-
-
Home » Mukhyaamshalu » ap Telangana national to international news live updates here vreddy
-
BREAKING: గోమాత మత విశ్వాసం కానేకాదు: కేంద్రమంత్రి బండి సంజయ్
ABN , First Publish Date - Oct 26 , 2025 | 06:36 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 26, 2025 17:07 IST
గోమాత మత విశ్వాసం కానేకాదు: కేంద్రమంత్రి బండి సంజయ్
గోసంతతితోనే పర్యావరణ, ప్రకృతికి రక్ష: బండి సంజయ్
ప్రపంచమంతా “కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్"పై దృష్టి: బండి సంజయ్
గోమాత సేవలను పాఠ్యాంశాల్లో చేర్చాలి: బండి సంజయ్
గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్టే: బండి సంజయ్
ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్‌ను కాపాడినట్లే: బండి సంజయ్
గోమాతను కాపాడడం-మన అందరి పవిత్ర బాధ్యత: బండి సంజయ్
-
Oct 26, 2025 13:25 IST
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు: హోం మంత్రి అనిత
తుఫాన్‌పై అన్ని శాఖలను అప్రమత్తం చేశాం: హోం మంత్రి అనిత
ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం: హోం మంత్రి అనిత
సహాయక చర్యల కోసం 13 SDRF, 6 NDRF టీంలు: హోం మంత్రి అనిత
భారీ హోర్డింగ్‌లు తొలగించాలని ఆధికారులకు ఆదేశం: హోం మంత్రి అనిత
సముద్ర తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు: హోం మంత్రి అనిత
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు: హోం మంత్రి అనిత
-
Oct 26, 2025 13:24 IST
'మొంథా' తుఫాన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
‘మొంథా’ తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలి: చంద్రబాబు
విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశం
తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి: సీఎం చంద్రబాబు
రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలి
సముద్రంలో పడవలను వెనక్కి రప్పించండి: సీఎం చంద్రబాబు
-
Oct 26, 2025 12:26 IST
మలేషియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన
ఏషియన్ సదస్సుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్
ఏషియన్ సదస్సుకు వర్చుల్‌గా హాజరుకానున్న మోదీ
-
Oct 26, 2025 12:23 IST
కర్నూలు: బస్సు ప్రమాదంలో 19వ వ్యక్తి గుర్తింపు
మృతుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం యనగానిపల్లెకు చెందిన త్రిమూర్తి (52)
కర్నూలులో త్రిమూర్తి బంధువుల రక్తనమూనాలు సేకరించిన వైద్యులు
రక్త నమూనాలను మంగళగిరి ల్యాబ్‌కు పంపిన అధికారులు
-
Oct 26, 2025 12:23 IST
పదేళ్ల BRS ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాలు చూసి ఓటేయండి: కేటీఆర్
రెండేళ్లుగా అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
తెలంగాణలో లోపాయికారిగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి: కేటీఆర్
బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్.. బీజేపీ బీ టీం అంటోంది: కేటీఆర్
బీజేపీతో కలిసిపనిచేస్తున్న రేవంత్‌రెడ్డి గురించి రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి
మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం సీఎంతో పాటు మంత్రులకు లేదు: కేటీఆర్
-
Oct 26, 2025 12:23 IST
'మొంథా' తుఫాన్‌పై హోం మంత్రి అనిత సమీక్ష
స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఎండీ ప్రఖర్ జైన్, అధికారులతో సమీక్ష
తుఫాన్ పరిస్థితులను హోంమంత్రి అనితకు వివరించిన అధికారులు
శాఖా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి అనిత ఆదేశాలు
-
Oct 26, 2025 11:29 IST
కర్నూలు: బస్సు ప్రమాదంలో మృతదేహాల కోసం బంధువులు ఎదురుచూపులు
DNA రిపోర్టులు రాగానే మృతదేహాలను అప్పగిస్తామంటున్న అధికారులు
మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేసిన అధికారులు
చనిపోయిన 19 మందిలో 18 మృతదేహాలు గుర్తింపు
మరొకరిని గుర్తించే పనిలో పోలీసులు
-
Oct 26, 2025 11:29 IST
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ మందిర్‌మార్గ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 314 పాయింట్లుగా నమోదు
లోధి రోడ్డులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 289 పాయింట్లుగా నమోదు
-
Oct 26, 2025 11:29 IST
‘మొంథా’ తుఫాన్‌తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి ఆదేశం
సీఎస్ విజయానంద్‌తో కలిసి అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష
సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని ఆదేశం
ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి: మంత్రి గొట్టిపాటి
అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా యంత్రాంగం పనిచేయాలి: గొట్టిపాటి
ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి ఆదేశం
-
Oct 26, 2025 11:28 IST
చిత్తూరు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టు
తండ్రీకుమారుడు ఏ15-బాలాజీ, ఏ20-సుదర్శన్ అరెస్టు
బెంగళూరులో అరెస్టు చేసిన నిందితులను..
తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచిన ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు
నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
మదనపల్లి సబ్‍జైలుకు నిందితులు బాలాజీ, సుదర్శన్ తరలింపు
ఏ1 జనార్దన్‌రావుకు బాలాజీ, సుదర్శన్ ఇద్దరూ స్పిరిట్ సప్లై చేసినట్లు గుర్తింపు
నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మంది అరెస్టు
-
Oct 26, 2025 11:28 IST
కృష్ణాజిల్లాకు పొంచి ఉన్న 'మొంథా' తుఫాన్ ముప్పు
వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలో హైఅలర్ట్
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యాసంస్థలకు శెలవు
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ డీకే బాలాజీ
అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఇప్పటికే మంగినపూడి, హంసలదీవి బీచ్‌లు మూసివేత
బీచ్‌లోకి పర్యాటకులు వెళ్లకుండా బీచ్ దగ్గర చెక్‌పోస్టులు
-
Oct 26, 2025 11:02 IST
హైదరాబాద్: చాదర్‌ఘాట్ కాల్పుల కేసు కీలక అంశాలు
బషీరాబాగ్‌లో నిన్న డీసీపీల సమావేశానికి హాజరైన చైతన్య
అనంతరం సైదాబాద్‌లో తన కార్యాలయానికి బయల్దేరిన డీసీపీ
మొబైల్ ఫోన్ చోరీ చేస్తున్న విషయాన్ని గమనించిన డీసీపీ డ్రైవర్
స్నాచింగ్ చేసి ఆటోలో పరారీ అవుతున్న నిందితులు
స్నాచింగ్ విషయాన్ని డీసీపీకి చెప్పిన డ్రైవర్
డీసీపీ ఆదేశంతో ఆటోను వెంబడించిన డీసీపీ డ్రైవర్
పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించిన నిందితులు
ఆటో నుంచి దూకి పరారైన మహమ్మద్ ఒమర్ అన్సారీ
అన్సారీని వెంబడించిన డీసీపీ గన్‌మెన్, డీసీపీ
ఒమర్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన గన్‌మెన్ మూర్తి
గన్‌మెన్ మూర్తిని తోసేసి పరారైన నిందితుడు
అదే సమయంలో కిందపడ్డ గన్‌మెన్ మూర్తి
పట్టు విడవకుండా ఓమర్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన గన్‌మెన్
తన వద్ద ఉన్న కత్తితో గన్‌మెన్‌పై దాడికి యత్నం చేసిన ఉమర్
వెంటనే అప్రమత్తమై ఫైర్ ఓపెన్ చేసిన డీసీపీ
మేజర్ ఇంజురీస్ కాకుండా కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య
కాల్పుల తర్వాత కూడా గన్‌మెన్‌పై దాడికి యత్నం
-
Oct 26, 2025 10:56 IST
కర్నూలు బస్సు ప్రమాదంపై మరో ట్విస్ట్
ఉలిందకొండ పీఎస్‌లో మరో కేసు నమోదు
ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివ శంకర్‌పై కేసు నమోదు
281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు
నేను, శివశంకర్ మద్యం సేవించాం: ఎర్రిస్వామి
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో..
బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది, శివశంకర్ స్పాట్‌లో మృతి
నేను గాయపడి ప్రాణాలతో బయటపడ్డా: ఎర్రిస్వామి
-
Oct 26, 2025 10:24 IST
రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
AICC అగ్రనేతలను కలవనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Oct 26, 2025 10:24 IST
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్
ఒకే ఆక్సిజన్ సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులను..
ఎక్స్‌రే వార్డుకు తరలించిన ఘటనపై మంత్రి ఆగ్రహం
ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
MGM సూపరింటెండెంట్ డా.కిషోర్‌పై చర్యలకు ఆదేశాలు
ఏంజీఎంలో పరిస్థితులపై మంత్రి దామోదర ఆరా
ప్రతివారం ఎంజీఎంపై సమీక్ష నిర్వహించి..
సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఎంఈకి ఆదేశాలు జారీ
ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: మంత్రి దామోదర
-
Oct 26, 2025 10:23 IST
హైదరాబాద్: చాదర్‌ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు
మరోసారి విక్టోరియా గ్రౌండ్స్‌కు క్లూస్ టీమ్స్
అన్సారితో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు
నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై కాల్పులు
ఘటనలో గాయపడ్డ DCP, గన్‌మెన్‌కు ఆస్పత్రిలో చికిత్స
రౌడీషీటర్ అన్సారి ఆరోగ్య పరిస్థితి విషమం
-
Oct 26, 2025 09:35 IST
కర్నూలు బస్సు ప్రమాదం కేసు నమోదు
ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చిన పోలీసులు
ఏ1గా బస్సు డ్రైవర్, ఏ2గా ట్రావెల్స్ యజమాని
రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదు
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్
డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద కేసు
BNS 125(a), 106(1) సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు
-
Oct 26, 2025 08:50 IST
ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
కోస్తా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం
27,28,29 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు..
తిరుపతిలో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
Oct 26, 2025 08:15 IST
మొంథా తుఫాన్‌తో కాకినాడలో అధికారుల అప్రమత్తం
కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత
కాకినాడ పోర్టులో రేపటి నుంచి కార్గో ఎగుమతి, దిగుమతులు నిలిపివేత
బెర్తులపై లంగరు వేసిన 25 నౌకలను రేపు సముద్రంలోకి తరలింపు
-
Oct 26, 2025 08:08 IST
మొంథా తుపాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మచిలీపట్నం మంగినపూడి సముద్రం
ఎగసిపడుతున్న అలలు.. ముందుకు వచ్చిన సముద్రం
బీచ్‌లో వ్యాపార దుకాణాలను ముంచెత్తిన సముద్రపు నీరు
బీచ్‌లోకి ఎవరు వెళ్లకుండా పోలీసుల బందోబస్తు
కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలకు అనుమతించని పోలీసులు
-
Oct 26, 2025 08:08 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో వాయుగుండం
తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం
మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
-
Oct 26, 2025 08:07 IST
ఆస్ట్రేలియాలో ముగిసిన మంత్రి నారా లోకేష్ పర్యటన
పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న లోకేష్
7 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన మంత్రి లోకేష్
పెట్టుబడులు, విద్యా సంస్కరణలపై..
ఆస్ట్రేలియాలో పలు సమావేశాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
నవంబర్ 14,15న విశాఖలో జరిగిగే CII సమ్మిట్‌కు..
పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించిన మంత్రి లోకేష్
-
Oct 26, 2025 08:07 IST
అమరావతిలో ఈ-3 రోడ్డు విస్తరణ మూడోదశకు టెండర్లు
టెండర్లు పిలిచిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఉండవల్లి నుంచి NH-16 వరకు ఎలివేటెడ్ కారిడార్
రూ.511.84 కోట్లుగా అంచనా వేసిన కమిటీ
-
Oct 26, 2025 08:07 IST
నవంబర్ 2న జీశాట్-7 ఆర్ ప్రయోగం
శ్రీహరికోట నుంచి ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు
ఇప్పటికే అనుసంధాన ప్రక్రియ పూర్తయిందన్న అధికారులు
LVM3-M5 రాకెట్ ద్వారా జీశాట్-7 ఆర్ ప్రయోగం
-
Oct 26, 2025 08:06 IST
రేపు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణస్వీకారం
ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ మానవేంద్రనాథ్
ఉ.10:35 గంటలకు మొదటి కోర్టు హాలులో ప్రమాణం
-
Oct 26, 2025 07:54 IST
గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలలకు సెలవులు
27, 28, 29న సెలవులు: కలెక్టర్ తమీమ్ అన్సారియా
జనాలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు: కలెక్టర్
-
Oct 26, 2025 07:54 IST
తుఫాన్ కారణంగా బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
5 రోజుల తుఫాన్ ప్రభావం ఉంటుంది: కలెక్టర్ వినోద్
అధికారులంతా అందుబాటులో ఉండాలి: కలెక్టర్
-
Oct 26, 2025 06:38 IST
తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా ఏపీలో సహాయకచర్యలు
మొంథా తుఫాన్ కారణంగా సహాయక చర్యలకుగాను...
11 జిల్లాలకు రూ.14 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఆయా జిల్లాల్లో నిధులు డ్రా చేసేందుకు కలెక్టర్లు అనుమతి
సహాయక శిబిరాలు, వైద్య సదుపాయాలు,..
ఆహారం, మంచినీటి సరఫరా వసతుల ఏర్పాటుకు నిధులు
-
Oct 26, 2025 06:38 IST
రాజమండ్రి: మొంథా తుపాను దృష్ట్యా ప్రభుత్వం చర్యలు
ఈనెల రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
రేపు జరిగే PGRSను రద్దు చేసిన కలెక్టర్ కీర్తి
కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-
Oct 26, 2025 06:37 IST
తుఫాన్ నేపథ్యంలో తిరుపతిలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
తిరుపతి: బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 0877-2256776, 9000822909
-
Oct 26, 2025 06:37 IST
హైదరాబాద్‌లో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,27,140
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,17,730
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,56,700
-
Oct 26, 2025 06:36 IST
మొంథా తుఫాన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన
కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి: చంద్రబాబు
అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి: సీఎం
ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి అధికారులను నియమించాలి: సీఎం
సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి: సీఎం