-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Sunday 20th July 2025 Top news and Major Events Across India Siva
-
Breaking News: ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్
ABN , First Publish Date - Jul 20 , 2025 | 11:03 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jul 20, 2025 17:01 IST
మిథున్‌రెడ్డికి రిమాండ్..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్
లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఎంపీ మిథున్‌రెడ్డి
ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్‌రెడ్డి
-
Jul 20, 2025 13:45 IST
నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లుతో రుణాలు
కుబేరా సినిమా తరహాలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర టోకరా
తమిళనాడు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ కుంభకోణాలు
నిరుపేదలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చూపి రుణాలు తీసుకున్న మాఫియా
రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో బయటపడ్డ భాగోతం
-
Jul 20, 2025 12:17 IST
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి
CRPF భద్రత మధ్య ఎంపీ మిథున్‌రెడ్డిని ఏసీబీ కోర్టుకు తరలింపు
-
Jul 20, 2025 12:13 IST
విజయవాడ: ప్రభుత్వ ఆస్పత్రిలో మిథున్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు.
బీపీ, షుగర్, ఈసీజీ వంటి సాధారణ ఫీట్ నెస్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.
మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు.
-
Jul 20, 2025 11:14 IST
ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం..
ఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం.
సమావేశానికి హాజరైన అన్ని పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు.
సమావేశానికి హాజరైన టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, బిఆర్ఎస్ నుంచి కె.ఆర్ సురేష్ రెడ్డి హాజరు.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న కేంద్రం.
సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని కోరనున్న పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి.
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.
సమావేశాల్లో పెహల్గామ్ ఉగ్రదాడి, బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ కాల్పుల విరమణపై ఏకపక్షంగా ట్రంప్ ప్రకటన చేయడంపై సభలో చర్చకు డిమాండ్ చేయనున్న విపక్షాలు.
-
Jul 20, 2025 11:06 IST
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి మిథున్‌రెడ్డి తరలింపు
వైద్య పరీక్షల తర్వాత ACB కోర్టుకు ఎంపీ మిథున్‌రెడ్డి
లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఎంపీ మిథున్‌రెడ్డి
కాసేపట్లో న్యాయాధికారి ముందుకు మిథున్‌రెడ్డి
-
Jul 20, 2025 11:05 IST
కర్నూలు: తుంగభద్ర డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం.
9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల.
పూర్తిస్థాయి నీటిమట్టం: 1633 అడుగులు.
ప్రస్తుతం నీటి మట్టం: 1626.03 అడుగులు.
తుంగభద్ర డ్యామ్ ఇన్ ఫ్లో 39.213 క్యూసెక్కులు.
అవుట్ ఫ్లో 39,009 క్యూ సెక్కులు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105 టీఎంసీలు.
ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం 79.900 టీఎంసీలు.
-
Jul 20, 2025 11:03 IST
లిక్కర్ స్కామ్‌లో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు: ఎమ్మెల్యే యరపతినేని
జగన్ పేరు బయటకు వచ్చింది: ఎమ్మెల్యే యరపతినేని
వైసీపీ వాళ్లకి దమ్ముంటే నరికే వాళ్ల పేర్లు చెప్పండి: యరపతినేని
రాజకీయ విమర్శలు చేయాలిగాని వ్యక్తిగత విమర్శలు కాదు: యరపతినేని
సొంత బాబాయిని చంపిన చరిత్ర వారిది: ఎమ్మెల్యే యరపతినేని
సొంత పార్టీ నేతలనే జగన్ రప్పా రప్పా ఆడిస్తాడు: యరపతినేని
కూటమి అధినేతలను వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోం
గురజాల నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలపై విచారణ: యరపతినేని
-
Jul 20, 2025 11:03 IST
ఘనంగా కొనసాగుతున్న లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి బోనాల జాతర.
అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత.
అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు తీసుకున్న కవిత.