-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across the WORLD 7Th oct 2025 vreddy
-
BREAKING: బాలుడి మరణంపై స్పందించిన ప్రభుత్వం
ABN , First Publish Date - Oct 07 , 2025 | 06:18 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 07, 2025 22:01 IST
బాలుడి మరణంపై స్పందించిన ప్రభుత్వం
అనంతపురంలో బాలుడి మరణంపై స్పందించిన ప్రభుత్వం
నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. జిల్లా మహిళ శిశు సంక్షేమ సాధికారిక అధికారిణిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం
అనంతపురంలో ఆశ్రయం పొందుతున్న రెండు నెలల బాలుడు నిరూప్ మృతికి సంబంధించిన నివేదికను పైఅధికారులకు సమర్పించడంలో జాప్యం చేసినట్లు నిర్ధారణ
కలెక్టర్ నివేదిక ఆధారంగా బాధ్యులైన శిశు గృహ, అనంతపురం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం
-
Oct 07, 2025 21:26 IST
మోహన్ బాబు యూనివర్సిటీ జరిమానా
మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజ్‌ల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణ
దీనిపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్
విచారణ జరిపి నిజమేనని నిర్ధారించిన కమిషన్
రూ.15 లక్షల జరిమానా విధించిన కమిషన్
విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు
ఇప్పటికే 15 లక్షలు జరిమానా చెల్లించిన యూనివర్సిటీ
గుర్తింపు ను రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన కమిషన్
-
Oct 07, 2025 20:45 IST
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట
గ్రూప్1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరణ
గ్రూప్ 1 ర్యాంకర్ల నియాకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన బాధితులు
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరణ
హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
-
Oct 07, 2025 19:47 IST
క్వారీలో పిడుగు పాటు.. ముగ్గురు మృతి..
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జంగలపాడు రాజయోగి క్వారీలో పిడుగు పాటు ముగ్గురు మృతి..
నలుగురుకి తీవ్ర అస్వస్థత.
అస్వస్థతకు గురైన నలుగురికి టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స.
అస్వస్థతకు గురైన వారిలో బైపోతు హరిప్రసాద్ పరిస్థితి విషమం.
చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం.
-
Oct 07, 2025 19:05 IST
ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో.. హుండీ ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయి హుండీ ఆదాయం
దసరా నవరాత్రుల 11 రోజుల హుండీ లెక్కింపు
2025 దసరా హుండీ ఆదాయం 10.30 కోట్లు దాటింది
గత సంవత్సరం కంటే ఈసారి హుండీ ఆదాయం రూ.కోటి ఎక్కువ
2024 దసరా హుండీ నగదు 9.32 కోట్లు కాగా, 2025లో 10.30 కోట్లు
రెండు రోజుల పాటు హుండీ లెక్కింపు నిర్వహణ
మొత్తం 106 సంచులు, 480 హుండీలు తెరచి లెక్కింపు
మొదటి రోజు హుండీ ఆదాయం 3.57 కోట్లు, రెండవ రోజు 6.73 కోట్లు
మొత్తం బంగారం 387 గ్రాములు, వెండి 19 కేజీలు 450 గ్రాములు
పలు దేశాల విదేశీ కరెన్సీ.. భక్తుల విరాళాలతో అమ్మవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది
-
Oct 07, 2025 17:47 IST
భారీగా గంజాయి పట్టివేత..
లింగంపల్లిలో భారీగా గంజాయి పట్టివేత.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 45 కేజీల గంజాయి పట్టుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు..
ట్రైన్‌లో విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠా..
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు..
రూ.24లక్షల విలువ చేసే 45 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం..
నిందితులు పంగి వెంకట్‌తో పాటు దివ్య రాణి,బుల్కి అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు..
నిందితుల పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు..
-
Oct 07, 2025 17:12 IST
మంత్రి దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం
పొన్నం ప్రభాకర్‌ను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్
పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
మంత్రి అడ్లూరికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత మంత్రిని కించపరిచిన పొన్నం ప్రభాకర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిముట్టడి చేస్తామని హెచ్చరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
-
Oct 07, 2025 16:18 IST
జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్
రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గ్రేటర్ కార్పోరేటర్లతో వేర్వేరుగా కేటీఆర్ సమావేశం
ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
ఇప్పటికే హరీష్ రావు, తలసాని సహా.. సీనియర్ నేతలతో జూబ్లీహిల్స్ ఎన్నికపై కేటీఆర్ సమాలోచనలు
-
Oct 07, 2025 13:48 IST
శబరిమల బంగారం వివాదంపై ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
కొన్నేళ్లుగా సిస్టమాటిక్‌గా ఇదంతా జరిగింది: శశిథరూర్
కిలోల కొద్దీ బంగారం చోరీ అయ్యిందని శశిథరూర్ ఆరోపణలు
గోల్డ్ చోరీలో అనుమానించాల్సింది చాలా వుందన్న శశిథరూర్
జరిగిన దాని గురించి చాలా షాకింగ్ విషయాలు విన్నాము
సిట్ దర్యాప్తు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది: శశిథరూర్
-
Oct 07, 2025 13:46 IST
విజయవాడ: ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు
12 మందిని నిందితులుగా చేర్చిన ఎక్సైజ్ అధికారులు
ఏ1 జనార్దన్‌రావు, ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ3 బాలాజీ..
ఏ4 రవి, ఏ5 సయ్యద్ హాజీ, ఏ6 కట్టా రాజు, ఏ7 దాసు..
ఏ8 ప్రదీప్ దాస్, ఏ9 దాస్, ఏ10 అనంత దాస్
నకిలీ మద్యం కేసులో ఏ11 శ్రీనివాస్, ఏ13 కల్యాణ్
కేసు నమోదు చేసిన భవానీపురం ఎక్సైజ్ పోలీసులు
-
Oct 07, 2025 13:00 IST
ఢిల్లీ: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
మ. 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్
-
Oct 07, 2025 12:59 IST
ఢిల్లీలో భారీగా ఎర్రచందనం పట్టివేత
10 టన్నుల ఎర్రచందనం పట్టుకున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్
తిరుపతి నుంచి అక్రమంగా ఢిల్లీకి తరలింపు, ఇద్దరు అరెస్ట్
-
Oct 07, 2025 12:23 IST
కల్తీ మద్యం తయారుచేసే ముఠాను పట్టుకుంది ప్రభుత్వమే: మంత్రి అనగాని
కల్తీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టే ఉన్నాయి
కల్తీ మద్యం గుట్టు మేము విప్పితే.. జగనే కనిపెట్టినట్లు సంబరాలా?: అనగాని
జగన్ హయాంలో మద్యం స్కామ్‌ను..
తప్పుదారి పట్టించేందుకే కొత్త నాటకాలు: మంత్రి అనగాని
-
Oct 07, 2025 12:22 IST
అమరావతి: జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం.
హాజరైన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు.
పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై తదితర అంశాలపై చర్చ అజెండా.
-
Oct 07, 2025 12:21 IST
ఢిల్లీ: కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టులో పిటిషన్
CBI దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని.. మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
పిటిషన్‌పై విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
అక్టోబర్ 10న కేసు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
-
Oct 07, 2025 12:20 IST
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట
లిక్కర్ కేసులో మోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌కు నిరాకరణ
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహిత్‌రెడ్డి పిటిషన్
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మద్యం కుంభకోణం కేసులో ఏ 39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
-
Oct 07, 2025 12:19 IST
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
-
Oct 07, 2025 12:19 IST
రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తు పై హైకోర్టులో ఎమ్మెల్సీ చింత పండు నవీన్ పిటిషన్...
పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని కోరిన పిటిషనర్ నవీన్
బీసీ రాజ్యాధికార పార్టీని స్థాపించిన ఎమ్మెల్సీ నవీన్..
-
Oct 07, 2025 12:15 IST
మరోసారి పెరిగిన బంగారం ధరలు
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,23,850
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,15,500
కిలో వెండి ధర రూ.1,54,350
-
Oct 07, 2025 11:35 IST
భూమన కరుణాకర్‌రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆగ్రహం
దేవస్థానం అంటే రాజకీయ అడ్డా కాదు: మంత్రి మండిపల్లి
గత పాలనలో టీటీడీని రాజకీయాలతో కలుషితం చేశారు: మంత్రి మండిపల్లి
భూమన వ్యాఖ్యలు అందరినీ అగౌరవపరిచేలా ఉన్నాయి: మంత్రి మండిపల్లి
దేవుడితో చెలగాటాలు ఆడితే, ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు
టీటీడీకి భూమన చేసిన అన్యాయానికి మూల్యం చెల్లించక తప్పదు: మంత్రి మండిపల్లి
-
Oct 07, 2025 11:35 IST
హైదరాబాద్: మంత్రి పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం
మాదిగలు అంటే అంత చిన్న చూపా?: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: అడ్లూరి లక్ష్మణ్
పొరపాటున ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుంది
పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం నాకురాదు
వివేక్ లాగా నా దగ్గర డబ్బులు లేవు: అడ్లూరి లక్ష్మణ్
నేను మంత్రి కావడం, ఆ సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా?
త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తా: అడ్లూరి లక్ష్మణ్
నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారు: అడ్లూరి లక్ష్మణ్
నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు: అడ్లూరి లక్ష్మణ్
-
Oct 07, 2025 10:30 IST
హైదరాబాద్ లో IT అధికారుల సోదాలు
కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు
కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో కొనసాగుతున్న ఐటి సోదాలు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
-
Oct 07, 2025 10:24 IST
కీలక భేటీ
తెలంగాణ తెలుగుదేశం నేతలకు అమరావతి నుంచి పిలుపు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంకానున్న టీటీడీపీ నేతలు
సాయంత్రం 6గంటలకు ఉండవల్లిలో సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీటీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయకున్న చంద్రబాబు
చంద్రబాబుతో సమావేశానికి హాజరుకానున్న బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు
-
Oct 07, 2025 09:46 IST
తిరుపతి: చంద్రగిరి మండలం పినపాకకు మంత్రి లోకేష్
అనారోగ్యంతో మృతి చెందిన డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం..
కుంటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్
-
Oct 07, 2025 09:46 IST
పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
న్యూయార్క్ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్
వాదనలు వినిపించనున్న ఇరు వర్గాల న్యాయవాదులు
-
Oct 07, 2025 08:44 IST
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు
ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనల మీద అధికారుల సీరియస్
కోడ్ అమల్లో ఉండగా ఓటర్ కార్డులను పంపిణీ చేసిన నవీన్ యాదవ్
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం..
మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ..
నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు
-
Oct 07, 2025 08:31 IST
వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్
మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు
మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ.25 లక్షలు తీసుకున్నట్లు డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్
అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం రూ.75 వేలు తిప్పేస్వామికి ఇచ్చినట్లు ఫిర్యాదు చేసిన దోక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు
-
Oct 07, 2025 08:24 IST
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సకల జనులకు శుభాకాంక్షలు: చంద్రబాబు
జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన మహనీయుడు
ప్రపంచానికే జ్ఞాన జ్యోతిని చూపించిన కారుణ్యమూర్తి: చంద్రబాబు
మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది: చంద్రబాబు
-
Oct 07, 2025 08:04 IST
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పై నేడు హైకోర్టులో విచారణ
పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులను ప్రకటించి బెనిఫిట్స్ రద్దు చేయాలని కేఏ పాల్ పిటిషన్..
కేఏ పాల్ పిటిషన్ పై ఈరోజు తుది వాదనలు...
-
Oct 07, 2025 07:53 IST
ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
బహిరంగసభ కోసం నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని రాగమయూరి గ్రీన్‌హిల్స్‌ను ఎంపిక చేసిన అధికారులు,
సభ ఏర్పాట్లపై సమీక్షించిన PMO స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్
-
Oct 07, 2025 07:52 IST
ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి
పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను
కొత్త కేబినెట్‌పై విమర్శల నేపథ్యంలో కొన్ని గంటల్లోనే సెబాస్టియన్ రాజీనామా
-
Oct 07, 2025 06:53 IST
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై నేడు సీఎంతో మహేష్‌గౌడ్ చర్చలు
సీఎం రేవంత్ రెడ్డితో చర్చల తర్వాత జాబితా AICCకి పంపిస్తానున్న మహేష్‌గౌడ్
-
Oct 07, 2025 06:52 IST
హైదరాబాద్: ఈనెలలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జిల్లాల పర్యటన
జిల్లాల పర్యటన షెడ్యూల్ సిద్ధం చేస్తున్న ఉపముఖ్యమంత్రి కార్యాలయం
తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లనున్న పవన్‌కల్యాణ్
అస్వస్థతకు గురైన విద్యార్థుల గురుకుల పాఠసాలను పరిశీలించనున్న పవన్
-
Oct 07, 2025 06:22 IST
మరోసారి టారిఫ్‌లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
మధ్యశ్రేణి, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధింపు
పెంచిన సుంకాలు వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపిన ట్రంప్
-
Oct 07, 2025 06:21 IST
హైదరాబాద్: నేడు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయనున్న బీజేపీ ఎన్నికల కమిటీ
రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించే అవకాశం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో జూటూరు కార్తిరెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి
బిహార్ ఎన్నికల తర్వాతే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
-
Oct 07, 2025 06:18 IST
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలుపై నేడు హైకోర్టులో విచారణ
విచారణకు రానున్న మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్లు