-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across globe on 17th august VR
-
Breaking News: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు
ABN , First Publish Date - Aug 18 , 2025 | 06:25 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 18, 2025 20:49 IST
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై దుష్ప్రచారం: ABN డిబేట్‌లో కూన రవి
కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఆరోపణలు నిరాధారం: కూన రవికుమార్
మానసికంగా వేధించానంటున్నారు.. ఎప్పుడు వేధించానో చెప్పాలి
కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్‌ది బ్లాక్‌మెయిల్ నేచర్: ABN డిబేట్‌లో కూన రవి
నాపై ఆరోపణలు చేసినవారందరిపై పరువునష్టం దావా వేస్తా: కూన రవికుమార్
అసెంబ్లీలోని ప్రివిలైజేషన్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తా: కూన రవికుమార్
-
Aug 18, 2025 20:49 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
ఘటనాస్థలిలో కీలక ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్
ఒక్కడే వచ్చి బాలికను హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ
నిందితుడి కోసం నాలుగు బృందాలుగా గాలిస్తున్న పోలీసులు
ఉదయం సహస్రాణి(12)ని కత్తితో పొడిచి చంపిన దుండగుడు
-
Aug 18, 2025 20:23 IST
అమరావతి: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు
హోంమంత్రికి తెలియకుండానే పెరోల్ మంజూరు
పెరోల్‌కు సిఫార్సు చేసిన ఇద్దరు నెల్లూరు MLAలు
శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసిన హోం సెక్రటరీ
హోం సెక్రటరీని వివరణ కోరిన హోంమంత్రి అనిత
ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో పెరోల్ ఇచ్చినట్టు హోంమంత్రికి తెలిపిన సెక్రటరీ
పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించిన హోంమంత్రి
రేపటిలోగా నివేదిక ఇవ్వాలని హోంమంత్రి అనిత ఆదేశం
-
Aug 18, 2025 20:23 IST
మూసీలోకి దూకిన యువకుడు..
హైదరాబాద్: చాదర్‌ఘాట్ బ్రిడ్జి పైనుంచి మూసీలోకి దూకిన యువకుడు
బైక్‌ను వంతెనపై పార్క్ చేసి బ్రిడ్జి పైనుంచి మూసీలోకి దూకిన యువకుడు
మూసీలో కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు
TS 11 FA 4052 నంబర్ ప్యాషన్ బైక్‌పై వచ్చిన యువకుడు
-
Aug 18, 2025 20:23 IST
వర్షాలతో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్‌లకు జలకళ: తెలంగాణ CMO
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు...
మిడ్ మానేరు, ఎల్ఎండీలో పెరుగుతున్న నీటి నిల్వలు: తెలంగాణ CMO
ఎగువన వర్షాలతో ఎస్సారెస్పీకి 3 రోజులుగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది: CMO
సోమవారం మధ్యాహ్నం 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు: CMO
76,867 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది: తెలంగాణ CMO
-
Aug 18, 2025 18:24 IST
తిరెడ్డి పెద్దారెడ్డి హైడ్రామాకు తెర
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైడ్రామాకు తెర
ఎట్టకేలకు తిరిగి స్వగ్రామం తిమ్మంపల్లికి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
పెద్దారెడ్డిని కలిసి సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అన్యాయంగా నిర్బంధించారు: కేతిరెడ్డి
రేపు హైకోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
-
Aug 18, 2025 17:39 IST
భారీ వర్షాలు.. మంత్రి అలర్ట్..
వర్షాల నేపథ్యంలో వ్యాధుల వ్యాప్తిపై అలర్ట్‌గా ఉండాలని అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు
డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగీ ప్రబలే అవకాశం: సత్యకుమార్
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్
అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ: సత్యకుమార్ యాదవ్
-
Aug 18, 2025 17:27 IST
జేపీ నడ్డాను కలిసిన టీ కాంగ్రెస్ ఎంపీలు
ఢిల్లీ: కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
జేపీ నడ్డాతో ఎంపీలు మల్లు రవి, రేణుకాచౌదరి, చామల కిరణ్, గడ్డం వంశీ భేటీ
కేంద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరాపై నేతల చర్చ
3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విడుదల చేయాలని కోరిన ఎంపీలు
-
Aug 18, 2025 17:27 IST
ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు
అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం
రాజధానిలో SRM, విట్ వర్సిటీలకు భూకేటాయింపునకు ఆమోదం
-
Aug 18, 2025 17:27 IST
మిథున్ రెడ్డితో ములాఖత్‌లు..
రాజమండ్రి: సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్‌లు
మిథున్ రెడ్డితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ములాఖత్
మిథున్ రెడ్డితో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాలసుబ్రమణ్యం ములాఖత్
-
Aug 18, 2025 17:27 IST
కీలక సమావేశం
ఢిల్లీ: సా.5:30కు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం
ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్ధి నిర్ణయంపై చర్చ
భేటీకి హాజరుకానున్న ఇండియా కూటమి పార్టీల పలు ఫ్లోర్ లీడర్లు
-
Aug 18, 2025 15:24 IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరిక
అన్ని పోర్టుల్లో కొనసాగుతోన్న మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
-
Aug 18, 2025 15:03 IST
ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం: IMD
తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: విద్యానగర్ టీఆర్టీ కాలనీలో నేలకూలిన భారీ చెట్టు, కారు ధ్వంసం
మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లిలో అలుగుపారుతున్న చెరువులు
మేడ్చల్-గౌడవెళ్లి రహదారిపై వరద ప్రవాహం, నిలిచిన రాకపోకలు
నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద, 6గేట్లు ఎత్తివేత
నిజామాబాద్: శ్రీరాంసాగర్‌కు భారీగా వరద, 24 గేట్లు ఎత్తివేత
ఏలూరు: కొల్లేరుకు వరద, పెనుమాకలంక-కైకలూరు మధ్య రాకపోకలు బంద్
ముంబైని ముంచెత్తిన వరదలు, లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం
హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు నిలిచిన రాకపోకలు
-
Aug 18, 2025 14:44 IST
దేశంలో ఓట్ల చోరీ జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
4 నెలల్లో కోటి కొత్త ఓట్లు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్‌రెడ్డి
మహారాష్ట్రలో ఈసీ కోటి కొత్త ఓట్లను నమోదు చేసింది
దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాయి
బీహార్‌లో 65 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది: సీఎం రేవంత్‌రెడ్డి
తప్పులను ప్రశ్నిస్తున్న రాహుల్‌ను ఈసీ అఫిడవిట్ అడుగుతోంది
దేశంలో ఓట్ల దొంగల భరతం పడతాం: సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 18, 2025 13:08 IST
రామంతాపూర్ కరెంట్ షాక్ ఘటనలో ఆరుగురు మృతి
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి శ్రీధర్‌బాబు
-
Aug 18, 2025 12:47 IST
జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్
ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు..
సహకరించాలని జగన్‌ను కోరిన రాజ్‌నాథ్
-
Aug 18, 2025 11:53 IST
ఢిల్లీ: విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఏపీలో డేటా సిటీ, AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం కేంద్ర సహకారం కోరిన లోకేష్
విశాఖలో డేటా సిటీ అభివృద్ధితో ఏపీని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే యోచన
ఉద్యోగులు, పరిశ్రమలను అనుసంధానించే స్కిల్ పోర్టల్ త్వరలో ప్రారంభం: లోకేష్
-
Aug 18, 2025 11:51 IST
శ్రీసత్యసాయి జిల్లా: తనకల్లు మం. మండ్లిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ, ముగ్గురు మృతి
మరో ఐదుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషయం
తిరుమల నుంచి బళ్లారి వెళ్తున్న వారిగా గుర్తింపు
-
Aug 18, 2025 11:29 IST
మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
గతంలో నమోదైన ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డిపై నమోదైన ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు
-
Aug 18, 2025 11:13 IST
ఢిల్లీ: CEC జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు యత్నం
సంతకాల సేకరణ చేయాలని విపక్షాల నిర్ణయం
ఓట్ చోరీపై రాహుల్ పట్ల జ్ఞానేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న విపక్ష నేతలు
ఓట్ చోరీపై అఫిడవిట్ ఇవ్వాలి.. లేదంటే CEC క్షమాపణ చెప్పాలి: విపక్షాలు
-
Aug 18, 2025 11:12 IST
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన
నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష ఎంపీలు
ఓటు చోరీ అంశంపై ప్రతిపక్షాల నిరసన
బిహార్‌లో ఓటరు జాబితా సవరణ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
మోడీ ఓటు దొంగతనానికి పాల్పడుతున్నాడంటూ విపక్ష ఎంపీల నినాదాలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్
-
Aug 18, 2025 10:52 IST
అమరావతి: సచివాలయంలో కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ సమావేశం
హాజరైన మంత్రులు నారాయణ, సంధ్యారాణి, ఉన్నతాధికారులు
జూమ్ ద్వారా హాజరైన మంత్రులు కొల్లు రవీంద్ర, దుర్గేష్
-
Aug 18, 2025 10:51 IST
తెలంగాణలో యూరియా కొరతపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
సత్తెనపల్లి మండలం గండ్లూరు అడ్డరోడ్ దగ్గర లారీ దగ్ధం, డ్రైవర్ సురక్షితం, బూడిదైన 50 క్వింటాళ్ల వరి ధాన్యం
మయన్మార్‌లో తెలుగు యువకులకు చిత్రహింసలు, ఉద్యోగాల పేరుతో పిలిపించుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నారని యువకుల ఆవేదన, ప్రభుత్వమే రక్షించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులు
-
Aug 18, 2025 10:32 IST
విశాఖలో కాల్పుల కలకలం
పాతకక్షలతో నాటు తుపాకీతో కాల్పులు
చిలకపేట దగ్గర చేపల రాజేష్ అనే వ్యక్తిపై కాల్పులు
నాటు తుపాకీ కాల్పుల్లో రాజేష్‌కి తీవ్ర గాయాలు
-
Aug 18, 2025 10:32 IST
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం
లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు
-
Aug 18, 2025 10:31 IST
అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత
తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న పెద్దారెడ్డిని..
నారాయణరెడ్డిపల్లి దగ్గర అడ్డుకున్న పోలీసులు
శాంతిభద్రతల సమస్యతో కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
మరోవైపు శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
-
Aug 18, 2025 10:30 IST
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
950 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
315 పాయింట్ల లాభంలో నిఫ్టీ ట్రేడింగ్
-
Aug 18, 2025 10:29 IST
నల్లగొండ: కనగల్ పీఎస్‌లో పోలీసుల మధ్య ఘర్షణ
స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన దావత్‌లో..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ మధ్య తీవ్ర వాగ్వాదం
పోలీసుల తీరుపై మండిపడుతున్న స్థానికులు
కనగల్ పోలీసుల ఘర్షణపై ఉన్నతాధికారుల సీరియస్
-
Aug 18, 2025 10:03 IST
హైదరాబాద్: ఈ నెల 23న పీఏసీ సమావేశం
స్థానిక ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ
-
Aug 18, 2025 09:55 IST
అమరావతి: ఉ.11:45 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
మ.12 గంటలకు మైనింగ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
మ.3:20కి CRDA అథారిటీ సమావేశంలో పాల్గొననున్న సీఎం
-
Aug 18, 2025 09:54 IST
ఢిల్లీ: ద్వారకలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్, పోలీసులు
-
Aug 18, 2025 08:52 IST
కడప: మయన్మార్‌లో తెలుగు యువకులకు చిత్రహింసలు
ఉద్యోగాల పేరుతో థాయిలాండ్ పిలిపించుకుని మయన్మార్‌లో తెలుగు యువకులతో సైబర్ నేరాలు చేయిస్తున్న అక్కడి ముఠాలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కడప యువకుడు
-
Aug 18, 2025 08:34 IST
హైదరాబాద్: నేడు ఫిల్మ్ ఛాంబర్‌తో ఫెడరేషన్ భేటీ
ఉ.11 గంటలకు జరగనున్న సమావేశం
సమావేశానికి హాజరుకానున్న 24 కార్మిక సంఘాల నేతలు
కార్మికుల వేతనాలు, సమస్యలపై చర్చించే అవకాశం
సా.4 గంటలకు చిరంజీవి నివాసంలో సమావేశం
-
Aug 18, 2025 08:17 IST
నేడు ట్యాంక్‌బండ్ దగ్గర సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి శంకుస్థాపన
పాపన్నగౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమం
సాయంత్రం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, టీ-ఫైబర్‌పై సీఎం రేవంత్ సమీక్ష
-
Aug 18, 2025 08:08 IST
బిహార్‌లో రెండోరోజు రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర
1300 కి.మీ. మేర సాగనున్న రాహుల్ యాత్ర
సెప్టెంబర్ 1న భారీ బహిరంగ సభతో యాత్ర ముగింపు
-
Aug 18, 2025 07:47 IST
అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఆదిలాబాద్, హన్మకొండ, వరంగల్, కామారెడ్డి,..
ఖమ్మం, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి,..
మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు
-
Aug 18, 2025 07:23 IST
నేడు భారత్ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్
విదేశాంగమంత్రి జైశంకర్‌తో వాంగ్ భేటీ
రేపు ప్రధాని మోదీతో వాంగ్ సమావేశం
షాంగై సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్న వాంగ్
-
Aug 18, 2025 07:18 IST
కడప జిల్లా టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
ZPTC ఉపఎన్నికల్లో టీడీపీ ఘనవిజయంపై కడప తెలుగు తమ్ముళ్లను..
రేపు భేటీకి కావాలని పిలిచిన సీఎం చంద్రబాబు
-
Aug 18, 2025 07:18 IST
ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్
సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీగా ఎయరిండియా విమానం ల్యాండింగ్
సాంకేతిక సమస్యతో మిలన్-ఢిల్లీ ఎయిరిండియా విమానం రద్దు
-
Aug 18, 2025 07:10 IST
హైదరాబాద్: రామంతాపూర్ గోఖలేనగర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం
శ్రీకృష్ణ శోభాయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
కరెంట్ షాక్‌తో మరో నలుగురి పరిస్థితి విషమం
మృతులు: శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34)
రాజేంద్రరెడ్డి(39), రుద్రవికాస్(39), కృష్ణ యాదవ్(24) మృతి
గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్
-
Aug 18, 2025 06:55 IST
ఢిల్లీ చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
నేడు ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ అయ్యే అవకాశం
22, 23 తేదీల్లో నేషనల్ స్పేస్ డేలో పాల్గొననున్న శుభాంశు
యాక్సియం-4 సక్సెస్ తర్వాత తొలిసారి భారత్‌కు శుభాంశు
-
Aug 18, 2025 06:29 IST
ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల సమావేశం
ఉ.10:15కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో భేటీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం
-
Aug 18, 2025 06:27 IST
ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్
పెండింగ్ ప్రాజెక్ట్‌లపై నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీకానున్న నారా లోకేష్
ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న మంత్రి నారా లోకేష్
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీతో భేటీకానున్న లోకేష్
ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‌తో భేటీకానున్న లోకేష్
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీకానున్న లోకేష్
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో భేటీకానున్న మంత్రి లోకేష్
ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందించనున్న మంత్రి లోకేష్
-
Aug 18, 2025 06:26 IST
హైదరాబాద్: 24 సినిమా సంఘాలతో నేడు ఫిల్మ్ ఫెడరేషన్ భేటీ
ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలపై నేడు చర్చించనున్న ఫిల్మ్ పెడరేషన్
-
Aug 18, 2025 06:25 IST
ఏపీలో పలు జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటన
విశాఖ జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటన
విశాఖలో భారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన కలెక్టర్
నేడు అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
భారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన కలెక్టర్ దినేష్‌కుమార్