-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today latest news across world 19th october 2025 vreddy
-
BREAKING: పెర్త్ వన్డే: భారత్‌పై ఆస్ట్రేలియా విజయం
ABN , First Publish Date - Oct 19 , 2025 | 06:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 19, 2025 20:15 IST
2019-24 మధ్య ఏపీని ఓ రాక్షసుడు పట్టిపీడించారు: సీఎం చంద్రబాబు
ఆ రాక్షసుడిని ప్రజలు దారుణంగా ఓడించారు: సీఎం చంద్రబాబు
డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడినపెట్టాం
మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి జరిగితే నాశనమవుతాం: సీఎం చంద్రబాబు
డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి
అమరావతి పనులు మళ్లీ గాడిన పడ్డాయి: సీఎం చంద్రబాబు
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తున్నాం: చంద్రబాబు
సూపర్ సిక్స్ హామీలు అమలు చేసుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
సమయానికే వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం: సీఎం
15 నెలల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాం: సీఎం చంద్రబాబు
మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
భవిష్యత్‌లో ఏపీ.. AIగా మారుతుంది: సీఎం చంద్రబాబు
-
Oct 19, 2025 19:22 IST
చెన్నై: పట్టాభిరామ్ ప్రాంతంలో బాణసంచా పేలుడు
ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి నలుగురు మృతి
పేలుడు ధాటికి పూర్తిగా నేలమట్టమైన ఇల్లు
-
Oct 19, 2025 19:22 IST
నెల్లూరు: దారకానిపాడులో లక్ష్మీనాయుడు కుటుంబానికి..
హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పరామర్శ
బాధిత కుటుంబానికి ఫోన్‌లో సీఎం చంద్రబాబు పరామర్శ
ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా ఉంటామని చంద్రబాబు హమీ
-
Oct 19, 2025 19:22 IST
విజయవాడ బీసెంట్ రోడ్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
చిరు, వీధి వ్యాపారులతో సీఎం చంద్రబాబు మాటామంతీ
జీఎస్‌టీ సంస్కరణల తర్వాత కలిగే ప్రయోజనాలపై ఆరా
జీఎస్‌టీ తగ్గింపుతో తగ్గిన ధరలకే..
వస్తువులు విక్రయిస్తున్నారా అని అడిగిన సీఎం చంద్రబాబు
పన్ను తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు..
విక్రయాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్న సీఎం
వ్యాపారుల జీవన ప్రమాణాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
-
Oct 19, 2025 19:22 IST
విశాఖ-బెంగళూరుకు వాల్తేర్ డివిజన్ 'వన్ వే స్పెషల్ ట్రైన్'
దీపావళి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు
ఎల్లుండి ఉ.8.20 గంటలకు విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు
-
Oct 19, 2025 19:22 IST
పారిశ్రామికవేత్తలకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు
పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాల విడుదలకు నిర్ణయం
తొలి విడతలో రూ.1,500కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశం
ఆర్థిక ఇబ్బందులున్నా రాయితీలు చెల్లిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో రాయితీలు చెల్లింపు
ప్రభుత్వ నిర్ణయంతో చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఊరట
-
Oct 19, 2025 19:22 IST
నెల్లూరు: పెన్నా నది దిగువ ప్రాంతాలకు హై అలర్ట్
సోమశిల ప్రాజెక్ట్ నుంచి 24గంటల్లో 4లక్షల క్యూసెక్కుల వరద
పెన్నా ఎగువ ప్రాంతం నుంచి సోమశిల ప్రాజెక్ట్‌కు భారీగా వరద
రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసిన ఆత్మకూరు ఆర్డీవో పావని
ఆత్మకూరు డివిజన్, తహసీల్దార్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
గ్రామస్థాయి అధికారులంతా 24గంటల పాటు అందుబాటులో ఉండాలన్న ఆర్డీవో
-
Oct 19, 2025 16:54 IST
కానిస్టేబుల్ హత్యకేసుపై నిజామబాద్ సీపీ ప్రకటన
నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదు: సీపీ
రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు: నిజామాబాద్ సీపీ: సీపీ
నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నాం: సీపీ
ఒక వ్యక్తితో ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయి: సీపీ
రియాజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం: సీపీ
-
Oct 19, 2025 16:54 IST
కరీంనగర్: హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్
హరీష్‌రావు అహంకారంతో మాట్లాడుతున్నారు: మంత్రి లక్ష్మణ్
బీసీ, దళిత బిడ్డలున్న కేబినెట్‌ను దండుపాళ్యం అంటారా?
కవిత ఆరోపణలపై ముందు స్పందించండి: మంత్రి అడ్లూరి
-
Oct 19, 2025 16:52 IST
పెర్త్ వన్డే: భారత్‌పై ఆస్ట్రేలియా విజయం
భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
స్కోర్లు: భారత్ 136/9, ఆస్ట్రేలియా 131/3
DLS పద్ధతిలో విజయం సాధించిన ఆస్ట్రేలియా
వర్షం కారణంగా మ్యాచ్ 26 ఓవర్లకే కుదింపు
3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా
-
Oct 19, 2025 15:52 IST
నిజామాబాద్: ఎన్‌కౌంటర్‌లో రియాజ్ హతం
సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్
రెండు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు రియాజ్
-
Oct 19, 2025 15:15 IST
మావోయిస్టుల లొంగుబాటుపై స్పందించిన మావోయిస్టు కేంద్ర కమిటీ
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరు లేఖ
శత్రువుకు లొంగిపోయినవారు.. విప్లవ ప్రతిఘాతకులు: అభయ్
మల్లోజుల, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం: అభయ్
లొంగిపోయినవారు సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారు: అభయ్
50 ఆయుధాలు శత్రువులకు అప్పగించడం.. విప్లవాన్ని హత్యచేయడమే
లొంగుబాట్లు విప్లవ ఉద్యమాన్ని ఆపలేవు: మావోయిస్టు కేంద్ర కమిటీ
-
Oct 19, 2025 15:06 IST
హైదరాబాద్: శిక్షణ పొందిన సర్వేయర్లకు నియామక పత్రాలు పంపిణీ
BRS తెచ్చిన ధరణి చట్టం.. కొందరికి చుట్టంగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి
ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆధిపత్యం చెలాయించాలని చూశారు
గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమే: సీఎం రేవంత్‌రెడ్డి
అధికారంలోకి రాగానే ధరణి భూతాన్ని వదిలించాం: సీఎం రేవంత్
భూ సమస్యలు పరిష్కరించాలనే లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకొచ్చాం
గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. ఇచ్చినా పరీక్షలు పెట్టలేదు
ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: రేవంత్
గత ప్రభుత్వ హయాంలో TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది: రేవంత్
అధికారంలో రాగానే TGPSCని ప్రక్షాళన చేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ: రేవంత్
మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి ఆపాలని చూశారు: రేవంత్
కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం: సీఎం రేవంత్
-
Oct 19, 2025 15:06 IST
మావోయిస్టుల లొంగుబాటుపై స్పందించిన మావోయిస్టు కేంద్ర కమిటీ
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరు లేఖ
శత్రువుకు లొంగిపోయినవారు.. విప్లవ ప్రతిఘాతకులు: అభయ్
మల్లోజుల, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం: అభయ్
లొంగిపోయినవారు సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారు: అభయ్
50 ఆయుధాలు శత్రువులకు అప్పగించడం.. విప్లవాన్ని హత్యచేయడమే
లొంగుబాట్లు విప్లవ ఉద్యమాన్ని ఆపలేవు: మావోయిస్టు కేంద్ర కమిటీ
-
Oct 19, 2025 12:49 IST
హైదరాబాద్: బీసీ బంద్‌లో దాడులపై కేసులు నమోదు
నల్లకుంట, కాచిగూడ పీఎస్‌లలో కేసులు, 8 మంది అరెస్ట్
బీసీ జేఏసీ నేతల అరెస్టులను ఖండించిన ఆర్.కృష్ణయ్య
-
Oct 19, 2025 12:49 IST
అమరావతి: సీఐఐ భాగస్వామ్య సదస్సుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
హాజరైన మంత్రి టీజీ భరత్, పరిశ్రమలశాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై చర్చ
దావోస్ తరహాలోనే పెట్టుబడుల సదస్సును సదస్సు నిర్వహించాలి: చంద్రబాబు
సదస్సుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, పాలసీ మేకర్లను ఆహ్వానించాలి: చంద్రబాబు
పెట్టుబడల కోసమే కాకుండా నాలెడ్జి షేరింగ్, లాజిస్టిక్స్,..
టెక్నాలజీ వంటి రంగాల్లో విధానాలపై చర్చించే అవకాశం ఉంటుంది: చంద్రబాబు
-
Oct 19, 2025 12:09 IST
గాజా శాంతి ఒప్పందం నేపథ్యంలో వెలుగులోకి కీలక విషయం
గాజా పౌరులపై దాడులకు హమాస్ ప్లాన్ చేసినట్టు అమెరికా హెచ్చరిక
తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది: అమెరికా విదేశాంగ శాఖ
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు: అమెరికా
గాజా ప్రజలను రక్షించడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధం: అమెరికా
-
Oct 19, 2025 12:09 IST
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 2 గంటల సమయం
క్యూకాంప్లెక్స్‌లో వేచివున్న భక్తులు
రద్దీగా మారిన ఆలయ పరిసరాలు
-
Oct 19, 2025 11:41 IST
గాజాపై దాడులకు హమాస్ ప్లాన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని గాజా ఉల్లంఘిస్తోందన్న అమెరికా
-
Oct 19, 2025 11:16 IST
పెర్త్ వన్డే: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం
11.5 ఓవర్ల తర్వాత వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్
వర్షం అంతరాయం సమయానికి భారత్ స్కోర్ 37/3
శుభ్‌మన్ గిల్(10), రోహిత్ శర్మ(8), కోహ్లి డకౌట్
-
Oct 19, 2025 10:47 IST
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, ఇతర దర్శన టికెట్లు విడుదల
జనవరి నెల దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు విడుదల
-
Oct 19, 2025 10:02 IST
అల్లూరి: కేకేలైన్‌లో పట్టాలపై పడిన కొండచరియలు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
తైడా-చిమిడిపల్లి రైల్వేస్టేసన్ దగ్గర ఘటన
-
Oct 19, 2025 10:02 IST
పెర్త్ వన్డే: తొలి వికెట్ కోల్పోయిన భారత్
రోహిత్ శర్మ (8) ఔట్
జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటైన రోహిత్
పెర్త్ వన్డే: రెండో వికెట్ కోల్పోయిన భారత్
కోహ్లి డకౌట్, శుభ్‌మన్ గిల్(10), రోహిత్ శర్మ (8)
-
Oct 19, 2025 10:01 IST
మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర బుల్లెట్ కలకలం
బాలుడి దగ్గర తుపాకీ బుల్లెట్ గుర్తించిన పోలీసులు
-
Oct 19, 2025 10:01 IST
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
పలు ప్రాంతాల్లో పూర్ కేటగిరిలో ఏక్యూఐ
ఐటీవో దగ్గర ఏక్యూఐ 284గా నమోదు
కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు
నీటి తుంపర ద్వారా కాలుష్యం తగ్గించే యత్నం
-
Oct 19, 2025 08:22 IST
నంద్యాల: ఈనెల 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
దర్శనాలు, ఆర్జిత సేవల్లో మార్పులు: ఈవో శ్రీనివాసరావు
-
Oct 19, 2025 08:18 IST
మహారాష్ట్ర: నందుర్బార్ జిల్లా చందసైలీ ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
లోయలో పడిన మినీ ట్రక్కు, 8 మంది మృతి
15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
40 మంది ప్రయాణికులతో తీర్థయాత్ర నుంచి వస్తుండగా ప్రమాదం
-
Oct 19, 2025 07:49 IST
తెలంగాణలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
కామారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఏసీబీ సోదాలు
చెక్‌పోస్టుల్లో రికార్డుల్లో లేని నగదును గుర్తించిన అధికారులు
వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసులు
-
Oct 19, 2025 07:25 IST
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
బీసెంట్‌రోడ్డులో బాణసంచా వ్యాపారులను కలవనున్న సీఎం
జీఎస్టీ 2.0అమలుపై చర్చించనున్న సీఎం చంద్రబాబు
సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్‌లో దీపావళి వేడుకలు
రా.7 గంటలకు క్రాకర్స్‌షోకు హాజరుకానున్న చంద్రబాబు
-
Oct 19, 2025 07:25 IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
27 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,136 మంది భక్తులు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు
-
Oct 19, 2025 06:44 IST
నేటి నుంచి ఈనెల 24 వరకు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన
స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని ఆస్ట్రేలియా తరఫున లోకేష్‌కు ఆహ్వానం
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆహ్వానం మేరకు వెళ్లిన మంత్రి లోకేష్
విశాఖ CII భాగస్వామ్య సదస్సు కోసం రోడ్‌షోలలో పాల్గొననున్న లోకేష్
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి ఆహ్వానించనున్న లోకేష్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొననున్న లోకేష్
-
Oct 19, 2025 06:44 IST
మహారాష్ట్ర: నందుర్బార్ జిల్లా చంజసైలీ ఘాట్ దగ్గర దగ్గర ప్రమాదం
లోయలో పడిన మినీట్రక్, 8 మంది మృతి, 15 మందికి తీవ్రగాయాలు
ప్రమాద సమయంలో ట్రక్కులో 40 మంది ప్రయాణికులు
-
Oct 19, 2025 06:44 IST
సంగారెడ్డి: చిరాగ్‌పల్లి మం. మాడ్గిలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు
మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు
తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.43,300 నగదు స్వాధీనం
వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్లన్న సమాచారంతో ఏసీబీ సోదాలు
-
Oct 19, 2025 06:44 IST
హైదరాబాద్‌లో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,230
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,79,600
ధనత్రయోదశి సందర్భంగా బంగారం రికార్డ్ విక్రయాలు
నిన్న రూ.లక్ష కోట్ల బంగారం అమ్మకాలు జరిగాయని అంచనా
-
Oct 19, 2025 06:42 IST
నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే
పెర్త్: ఉదయం 9 గంటలకు నుంచి మ్యాచ్
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియా
సుధీర్ఘ విరామం తర్వాత బరిలోకి రోహిత్ శర్మ, కోహ్లీ
-
Oct 19, 2025 06:42 IST
నేడు మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, ఇంగ్లాండ్ పోరు
ఇండోర్: మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్
-
Oct 19, 2025 06:42 IST
అమెరికా: ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు,
నో కింగ్స్ పేరుతో అమెరికా వ్యాప్తంగా ప్రజల నిరసనలు,
50 రాష్ట్రాల్లో 2,500లకుపైగా ప్రదేశాల్లో నిరనసలు,
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నిరసనకారుల ప్రదర్శనలు
-
Oct 19, 2025 06:26 IST
తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు
ఈనెల 23 వరకు గడువు పెంచిన ఎక్సైజ్ శాఖ
27న మద్యం షాపులకు డ్రా తీయనున్న అధికారులు
ఈనెల 27 వరకు గడువు పెంచిన ఎక్సైజ్ శాఖ
-
Oct 19, 2025 06:26 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రెండురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన