-
-
Home » Mukhyaamshalu » Breaking News across GLOBE on 28th August 2025 Siva
-
BREAKING: ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - Aug 28 , 2025 | 01:49 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 28, 2025 21:36 IST
దేశ విభజనకు వ్యతిరేకంగా RSS నిరసన తెలపలేదు: మోహన్ భగవత్
అప్పట్లో నిరసన తెలిపే అంత శక్తి RSSకు లేదు: RSS చీఫ్ భగవత్
అఖండ భారత్ అనేది నిజం: RSS చీఫ్ మోహన్ భగవత్
ప్రతి కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలి: మోహన్ భగవత్
ఇస్లాం లేదని ఏ హిందువు కూడా చెప్పడు: మోహన్ భగవత్
మేం హిందువులం.. భారతీయులం.. మేమంతా ఒక్కటే
మాకు దేశమే తొలి ప్రాధాన్యం: RSS చీఫ్ మోహన్ భగవత్
-
Aug 28, 2025 21:36 IST
RSS శతజయంతి కార్యక్రమంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
75ఏళ్లకు రిటైర్ కావాలని నేను ఎవరికీ చెప్పలేదు: మోహన్ భగవత్
75ఏళ్లకు రిటైర్ అవుతానని నేను కూడా చెప్పలేదు: మోహన్ భగవత్
సంఘ్ ఎలా చెప్తే మేం అలా నడుచుకుంటాం: మోహన్ భగవత్
రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు మా మద్దతు: RSS చీఫ్ భగవత్
భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే: RSS చీఫ్ మోహన్ భగవత్
కేంద్రం, రాష్ట్రాలతో ఎలాంటి విభేదాలు లేవు: RSS చీఫ్
RSSకు ఎలాంటి సబార్డినేట్ సంస్థలు లేవు: మోహన్ భగవత్
RSS ప్రతిదీ నిర్ణయిస్తుందనుకోవడం తప్పు: మోహన్ భగవత్
ప్రభుత్వంలో RSS జోక్యం ఉండదు.. సలహాలు మాత్రమే ఇస్తాం: భగవత్
-
Aug 28, 2025 21:36 IST
కేంద్రం, రాష్ట్రాలతో ఎలాంటి విభేదాలు లేవు: RSS చీఫ్
RSSకు ఎలాంటి సబార్డినేట్ సంస్థలు లేవు: మోహన్ భగవత్
RSS ప్రతిదీ నిర్ణయిస్తుందనుకోవడం తప్పు: మోహన్ భగవత్
ప్రభుత్వంలో RSS జోక్యం ఉండదు.. సలహాలు మాత్రమే ఇస్తాం
విద్యా విధానం గురుకుల విద్యకు అనుసంధానంగా ఉండాలి
భారత్‌ను అర్థం చేసుకునేందుకు సంస్కృతం తప్పనిసరి: RSS చీఫ్
విద్యార్థులు కచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలి: మోహన్ భగవత్
-
Aug 28, 2025 19:15 IST
కర్ణాటక: మంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం
ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు
బ్రేక్స్ విఫలమై జనంపైకి దూసుకెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
-
Aug 28, 2025 19:14 IST
మూసీలో వ్యక్తి గల్లంతు..
హైదరాబాద్: చాదర్‌ఘాట్ దగ్గర మూసీలో వ్యక్తి గల్లంతు
ఈత కొడుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన సలీం ఖురేషి
సలీం కోసం గాలిస్తున్న హైడ్రా, SDRF బృందాలు
-
Aug 28, 2025 18:12 IST
కామారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ రద్దు
హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో రివ్యూ రద్దు
కామారెడ్డిలో జరగాల్సిన సీఎం రేవంత్ రివ్యూ మెదక్‌కు మార్పు
మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ
-
Aug 28, 2025 18:12 IST
యువకుల అత్యుత్సాహం..
సూర్యాపేట: అనంతగిరి మం. గొండ్రియాలలో యువకుల అత్యుత్సాహం
పాలేరు వాగు దాటేందుకు పందెం వేసుకున్న ముగ్గురు యువకులు
వరద పోటెత్తడంతో కొట్టుకుపోయిన యువకుడు, కొనసాగుతోన్న గాలింపు
-
Aug 28, 2025 18:06 IST
పైలా దిలీప్ కు బెయిల్..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో పైలా దిలీప్(A30)కు బెయిల్
రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్లు డిస్మిస్
-
Aug 28, 2025 18:06 IST
విద్యాసంస్థలకు సెలవు..
కామారెడ్డిలో రేపు, ఎల్లుండి కూడా విద్యాసంస్థలకు సెలవు
మెదక్ జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు
-
Aug 28, 2025 18:06 IST
విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరద
నిర్మల్: బాసర మండలం బిద్రెల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరద
అంగన్వాడీ కేంద్రం సహా లోతట్టుప్రాంతాలు జలమయం
-
Aug 28, 2025 18:06 IST
మెదక్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షం
నదులు, వాగుల్లో తగ్గిన వరద ప్రవాహం
వర్షం తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు
-
Aug 28, 2025 16:41 IST
హైదరాబాద్: అసెంబ్లీ సెక్రటరీని కలిసిన BRS ఎమ్మెల్యేలు
కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించేందుకు సమయం ఇవ్వాలని వినతి
అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని కోరిన BRS ఎమ్మెల్యేలు
-
Aug 28, 2025 16:41 IST
జగన్ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేశారు: కొల్ల రవీంద్ర
వైసీపీ హయాంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి
జగన్ ఏరికోరి తెచ్చుకున్న శ్రీలక్ష్మిపై వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు
పాపాలు, తప్పిదాలు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే: మంత్రి కొల్లు రవీంద్ర
-
Aug 28, 2025 16:41 IST
మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్: పంటనష్ట నివారణ చర్యలపై మంత్రి తుమ్మల సమీక్ష
వ్యవసాయశాఖ పరిధిలోని శాఖలు, కార్పొరేషన్స్‌లో విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం
యూరియా సరఫరాలో డిమాండ్ ఉన్న జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలి: మంత్రి తుమ్మల
-
Aug 28, 2025 16:41 IST
గోదావరి జలాలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గుండెకాయ: రేవంత్
పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో లోపాలున్నాయి: రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం: రేవంత్
కాళేశ్వరం డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలు: రేవంత్
మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవు: రేవంత్
విపక్షాల అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవాలి: రేవంత్
తెలుగువాడైన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని..
చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్ గెలిపించాలి: సీఎం రేవంత్
-
Aug 28, 2025 15:41 IST
ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలి: చంద్రబాబు
కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి: చంద్రబాబు
ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు
అవసరమైతే స్కీమ్స్‌ను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దాం: చంద్రబాబు
కుటుంబం ఉమ్మడిగా ఉన్నా సంక్షేమం అందేలా చర్యలు: చంద్రబాబు
-
Aug 28, 2025 15:41 IST
అమరావతి: ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచన
అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపర్చనున్న ప్రభుత్వం
త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశం
-
Aug 28, 2025 15:41 IST
ఎల్లంపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి..
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సైట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బృందం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లిన సీఎం
సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Aug 28, 2025 15:37 IST
నిర్మల్-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిపివేత
కామారెడ్డి-నిర్మల్ హైవేపై భారీగా నిలిచిన వరద
కరీంనగర్-జగిత్యాల వైపు వాహనాల దారి మళ్లింపు
నిర్మల్ జిల్లాకు రాకపోకలు నిలిపివేత
-
Aug 28, 2025 15:35 IST
లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి ఇంటెరిమ్ బెయిల్ పిటిషన్
రెగ్యులర్ బెయిల్‌తో పాటు మిథున్‌రెడ్డి ఇంటెరిమ్ బెయిల్ పిటిషన్
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు..
అనుమతి ఇవ్వాలంటూ మిథున్‌రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్
-
Aug 28, 2025 14:38 IST
జగిత్యాల: ధర్మపురి దగ్గర గోదావరికి పెరుగుతున్న వరద
ధర్మపురిలో సంతోషిమాత ఆలయంలోకి చేరిన గోదావరి వరద.
గోదావరి తీరంలోని దుకాణాలను ఖాళీ చేయించిన అధికారులు.
నేరెళ్ల దగ్గర హైవేపైకి చేరిన వరదనీరు.
జగిత్యాల-మంచిర్యాల జిల్లాలకు నిలిచిన రాకపోకలు.
సారంగాపూర్, రేచపల్లి, రాయికల్‌లో ఇళ్లలోకి వరద.
-
Aug 28, 2025 14:37 IST
నిజామాబాద్: భారీ వరదతో కప్పలవాగుపై తెగిన వంతెన
కొండూరు పరిసరాలకు చేరిన వరద, పునరావాస కేంద్రం ఏర్పాటు.
డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పైకి చేరిన వరద.
సిరికొండ మండలం కొండూర్ దగ్గర తెగిన హైలెవెల్ వంతెన.
-
Aug 28, 2025 14:37 IST
కామారెడ్డి: జలదిగ్బంధంలో పిట్ల మండలం కుర్తి గ్రామం
నిజాంసాగర్, కౌలాస్‌నాలా జలాశయం గేట్లు ఎత్తివేత.
కప్పలవాగు, మధ్యవాగు ఉధృతితో నీటమునిగిన పంటపొలాలు.
ఇందల్వాయి మండలం రామ్‌సాగర్ తండాలో తెగిన చెరువు.
ధర్పల్లి మండలంలో ముత్యాలమ్మ వాగుకు గండి.
సిర్నపల్లి దగ్గర బుగ్గల వాగు ఉధృతి, నిలిచిన రాకపోకలు.
-
Aug 28, 2025 13:59 IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన..
మెదక్ జిల్లా రామాయంపేట ఏరియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.
గత 30, 40 సంవత్సరాల ఇలాంటి భారీ వర్షం ఎప్పుడు పడలేదు: దామోదర రాజనర్సింహ.
మెదక్ జిల్లాలోని 13 మండలాల్లో సుమారు 110 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇంకా పడుతూనే ఉంది.
అధికారులను అప్రమత్తం చేశాం.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం.
చెరువులు ఉప్పొంగుతున్నా, రహదారులు దెబ్బతిన్నపటికీ ప్రాణ నష్టం వాటిళ్ల కూడదనేదే ప్రభుత్వ లక్ష్యం.
ప్రకృతి వైపరిత్యాలు అనేది సహజం.. ఈ సమయంలో రాజకీయం చేయడం సరికాదు.
లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి.
అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండేలాగా ఆదేశాలు జరిచేసాం.
-
Aug 28, 2025 13:49 IST
తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన.
ఉమ్మడి కరీంనగర్, మెదక్‌తో పాటు వికారాబాద్ జిల్లాకు భారీ వర్ష సూచన.
తెలంగాణలో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన.
భద్రాద్రి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం.