-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Friday 18th July 2025 Top news and Major Events Across India Siva
-
Breaking News: వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?: రేవంత్
ABN , First Publish Date - Jul 18 , 2025 | 11:00 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jul 18, 2025 20:49 IST
ఎన్టీఆర్: తిరువూరు ఇరిగేషన్ AE కిషోర్ అదృశ్యం
ఆత్మహత్య చేసుకోనున్నట్లు ఇరిగేషన్ AE కిషోర్ లేఖ
తన చావుకు ఉన్నతాధికారులే కారణమని కిషోర్ లేఖ
AE కిషోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
-
Jul 18, 2025 20:49 IST
మరో వారం పొడిగింపు..
తెలంగాణలో ఇందిర మహిళా శక్తి సంబరాలు మరో వారం పొడిగింపు
ఈ నెల 24 వరకు ఇందిర మహిళా శక్తి సంబరాలు
ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తి మేరకు పొడిగింపు
-
Jul 18, 2025 20:49 IST
అలర్ట్.. వర్షాలపై సీఎం ఏం చెప్పారంటే..
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
GHMC, HMDA, వాటర్ వర్క్స్, విద్యుత్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
NDRF, SDRF, హైడ్రా సహా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలి: సీఎం రేవంత్
-
Jul 18, 2025 20:49 IST
మరో పిటిషన్..
రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములపై హైకోర్టులో మరో పిటిషన్
భూదాన్ భూములను IAS, IPSలకు విక్రయించడంపై విచారణ కమిషన్ వేయాలని కోరిన పిటిషనర్
భూదాన్ భూములపై వివరణ ఇచ్చేందుకు గడువు కోరిన ఏజీ
తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన టీజీ హైకోర్టు
-
Jul 18, 2025 20:18 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నివాసంలో ముగిసిన టీడీపీపీ భేటీ
రైతులకు మెరుగైన సబ్సిడీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, రాజధాని అభివృద్ధి అంశాలపై కేంద్రాన్ని కోరాలని సీఎం దిశానిర్దేశం
ఏకైక రాజధాని అమరావతి అనే అంశానికి చట్టబద్ధత కల్పించే అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు స్పష్టత వచ్చే అవకాశం
రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ భారత్ గౌరవ్ రైళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు: ఎంపీ లావు
జల్‌జీవన్ మిషన్ పెండింగ్ అంశాలపైనా కేంద్రాన్ని కోరతాం: ఎంపీ లావు
ఆపరేషన్ సిందూర్‌ను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం: ఎంపీ లావు
-
Jul 18, 2025 18:11 IST
పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోవడం చంద్రబాబుకు న్యాయమా?: రేవంత్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను రద్దు చేసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి: రేవంత్
పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు: సీఎం రేవంత్
చంద్రబాబు సహకరించకపోతే పోరాటం తప్పదు: సీఎం రేవంత్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్
కేసీఆర్ నీ గుండెల్లో రాసుకో.. మరో పదేళ్లు నేనే సీఎం: సీఎం రేవంత్
నీ కొడుకు గుండె మీద రాసుకో.. మరో పదేళ్లు నేనే సీఎం: సీఎం రేవంత్
ఈ పాలమూరు బిడ్డే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటాడు: సీఎం రేవంత్
పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం: సీఎం రేవంత్
నీకు దుఃఖమొస్తదో.. బావిలో దుంకుతవో.. పెట్రోల్ పోసి కాలబెట్టుకుంటవో నీ ఇష్టం
నువ్వు అసెంబ్లీకి రావాలె.. మేం చేసే మంచి పనులను చూసి కుమిలికుమిలి ఏడ్వాలె
అందుకే నిన్ను అసెంబ్లీకి పిలుస్తున్నా: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:54 IST
వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం: సీఎం రేవంత్
శిల్పారామంలో ప్రపంచంతో పోటీపడే ఉత్పత్తులు అమ్ముకునేలా చేశాం: సీఎం రేవంత్
కేసీఆర్ తన బిడ్డకు బంజారాహిల్స్‌లో బంగ్లా కట్టించారు: సీఎం రేవంత్
2035 నాటికి ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్
కోటిమంది ఆడబిడ్డలను పదేళ్లలో కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
మహిళలు బాగుపడుతుంటే కేసీఆర్ ఆరోగ్యం పాడైంది: సీఎం రేవంత్
కడుపులో విషం పెట్టుకుని ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేసి తీస్తారు: సీఎం రేవంత్
మహిళలకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఏప్పుడైనా ఆలోచించారా?: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:54 IST
ఐదేళ్లు కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదు: సీఎం రేవంత్
మేం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం: సీఎం రేవంత్
ఆడబిడ్డలను పెట్రోల్ బంక్‌లకు యజమానులను చేశాం: సీఎం రేవంత్
వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి కాంట్రాక్టులు మా ఆడబిడ్డలకు ఇచ్చాం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:54 IST
అడుక్కుంటే కాదు.. బరిగీసి కొట్లాడితే మేమంతా కుర్చీల్లో కూర్చున్నాం: రేవంత్
కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. 24 గంటల కరెంటు ఇస్తున్నాం: రేవంత్
ఉచిత కరెంటు మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం: సీఎం రేవంత్
కాంగ్రెస్‌కు ఉచిత కరెంటు గురించి కేసీఆర్ చెప్పాలా?: సీఎం రేవంత్
మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది: రేవంత్
కాంగ్రెస్‌ను ఆశీర్వదించినందుకు రైతుల రుణం తీర్చుకున్నాం: రేవంత్
9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు వేశాం: సీఎం రేవంత్
కరెంటు ఇవ్వడమే కాదు వరి పండించిన రైతులకు బోనస్ ఇస్తున్నాం: రేవంత్
రైతులు సంతోషంగా ఉంటే కడుపుమంటతో మీకు దుఃఖం వస్తోంది: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:54 IST
ప్రజా పాలన చూసి కేసీఆర్‌కు దుఃఖం వస్తోంది: సీఎం రేవంత్
నల్లమల బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడని మీకు దుఃఖం వస్తోందా?
మేం చేపలు పట్టుకోవాలి.. చెప్పులు కుట్టుకోవాలా?: సీఎం రేవంత్
నువ్వు, నీ కుటుంబం, నీ మనవళ్లు రాజ్యాలు ఏలాలా?: సీఎం రేవంత్
మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు.. ఎందుకు రాజ్యాలు ఏలొద్దు?
ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కేసీఆర్‌కు దుఃఖం వస్తోందా?
కేసీఆర్ మనవళ్లతో సమానంగా దళిత బిడ్డలు చదువుతుంటే దుఃఖం వస్తోందా?
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఎందుకు పూర్తి చేయలేదు?
ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టులకు ఎక్కువ అన్యాయం
పాలమూరు పచ్చగా మారుతుంటే, మా పొలాల్లో కృష్ణా నీళ్లు పారుతుంటే..
తట్టుకోలేక కేసీఆర్ విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:26 IST
వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?: రేవంత్
మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్‌కు కడుపుమంట: సీఎం రేవంత్
కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చిన కేసీఆర్‌ను ఆదరిస్తే సున్నం పెట్టారు: రేవంత్
చెప్పులు కుట్టడం, గొర్రెలు పెంచడం, చేపలు పట్టాలని కేసీఆర్ చెప్పారు: రేవంత్
ఆయన బిడ్డలు రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?: రేవంత్
కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుతుంటే ఆయనకు దుఃఖమొచ్చిందా?: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:25 IST
నాగర్‌కర్నూల్: జటప్రోలులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం
కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు ఇస్తాం: సీఎం రేవంత్
పాలమూరు అంటే కల్వకుంట్ల కుటుంబానికి చిన్నచూపు: సీఎం రేవంత్
కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే.. పాలమూరుకు వలస వచ్చారు: సీఎం రేవంత్
ఎంపీగా గెలిపిస్తే.. పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్
పాలమూరు ప్రజలను కేసీఆర్ ఎందుకు ఆదుకోలేదు?: సీఎం రేవంత్
ఆనాడు కేసీఆర్ తన ఇల్లు అమ్మి అయినా వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామన్నారు: సీఎం రేవంత్
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు ప్రజలను ఎందుకు ఆదుకోలేదు?: సీఎం రేవంత్
-
Jul 18, 2025 17:25 IST
బీసీ గురుకులాల ప్రిన్సిపల్స్, అధికారులతో మంత్రి పొన్నం జూమ్ రివ్యూ
ఆర్సీవోలు ఎప్పటికప్పుడు గురుకులాలను తనిఖీ చేయాలి: మంత్రి పొన్నం
విద్యార్థులపై ప్రిన్సిపల్స్, టీచర్ల నిరంతర పర్యవేక్షణ ఉండాలి: పొన్నం
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడొద్దు: మంత్రి పొన్నం
ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవు: మంత్రి పొన్నం ప్రభాకర్
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: మంత్రి పొన్నం
విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలి: మంత్రి పొన్నం
-
Jul 18, 2025 17:23 IST
హైదరాబాద్: గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్
ఏఎంబీ మాల్ ముందు భారీగా నిలిచిన వర్షపు నీరు
హఫీజ్‌పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్
హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
స్విమ్మింగ్ పూల్స్‌ను తలపిస్తున్న ఐటీ కారిడార్ రోడ్లు
-
Jul 18, 2025 17:23 IST
OMC కేసులో శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
ముగిసిన ఇరుపక్షాల వాదనలు, తీర్పు రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు
2006లో పరిశ్రమలశాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించాకే..
మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సీబీఐ వాదనలు
శ్రీలక్ష్మి అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీబీఐ
OMC కేసులో A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా..
సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన శ్రీలక్ష్మి తరఫు లాయర్లు
తమ వాదనలతో పాటు సీబీఐ జడ్జిమెంట్‌ను పరిగణలోకి తీసుకోవాలన్న లాయర్లు
-
Jul 18, 2025 17:22 IST
ఎన్టీఆర్: మైలవరంలో భారీ వర్షం
గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
వర్షం ధాటికి లొతట్టు ప్రాంతాలు జలమయం
చెరువులా మారిన మైలవరం ప్రధాన సెంటర్
-
Jul 18, 2025 17:22 IST
నాగార్జునసాగర్ హైడ్రో పవర్‌ప్లాంట్‌ను సందర్శించిన భట్టి విక్రమార్క
హరిత విప్లవంలో భాగంగానే నాగార్జునసాగర్ నిర్మాణం: భట్టి
రివర్స్ పంపింగ్‌తో విద్యుదుత్పత్తి గతంలోనే జరిగింది: భట్టి
తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తున్నాం: భట్టి
ఏడాదిలో 2వేల మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ ఉంది
2030 వరకు 25వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది: భట్టి
అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమల ద్వారా విద్యుత్ డిమాండ్
రీ ఎనర్జీబుల్ విద్యుత్‌తో కాలుష్యాన్ని తగ్గించాం: డిప్యూటీ సీఎం భట్టి
ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల ద్వారా విద్యుదుత్పత్తి కోసం చర్యలకు నిర్ణయం
సోలార్ పవర్ కోసం మార్గాలు అన్వేషిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్ఎస్ నేతలు బడాయి మాటలు మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
-
Jul 18, 2025 15:39 IST
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
మెహదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్‌లో వర్షం
గోల్కొండ, అత్తాపూర్, లంగర్‌హౌస్‌లో వర్షం
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం
తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడలో వర్షం
-
Jul 18, 2025 13:59 IST
ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఔట్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రమే..
కూటమిలో భాగంగా ఉన్నామని ఆప్ వెల్లడి
-
Jul 18, 2025 13:06 IST
ఖమ్మం: రేవంత్ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలి: కేటీఆర్
గుంపు మేస్త్రీ నోటి నుంచి కంపు మాటలు: కేటీఆర్
రేవంత్ నికృష్ణపు మాటలను దేశం మొత్తం చూస్తోంది: కేటీఆర్
రేవంత్‌రెడ్డితో యూట్యూబ్ చానెళ్లకు చేతినిండా పని: కేటీఆర్
20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు పెట్టి ఏం చేశారు?: కేటీఆర్
-
Jul 18, 2025 11:59 IST
మిథున్ రెడ్డికి బిగ్ షాక్..
మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.
ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ధర్మాసనం.
ఇదిలాఉంటే.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం వారెంట్ కోరుతూ కోర్ట్‌లో పిటీషన్ వేసిన సిట్ అధికారులు.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్ట్.
హైకోర్ట్ ఉత్తర్వులను సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేసిన మిథున్ రెడ్డి.
ఈ రోజు సుప్రీంకోర్ట్‌లో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిగింది.
సుప్రీం ధర్మాసనం మిథున్ రెడ్డికి బెయిల్‌ను నిరాకరించింది.
ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం వారెంట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్‌లో పిటీషన్ వేసిన సిట్.
మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్న సిట్ అధికారులు.
-
Jul 18, 2025 11:54 IST
అంతర్జాతీయ స్థాయికి ఏపీ లిక్కర్ స్కామ్..

అమరావతి: ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు.
ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం టెర్రరిస్ట్‌లపై తీసుకున్న చర్యలు చూశాం.
అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటారు.
కానీ లిక్కర్ స్కామ్‌లో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయి.
ఢిల్లీ లిక్కర్ కేసు, కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతోంది.
అలాగే ఈడి ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌పై చర్యలు తీసుకోవాలి.
రూ. 3200 కోట్లే మద్యం స్కామ్ కాదు ఇది.. 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కామ్ పై విచారణ జరగాలి.
ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటింది.
ఈ స్కామ్ దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలి.
రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించింది.
అలాగే ఏపీ మద్యం స్కామ్‌పై కూడా విచారణ చేయాలి.
-
Jul 18, 2025 11:09 IST
కాకతీయ జంతు ప్రదర్శనశాలకు కొత్తగా తెల్ల పులి
సందర్శకుల వీక్షణ కోసం ఎన్‌క్లోజర్‌లోకి వదిలిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.
వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి.
మంత్రి కొండా సురేఖ కామెంట్స్..
గతంలో ఈ జంతు ప్రదర్శన శాలలో ఎలాంటి సౌకర్యాలు లేవు.
వర్షం వస్తే... జూ అంతా వరదలే.
ఇప్పుడు వరద కాలువలు నిర్మించి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
త్వరలోనే కొత్తగా మరిన్ని జంతువులు.
జూ లో మరిన్ని అభివృద్ధి చర్యలు చేపడుతున్నాం.
హైదరాబాద్ తర్వాత వరంగల్ జూ అనే విధంగా అభివృద్ధి.
-
Jul 18, 2025 11:00 IST
హైదరాబాద్: హైడ్రా ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తి
అంబర్‌పేట బతుకమ్మకుంట దగ్గర హైడ్రా ప్రధమ వార్షికోత్సవం
పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాధ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో.. మొదట్లో మేం చాలా దూకుడుగా వ్యవహరించాం: రంగనాథ్
దూకుడుగా వ్యవహరించడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి.
భావితరాలకు భవిష్యత్ ఇవ్వడానికే హైడ్రా.
సీఎం ఆదేశాలతో సామాజిక కోణంలో పేదల ఇళ్లు కూల్చడం లేదు.
కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 21 న బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైడ్రా అంటే డిమాలిషన్ డెవలప్‌మెంట్.
ఇప్పుటిదాకా వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమే.
త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయి.