తున్న పోలీసులు
ఇప్పటికే నలుగురిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులు
మరో ముగ్గురు రౌడీషీటర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల చర్యలతో పలువురు రౌడీలు పరారీ
పరారైన రౌడీల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు
-
Aug 25, 2025 10:16 IST
కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణ
తదుపరి విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చినా ముందుకు సాగని దర్యాప్తు
వైసీపీ హయాంలో పోలీసుల ఉద్దేశపూర్వక తప్పిదాలతో చిక్కులు
అనంతబాబును అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ సీజ్ చేసినా పాస్‌వర్డ్ తీసుకోని పోలీసులు
హత్యకు ముందు వాట్సాప్ కాల్స్, వీడియో ఆధారాలు సేకరించని పోలీసులు
కోర్టు నుంచి అనుమతి తీసుకుని అనంతబాబు ఫోన్ ఓపెన్ చేసేందుకు యత్నం
హత్య కేసు విచారణకు అనంతబాబు భార్యకు నోటీసులు జారీ
-
Aug 25, 2025 10:14 IST
లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టులో నేడు విచారణ
నేడు కౌంటర్ దాఖలు చేయనున్న సిట్
చెవిరెడ్డిని వర్చువల్‌గా హాజరుపరిచే అవకాశం ఇవ్వాలని సిట్ పిటిషన్
నేడు విచారించనున్న విజయవాడ ACB కోర్టు
-
Aug 25, 2025 09:38 IST
13 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ విదేశాంగమంత్రి
సార్క్‌ను బలోపేతం చేయాలని భావిస్తున్న..
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్
పాక్ మంత్రి ఇషాక్‌దార్‌తో యూనస్ భేటీ
ఇస్లామాబాద్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..
చేసుకోవాల్సిన అవసరం ఉందని యూనస్ వ్యాఖ్య
-
Aug 25, 2025 09:21 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
బీసీ రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై..
న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం
సీఎంతో పాటు ఢిల్లీకి మంత్రులు పొన్నం, ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు
రేపు ఢిల్లీ నుంచి బిహార్ వెళ్లనున్న రేవంత్‌రెడ్డి
రాహుల్‌గాంధీ ఓట్ చోరీ యాత్రలో పాల్గొననున్న రేవంత్
-
Aug 25, 2025 09:05 IST
యూపీలో: ఘటల్ దగ్గర ఘోర రోడ్డుప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్, 8 మంది మృతి
మరో 43 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ప్రమాదం
-
Aug 25, 2025 08:50 IST
నేటినుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, పీవీ సింధులకు సవాల్
-
Aug 25, 2025 08:17 IST
బిహార్‌లో ఓటరు జాబితా సవరణ
98 శాతం మంది ఓటర్ల పత్రాలు అందాయన్న ఈసీ
మిగిలిన 2 శాతం మంది ఓటర్లకు ఈసీ సూచన
నిర్ణీత గడువులోగా పత్రాలు సమర్పించాలన్న ఈసీ
ఓటర్ల అభ్యంతరాల కోసం సెప్టెంబర్ 1వరకు గడువు
-
Aug 25, 2025 08:04 IST
హైదరాబాద్: అత్తాపూర్‌లో తప్పినముప్పు
ట్రాక్టర్‌పై గణేష్ విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్
విగ్రహానికి విద్యుత్ వైర్లు తగలడంతో చెలరేగిన మంటలు
ట్రాక్టర్ పైనుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న యువకులు
-
Aug 25, 2025 07:41 IST
నేడు ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శ్రీకారం
-
Aug 25, 2025 07:40 IST
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
యుద్ధం నిలిపివేతపై రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే..
భారత్‌పై అధిక సుంకాలు వేస్తున్నట్టు వాన్స్ ప్రకటన
చమురు విక్రయంతో ధనిక దేశంగా మారకుండా..
రష్యాను అడ్డుకోవడమే లక్ష్యం: జేడీ వాన్స్
-
Aug 25, 2025 07:27 IST
గాజాలో కొనసాగుతున్న ఆకలి చావులు
ఆకలితో ఇప్పటివరకు 290 మంది మృతి
మృతుల్లో 114 మంది చిన్నారులు
-
Aug 25, 2025 06:49 IST
నేటినుంచి 2 రోజులపాటు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
అహ్మదాబాద్‌లో రూ.5,400 కోట్ల ప్రాజెక్టులను..
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న మోదీ
-
Aug 25, 2025 06:49 IST
బిహార్‌లో ఓటరు జాబితా సవరణ
98 శాతం మంది ఓటర్ల పత్రాలు అందాయన్న ఈసీ
మిగిలిన 2 శాతం మంది ఓటర్లకు ఈసీ సూచన
నిర్ణీత గడువులోగా పత్రాలు సమర్పించాలన్న ఈసీ
ఓటర్ల అభ్యంతరాల కోసం సెప్టెంబర్ 1వరకు గడువు
-
Aug 25, 2025 06:49 IST
ఉత్తరాదిలో వర్ష బీభత్సం
జమ్మూలో 19 సెం.మీ. వర్షపాతం నమోదు
వరదల్లో చిక్కుకున్న 45 మంది విద్యార్థులు సురక్షితం
హిమాచల్‌లో భారీ వర్షాలతో హైవేలు మూసివేత
పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
-
Aug 25, 2025 06:15 IST
ఏపీలో నేటినుంచి ఇంటింటికీ స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లాలో స్మార్ట్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్ననాదెండ్ల
నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ
తొలి విడతలో 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ
-
Aug 25, 2025 06:15 IST
ఉన్నత విద్యాసంస్థలకు UGC ఆదేశం
దూరవిద్య లేదా ఆన్‌లైన్ ద్వారా ..
హెల్త్‌కేర్ కోర్సులను అందించడం నిలిపివేయాలని ఆదేశం
-
Aug 25, 2025 06:15 IST
బ్రిటన్‌లో నేరస్తులకు కొత్త తరహా శిక్షలు అమలు
నేరం చేస్తే పబ్‌లోకి నో ఎంట్రీ అంటూ ఆంక్షలు
నేరస్తుల డ్రైవింగ్‌పై పరిమితులు విధించిన బ్రిటన్
-
Aug 25, 2025 06:14 IST
నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఒడిశా-బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం
నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
నేడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Aug 25, 2025 06:14 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ఏఐసీసీ ముఖ్యనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం
ఎల్లుండి ఢిల్లీ నుంచి బిహార్ వెళ్లనున్న రేవంత్‌రెడ్డి
రాహుల్‌గాంధీ ఓట్ చోరీ యాత్రలో పాల్గననున్న రేవంత్