-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across GLOBE 30th sept 2025 vreddy
-
BREAKING: మాజీ ఎమ్మెల్యేకి ఏఎస్‌పీ వార్నింగ్..
ABN , First Publish Date - Sep 30 , 2025 | 06:33 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 30, 2025 20:46 IST
అమరావతి: కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వార్నింగ్
ఇటీవల కైకలూరు సీఐపై పలు ఆరోపణలు చేసిన దూలం నాగేశ్వరరావు.
అవాస్తవ ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని ASP వార్నింగ్.
నిబంధనలు ప్రకారమే పోలీసులు విధులు నిర్వహిస్తారని స్పష్టం చేసిన ASP.
-
Sep 30, 2025 20:21 IST
తమిళనాడులో మరో ఘోర ప్రమాదం..
తమిళనాడు: చెన్నై ఎన్నోర్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం.
నిర్మాణంలోని కట్టడం కూలి 9 మంది కూలీలు మృతి.
బాధితులు ఆసుపత్రికి తరలింపు, కొనసాగుతున్న సహాయక చర్యలు.
-
Sep 30, 2025 16:52 IST
తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఉద్యోగ విరమణ.
డీజీపీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసులు.
పోలీస్ బ్యాండ్లతో, సాంప్రదాయ పద్ధతిలో డీజీపీకి ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసులు.
డీజీపీ జితేంద్రకు గౌరవ వందనం చేసిన పోలీసులు.
ఓపెన్ టాప్ జిప్సీ నుండి గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ జితేందర్.
ఓపెన్ టాప్ జిప్సీలో డీజీపీ జితేందర్ నిల్చుని ఉండగా స్వహస్తాలతో జిప్సీనీ లాగుతూ వీడ్కోలు పలికిన పోలీస్ ఉన్నతాధికారులు.
డీజీపీ జితేందర్ పై పూల వర్షం కురిపించిన పోలీసులు.
అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఘనంగా సాగనంపిన పోలీసులు.
-
Sep 30, 2025 16:39 IST
తమిళనాడులో ఏపీ యువతిపై అత్యాచారం..
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది.
తిరువణ్ణమలైలో ఆంధ్ర యువతిపై పోలీసుల అత్యాచారం.
ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు.
అనుమానం ఉందంటూ యువతిని వాహనం నుంచి దించిన ఇద్దరు పోలీసులు.
పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్.
బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన తిరువణ్ణామలై ఎస్పీ.
-
Sep 30, 2025 13:59 IST
తాను శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ సందడి
ఆసియా కప్ హీరోను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
ఆసియా కప్ గెలుపొందడం సంతోషాన్నిచ్చింది: తిలక్
పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూశారు: తిలక్ వర్మ
నన్ను రెచ్చగొట్టేందుకు పాక్ ఆటగాళ్లు ప్రయత్నించారు
నా కళ్ల ముందు దేశమే కనిపించింది.. అందుకే ఓపికగా ఆడాను
చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా: తిలక్ వర్మ
అందరం కలిసి గెలుపు కోసం కృషి చేశాం: తిలక్ వర్మ
-
Sep 30, 2025 13:08 IST
వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచింది: సీఎం చంద్రబాబు
ట్రూడౌన్ పేరుతో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తోంది
పీక్ లోడ్‌లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్‌ను అనుసరించాం
సోలార్, విండ్ వంటి వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాం
జీఎస్టీ సంస్కరణల లాభాలను ప్రజలకు వివరించాలి
సూపర్ సిక్స్-సూపర్ హిట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-
Sep 30, 2025 12:54 IST
ప్రతి మ్యాచ్‌లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం: తిలక్ వర్మ
అందరం సమష్టిగా కష్టపడ్డాం.
చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశాను.
దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను
-
Sep 30, 2025 12:17 IST
ఢిల్లీ: ఈడీ ఎదుట విచారణకు హాజరైన నటి ఊర్వశి రౌతేలా
1xbet మనీలాండరింగ్‌తో సంబంధాలపై ఈడీ ఆరా
ఊర్వశి రౌతేలా వాంగ్మూలం రికార్డు చేస్తున్న ఈడీ
-
Sep 30, 2025 11:52 IST
అల్లూరి, కోనసీమ జిల్లాలపై గోదావరి వరద ప్రభావం
అల్లూరి, కొనసీమ జిల్లాలో నీట మునిగిన కాజ్‌వేలు, రోడ్లు
అల్లూరి జిల్లాలో 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
నాటు పడవలపై లంక గ్రామాల ప్రజల రాకపోకలు
-
Sep 30, 2025 11:52 IST
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
మ.2గంటలకు కేంద్రమంత్రి నిర్మలతో చంద్రబాబు భేటీ
సా.5:30కు CII కాంక్లేవ్‌లో పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్
రా.8గంటలకు అమిత్‌షాతో సమావేశం కానున్న చంద్రబాబు
-
Sep 30, 2025 11:07 IST
హైదరాబాద్: కుటుంబ నేపథ్యాన్ని తలచుకుని డీజీపీ భావోద్వేగం,
తన తల్లిని తలుచుకుని కంటతడి పెట్టిన డీజీపీ జితేందర్,
తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయా, ఉద్యోగంతో బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చింది,
నాకు సహకరించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు: డీజీపీ జితేందర్
-
Sep 30, 2025 11:01 IST
ఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎన్టీయే సభ్యులతో కమిటీ
హేమమాలిని నేతృత్వంలో 8 మంది ఎంపీలతో NDA కమిటీ
సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రజ్‌లాల్..
శ్రీకాంత్ షిండే, అపరాజితా సారంగి, రేఖా శర్మ, పుట్టా మహేష్ కుమార్
-
Sep 30, 2025 09:50 IST
తమిళనాడు: కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసుల చర్యలు,
TVK పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్ అరెస్ట్,
ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్, 21 మందిపై కేసులు నమోదు,
తొక్కిసలాటపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ గెరాల్డ్ కూడా అరెస్ట్
-
Sep 30, 2025 09:41 IST
మయన్మార్‌లో భూకంపం, తీవ్రత 4.7గా నమోదు
-
Sep 30, 2025 09:23 IST
హైదరాబాద్ : తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ బోర్డు ఏర్పాటు.
ఒక్క రోజులోనే ఫ్లైఓవర్ కు ఇరువైపులా కమాన్ ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి.

-
Sep 30, 2025 08:54 IST
మర్యాదపూర్వక భేటీ
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్న భారత స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ
రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న తిలక్
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై 69రన్స్ చేసి భారత్ ను గెలిపించిన తిలక్ వర్మ
-
Sep 30, 2025 08:46 IST
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న వీసీ సజ్జనార్
సివి ఆనంద్ నుండి బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్..
-
Sep 30, 2025 08:39 IST
నేడు తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ పదవి విరమణ...
డీజీపీ జితేందర్ కు పరేడ్ వీడ్కోలు నిర్వహించనున్న తెలంగాణ పోలీస్ శాఖ
తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ జితేందర్ కు వీడ్కోల్ చెప్పనున్న పోలీస్ శాఖ
తెలంగాణ డీజీపీగా 14 నెలలు సేవలు అందించిన జితేందర్
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్న కాబోయే నూతన డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ ) డైరెక్టర్ అభిలాషా బిష్ట్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు
-
Sep 30, 2025 08:09 IST
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ
ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు కోరుతూ లేఖ రాసిన విజిలెన్స్ డిపార్ట్మెంట్
విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సిఎస్ కు పంపిన ఏసీబీ డీజీ
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం
గతంలో కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్ సి, ఈఈ అధికారులు వద్ద భారీగా అక్రమ డబ్బును గుర్తించిన ఏసీబీ అధికారులు
ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నా విజిలెన్స్ అధికారులు
-
Sep 30, 2025 07:59 IST
కాసేపట్లో లండన్ నుంచి హైదరాబాద్ కు కవిత
బతుకమ్మ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళిన కవిత
నేడు జాగృతి నేతలతో కవిత సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జాగృతి నేతలతో కవిత సమావేశం
-
Sep 30, 2025 07:58 IST
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గావీసీ సజ్జనార్ నియామకం.
నేడు చార్జ్ తీసుకోనున్న వీసీ సజ్జనార్
మరికాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ సివి ఆనంద్ నుండి బాధ్యతలు తీసుకోనున్న సజ్జనార్
-
Sep 30, 2025 07:58 IST
గాజాపై ట్రంప్ శాంతి ఫార్ములాను స్వాగతించిన పాలస్తీనా సహా అరబ్, ముస్లీం దేశాలు, అమెరికా డిమాండ్ మేరకు సంస్కరణలు తీసుకొస్తామన్న పాలస్తీనా ప్రభుత్వం
గాజా పునర్నిర్మాణం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు అనుమతించనని ట్రంప్ ప్రకటన, స్వాగతించిన కతర్, జోర్డాన్, యూఏఈ, ఇండోనేసియా, పాకిస్థాన్, టర్కీ, సౌదీ, ఈజిప్ట్
-
Sep 30, 2025 07:22 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీకానున్న ఉత్తమ్
80 లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేయాలి: ఉత్తమ్
52 లక్షల మె.ట పంట ప్రొక్యూర్‌మెంట్‌కు కేంద్రం అనుమతి: ఉత్తమ్
మిగిలిన ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కూ అనుమతి కోరతా: ఉత్తమ్
ఇప్పటికే గోదాంలు, రైస్‌మిల్లుల్లో ధాన్యం నిండిపోయి ఉంది: ఉత్తమ్
ధాన్యం తరలింపునకు 300 రైళ్లు ఇవ్వాలని కోరతా: మంత్రి ఉత్తమ్
-
Sep 30, 2025 07:21 IST
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
CII కాంక్లేవ్‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కలిసే అవకాశం
అక్టోబర్ 16న కర్నూలులో GST 2.O కార్యక్రమానికి..
ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు
అమిత్ షా, నిర్మలాసీతారామన్‌తో భేటీకానున్న చంద్రబాబు
పలువురు కేంద్రమంత్రులను మంత్రి లోకేష్ కలిసే అవకాశం
-
Sep 30, 2025 07:20 IST
రేపు అరేబియా సముద్రంలో మరో ఆల్పపీడనం
అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం
గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీపై కొనసాగుతున్న ద్రోణి
ఉత్తరకోస్తాపై మరో ఉపరితల ఆవర్తనం
నేడు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు
అక్టోబర్ 1 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తరకోస్తాలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
Sep 30, 2025 06:54 IST
నేడు బిహార్ ఓటర్ల తుదిజాబితా విడుదల
బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ పూర్తి చేసిన ఈసీ
ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం
-
Sep 30, 2025 06:33 IST
నేడు శ్రీలంక నుంచి కాకినాడకు మత్స్యకారులు
52 రోజులుగా శ్రీలంక జైల్లో ఉన్న మత్స్యకారులు
నలుగురిని నేడు కాకినాడ తీసుకురానున్న అధికారులు
-
Sep 30, 2025 06:33 IST
నేడు తెలంగాణ డీజీపీకి వీడ్కోలు సభ
ఉదయం 8 గంటలకు టీడీపీఏలో వీడ్కోలు సభ