-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking news across globe 26th sept 2025 vreddy
-
BREAKING: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి
ABN , First Publish Date - Sep 26 , 2025 | 06:49 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 26, 2025 20:16 IST
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీఓ విడుదల
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
జీఓ 09 విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
రేపు ఉ.11 గంటలకు తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం
CS, DGP, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీకానున్న SEC
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్న SEC
-
Sep 26, 2025 20:02 IST
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి
అక్టోబర్ 1న డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డి
1994 బ్యాచ్ IPS అధికారి శివధర్‌రెడ్డి
ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డి
-
Sep 26, 2025 18:36 IST
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్..
క్రైమ్ బ్రాంచ్ సీఐగా చెప్పుకునే నకిలీ కేటుగాడిని అరెస్ట్ చేసిన వేదాయపాలెం పోలీసులు
సీఐ అని పోలీసు యూనిఫామ్ ధరించి చాలా మందికి టోకరా వేసిన కేటుగాడు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని దోచుకున్న నకిలీ పోలీస్
రూ.51లక్షలు ఆన్ లైన్ లావాదేవీలు, నగదు రూపంలో వసూలు చేసిన కేటుగాడు
ఓ వ్యక్తి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న వేదయపాలెం పోలీసులు
అతనిపై పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు
-
Sep 26, 2025 16:54 IST
ఢిల్లీ: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
చిన్నప్పకు నోటీసులు జారీ చేసిన త్రిసభ్య ధర్మాసనం
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీబీఐ
ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనం
-
Sep 26, 2025 16:53 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అడ్డగోలు దర్శనాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దుర్గగుడి అధికారులు
వీఐపీ సేవల్లో తరిస్తున్న పోలీసులు, యంత్రాంగం
దుర్గమ్మ దర్శనం కోసం సామాన్య భక్తులకు అగచాట్లు
దర్శనాల అంశంలో రెవెన్యూ, పోలీసులపై ఆగ్రహం
ప్రొటోకాల్ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో వీఐపీ దర్శనాలు
క్యూలలో గంటల తరబడి భక్తులు ఎదురుచూపులు
-
Sep 26, 2025 13:51 IST
నల్లగొండ: MLA రాజగోపాల్‌రెడ్డిని కలిసిన RRR భూనిర్వాసితులు
అధికార పార్టీలో ఉన్నా.. ప్రజల పక్షానే మాట్లాడుతా: MLA రాజగోపాల్
పదవి అంటే కిరీటం కాదు.. బాధ్యత
మునుగోడు నియోజకవర్గం RRRలో కలుస్తుంది: MLA రాజగోపాల్
అలైన్‌మెంట్ మార్చడానికి కారణాలను..
రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి: MLA రాజగోపాల్
-
Sep 26, 2025 13:38 IST
విప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు
బీర్ల ఐలయ్య కాంగ్రెస్‌ను నాశనం చేసే కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే సామేల్
మదర్ డెయిరీ ఎన్నికల్లో కొందరు BRSతో పొత్తు పెట్టుకుంటున్నారు
మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకండి: మందుల సామేల్
మదర్ డెయిరీ ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలిస్తే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి
కాంగ్రెస్ ఓడితే నాయకులు, కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు: సామేల్
కాంగ్రెస్‌కు ఐలయ్య రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిది: సామేల్
-
Sep 26, 2025 13:01 IST
ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
8 మంది నిందితులకు అక్టోబర్ 6 వరకు రిమాండ్
-
Sep 26, 2025 12:55 IST
హైదరాబాద్ జంట జలాశయాలకు భారీ వరద
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేత
హిమాయత్‌సాగర్ 4, ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు ఎత్తివేత
మూసీకి భారీగా పెరిగిన వరద ప్రవాహం
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Sep 26, 2025 12:41 IST
అమరావతి: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్
4 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో పవన్
జ్వరం, దగ్గు కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరం
వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్
-
Sep 26, 2025 12:21 IST
జూబ్లీహిల్స్ BRS అభ్యర్థిగా గోపినాథ్ భార్య సునీత పేరు ఖరారు
మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం: కేసీఆర్
-
Sep 26, 2025 12:06 IST
ఢిల్లీ: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం
వైవీ సుబ్బారెడ్డి, చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసిన త్రిసభ్య ధర్మాసనం
-
Sep 26, 2025 11:54 IST
నాలా చట్టం రద్దు బిల్లు కు అసెంబ్లీ ఆమోదం..
-
Sep 26, 2025 11:41 IST
ఏపీ అసెంబ్లీ: అమృత్-1 పథకంపై మంత్రి నారాయణ సమాధానం
అమృత్-1 పథకంలో గోరంట్ల వాటర్ ట్యాంక్ పనులు పూర్తికాలేదు
అందుకే పనులు రద్దు చేశాం: మంత్రి నారాయణ
అమృత్-2 పథకంతో పాటు UIDF కింద నిధులు కేటాయించాం
2027లోపు పనులు పూర్తి చేసి విలీన గ్రామాలకు కూడా తాగునీరు ఇస్తాం
తణుకు, భీమవరం, పాలకొల్లు, నిడదవోలు, ఆకివీడు,..
నర్సాపురం ప్రాంతాలకు అమృత్-2 పథకం కింద నిధులు: మంత్రి నారాయణ
తాగునీటి పథకం మంజూరుపై వచ్చే కేబినెట్‌లో ఆమోదం: మంత్రి నారాయణ
-
Sep 26, 2025 11:35 IST
ఏపీ అసెంబ్లీ: పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలపై మంత్రి లోకేష్ సమాధానం
ఏపీ వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు లేవు
ఇప్పటికే రెండు కాలేజీలకు సొంత భవనాలు నిర్మించి ప్రారంభించాం: లోకేష్
మరో 5 కాలేజీలకు భూములు కేటాయించాం: మంత్రి లోకేష్
మచిలీపట్నం, కేఆర్ పురం, అనపర్తిలోని కాలేజీలకు..
భూముల కేటాయింపు, కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం: లోకేష్
నవోదయ స్కూల్స్ కేంద్రం ఇచ్చేవి.. తాత్కాలిక భవనాలకు కేంద్రం అంగీకరించదు
కోనసీమలో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం: మంత్రి లోకేష్
-
Sep 26, 2025 11:20 IST
ఢిల్లీ: ఫార్ములా-ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేశారు: మహేష్‌గౌడ్
కేటీఆర్ ముద్దాయిగా నిరూపించబడ్డారు.. శిక్ష తప్పదు: మహేష్‌గౌడ్
మూసీ సుందరీకరణను కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు: మహేష్‌గౌడ్
అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
తెలంగాణకు కిషన్‌రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: మహేష్‌గౌడ్
కేంద్రం దగ్గర బీసీ బిల్లు ఎందుకు పెండింగ్‌లో ఉందో చెప్పాలి: మహేష్‌గౌడ్
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నిస్తే బీసీ బిల్లు ఆమోదం పొందుతుంది: మహేష్‌గౌడ్
-
Sep 26, 2025 11:19 IST
ఇవాళ సీఎం చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ
అన్నదాతల ఆక్రందనలపై కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో కలిసి సీఎం చంద్రబాబుకి వినతిపత్రం ఇవ్వనున్న వైఎస్ షర్మిల
-
Sep 26, 2025 11:18 IST
శాసన సభలో ఆమోదం పొందిన 7 చట్టాలను ఆమోదించిన శాసన మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనమల రెండో సవరణ బిల్లు - 2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల నాలుగో సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం
-
Sep 26, 2025 11:12 IST
ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
ముత్తయ్యపై ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు
కేసు నుంచి ముత్తయ్యను విముక్తి చేస్తూ హైకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
-
Sep 26, 2025 11:11 IST
OG సినిమా టికెట్ ధరలపై నేడు మరోసారి విచారణ
సినిమా టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ.. ఈనెల 24న తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్..
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన డివిజన్ బెంచ్
సింగిల్ బెంచ్‌కే వెళ్లాలని సూచించిన డివిజన్ బెంచ్..
టికెట్ రేట్లపై మరోసారి విచారించనున్న తెలంగాణ హైకోర్టు
-
Sep 26, 2025 11:02 IST
హైదరాబాద్ : ట్రాఫిక్ పద్మవ్యూహంలో భాగ్యనగరం.
భారీ వర్షాలతో సిటీలో ఫుల్ ట్రాఫిక్.
వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నిలిచిపోతున్న వర్షపు నీరు.
ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.
మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ మార్గంలో ట్రాఫిక్ జాం.
లకడికపూల్, ట్యాంక్ బండ్ మార్గంలో ఫుల్ ట్రాఫిక్.
నెమ్మదిగా కదులుతున్న వాహనాలు.
-
Sep 26, 2025 11:00 IST
ములుగు: చెరువు తెగిపోయిన ఘనపూర్ పెద్దచెరువు
భయాందోళనలో దిగువ ప్రాంత ప్రజలు
చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
-
Sep 26, 2025 11:00 IST
హైదరాబాద్ : బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా.
భారీ వర్షాలు నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా ప్రకటన.
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభోత్సవానికి హైడ్రా సన్నాహాలు.
-
Sep 26, 2025 10:42 IST
హైదరాబాద్: ఘట్‌కేసర్ దగ్గర ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు
రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సోదాలు
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
తనిఖీల్లో పాల్గొన్న ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్‌కేసర్ పోలీసులు
-
Sep 26, 2025 10:34 IST
శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ
స్కందమాత అవతారంలో భ్రమరాంబికాదేవి దర్శనం
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద, 1120 క్యూసెక్కులు మూసీలోకి విడుదల, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనిస్తున్న శ్రీ లక్ష్మీతాయారమ్మ
భూపాలపల్లిలో భారీ వర్షాలతో ఉపరితల బొగ్గు గనుల్లో నిలిచిన ఉత్పత్తి
వైవీఎస్ చౌదరికి మాతృ వియోగం, తల్లి రత్నకుమారి కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
అమలాపురంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు
-
Sep 26, 2025 10:23 IST
హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా..
వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు పోలీసుల సూచన
వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కంపెనీలను కోరిన సైబరాబాద్ పోలీసులు
-
Sep 26, 2025 10:15 IST
ఏడో రోజు ప్రారంభమైన ఏపి శాసన మండలి సమావేశాలు...
సోషల్ వీడియో పోస్ట్ లపై కేసులు, అరెస్ట్ లపై వైసిపి వాయిదా తీర్మానం.
వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్
-
Sep 26, 2025 09:27 IST
నేడు ఐదో రోజుకు చేరిన దేవీనవరాత్రులు
నేడు మహాలక్ష్మీదేవీ అలంకారంలో దర్శనం
-
Sep 26, 2025 08:44 IST
అమరావతి: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పీఎస్‌లో నమోదైన కేసును..
సీబీఐ కు అప్పగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
-
Sep 26, 2025 08:43 IST
యూపీ, రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన
రాజస్థాన్ బన్స్‌వారాలో రూ.1,22,100 కోట్లవిలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు
విద్యుత్, క్లీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోదీ
రాజస్థాన్‌లో మూడు రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనకు హాజరుకానున్న మోదీ
-
Sep 26, 2025 06:51 IST
టికెట్ ధరల పెంపుపై OG సినిమా యూనిట్‌కు ఊరట
హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును..
ఈరోజు వరకు సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
టికెట్ ధరల పెంపుపై స్టే విధించిన సింగిల్ జడ్జి
-
Sep 26, 2025 06:51 IST
నేటితో ముగియనున్న మిగ్-21 శకం
చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా వీడ్కోలు
పాల్గొననున్న CDS అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు
-
Sep 26, 2025 06:51 IST
విజయవాడ: లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్
రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపరచనున్న సిట్
-
Sep 26, 2025 06:50 IST
నేడు రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాయంత్రం అంబర్‌పేటకు సీఎం రేవంత్‌రెడ్డి
సివరేజ్ ప్లాంట్, బతుకమ్మ కుంట ప్రారంభించనున్న సీఎం
-
Sep 26, 2025 06:50 IST
నేడు మూడోరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఉదయం 8 గంటలకు సింహవాహన సేవ
రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ
-
Sep 26, 2025 06:49 IST
నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
నేడు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల..
నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Sep 26, 2025 06:49 IST
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం
రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం
ఈనెల 27న తీరం దాటనున్న వాయుగుండం
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
-
Sep 26, 2025 06:49 IST
తెలంగాణలో కొత్త లిక్కర్ షాపులకు నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి అక్టోబర్ 18వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో లిక్కర్ షాపులు కేటాయింపు