-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest Breaking Cinema Business National and International news across the globe 9th sept 2025 vreddy
-
BREAKING: భారత్ తరపున ఆస్కార్ ఎంట్రీ
ABN , First Publish Date - Sep 19 , 2025 | 06:25 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 19, 2025 20:28 IST
భారత్ తరపున ఆస్కార్ ఎంట్రీ
ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో హోమ్‌బౌండ్ మూవీ
ఇషాన్, జాహ్నవి కపూర్‌తో తెరకెక్కిన హోమ్‌బౌండ్
-
Sep 19, 2025 20:28 IST
నో ఫ్లైజోన్‌గా తెలంగాణ సచివాలయం
సచివాలయం చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలు
సచివాలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరవేస్తే చర్యలు
-
Sep 19, 2025 20:28 IST
హైదరాబాద్: CMRF చెక్కుల అక్రమాల కేసులో ఏడుగురు అరెస్ట్
లబ్ధిదారుల చెక్కులను తమ ఖాతాల్లో జమ చేసుకున్న నిందితులు
రూ.8.71లక్షల విలువైన CMRF చెక్కులు డ్రా చేసుకున్న నిందితులు
మాజీ మంత్రి ఆఫీస్‌లో చెక్కులు దుర్వినియోగమైనట్టు గుర్తింపు
2023 ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసుకున్న నిందితులు
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల కేసులో గతంలోనూ నలుగురు అరెస్ట్
-
Sep 19, 2025 20:28 IST
హైదరాబాద్: ఫెడెక్స్ ఫ్రాడ్ నిందితుడు నిఖిల్ తివారి అరెస్ట్
హర్యానాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
ఓ వైద్యుడి నుంచి రూ.1.23కోట్లు కాజేసిన నిఖిల్ తివారి
ఫైనాన్షియల్ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసిన నిఖిల్
మహారాష్ట్రలో మరో కేసులోనూ నిందితుడిగా ఉన్న నిఖిల్
-
Sep 19, 2025 20:28 IST
తెలంగాణలో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు
రూ.15.85లక్షల విలువైన NDPL లిక్కర్ పట్టివేత
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు
సికింద్రాబాద్‌కు వచ్చే రైలులో 73 మద్యం బాటిల్స్ స్వాధీనం
సికింద్రాబాద్ శ్రీదేవి లాడ్జ్‌లో 34 బాటిళ్లు, ఆల్ఫా హోటల్ దగ్గర 34 బాటిళ్లు సీజ్
అమీర్‌పేట్, ఎస్సార్ నగర్‌లో 110 బాటిళ్లు స్వాధీనం
అల్మాస్‌గూడలో 51 బాటిళ్లు, కామారెడ్డిలో ఓ ఇంట్లో 55 బాటిళ్లు సీజ్
-
Sep 19, 2025 20:28 IST
తెలంగాణలో రెండు కొత్త పథకాలు ప్రారంభం
మైనారిటీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో..
ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు ఆర్థిక సాయం
'రేవంతన్నా కా సహారా' కింద ఫకీర్, దూదేకుల వంటి..
వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్
అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్న టీజీ ప్రభుత్వం
-
Sep 19, 2025 20:28 IST
ఉల్లికి ధర తగ్గిందని రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్న
ఉల్లికి మార్కెట్‌లో ధర వచ్చినప్పుడే అమ్ముకోవాలి: అచ్చెన్నాయుడు
సెప్టెంబర్, అక్టోబర్‌లో రావాల్సిన ఉల్లి.. ఆగస్టు నెలాఖరుకే వచ్చింది
2లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ఉల్లికి.. 13వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు
గత ప్రభుత్వం గిట్టుబాటు ధర రాని పంటలను పట్టించుకోలేదు: అచ్చెన్న
-
Sep 19, 2025 20:28 IST
ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50వేలు ఇవ్వాలని సీఎం నిర్ణయం
రూ.100కోట్ల అదనపు భారం భరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
-
Sep 19, 2025 19:19 IST
అమరావతి: టీడీపీ గూటికి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన YCP MLCలు
మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ
ఇప్పటికే వైసీపీకి, MLC పదవులకు ముగ్గురు రాజీనామా
-
Sep 19, 2025 17:13 IST
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు
యాడ్ షూటింగ్‌లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయం
-
Sep 19, 2025 16:54 IST
కల్వకుంట్ల కుటుంబ పంచాయితీతో నాకు సంబంధం లేదు: రేవంత్‌రెడ్డి
కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంచాయితీ నడుస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి
కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్
కవిత కాంగ్రెస్‌లో చేరుతా అంటే వ్యతిరేకిస్తాం: సీఎం రేవంత్
కేసీఆర్ ఉద్యమం పేరుతో యువతను పొట్టను పెట్టుకున్నారు..
ఇప్పుడు ఆ ఉసురు తాకి కుమార్తె దూరమైంది: సీఎం రేవంత్‌రెడ్డి
గతంలో నా కూతురు పెళ్లికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు: రేవంత్‌రెడ్డి
-
Sep 19, 2025 16:54 IST
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపైనా స్పందించిన సీఎం రేవంత్
పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏమీ లేవు: సీఎం రేవంత్
స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి: సీఎం రేవంత్
కండువా వేసుకున్నంతమాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనా?: సీఎం రేవంత్
మా ఎమ్మెల్యేలు 37 మంది ఉన్నారని హరీష్‌రావు అసెంబ్లీలోనే అన్నారు: రేవంత్
L&T మేము చెప్పినట్టు వినాల్సిందే.. కేసీఆర్‌తో కుమ్ముక్కయితే ఒప్పుకోం: రేవంత్
-
Sep 19, 2025 16:54 IST
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టం: సీఎం రేవంత్
స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రేవంత్
న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఇచ్చిన 90 రోజుల గడువుపై..
సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తాం: సీఎం రేవంత్
-
Sep 19, 2025 16:51 IST
గురుకులాల్లో సౌకర్యాలలేమిపై తెలంగాణ హైకోర్టులో పిల్
నాసిరకమైన భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారన్న న్యాయవాది
పిల్‌పై కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులు అస్వస్థతకు గురై ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్న ఏఏజీ
రూ.11వేల కోట్లతో కొత్తగా గురుకుల, ఆశ్రమ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్న ఏఏజీ
ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల గురించి సమగ్రంగా చెప్పాలన్న సీజే
మెస్, కాస్మోటిక్ చార్జీల చెల్లింపునకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారన దసరా సెలవుల తర్వాత వింటామన్న సీజే ధర్మాసనం
-
Sep 19, 2025 16:51 IST
2014-19 కాలంలో నీటిపారుదలకు రూ.68,417కోట్లు ఖర్చు చేశాం: చంద్రబాబు
వైసీపీ పాలనలో రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు: చంద్రబాబు
ఈ ఏడాది నీటిపారుదలకు రూ.12,454 కోట్లు ఖర్చు చేశాం: చంద్రబాబు
ఐదేళ్లలో నీటిపారుదలకు రూ.70వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తాం
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడతాం: చంద్రబాబు
మేజర్, మీడియం రిజర్వాయర్లలో 94శాతం నీళ్లు వచ్చాయి: చంద్రబాబు
తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే ఇటీవలే మళ్లీ ఏర్పాటు చేశాం: చంద్రబాబు
-
Sep 19, 2025 16:51 IST
నదుల అనుసంధానం చేయాలని ప్రధానికి సూచించా: చంద్రబాబు
నదుల అనుసంధానం సాగుకు ఊతమిస్తుంది: సీఎం చంద్రబాబు
అనుసంధానానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధంగా లేవని మోదీ చెప్పారు
చొరవ చూపిన రాష్ట్రాలు ముందుకెళ్లాలని మోదీ సూచించారు
సరైన సమయంలో గంగా, కావేరి అనుసంధానం: చంద్రబాబు
నదుల అనుసంధానం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది
నదులు అనుసంధానించి నీటిపారుదల ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలి: చంద్రబాబు
-
Sep 19, 2025 16:51 IST
ఏపీ అసెంబ్లీలో జలవనరులశాఖపై స్వల్పకాలిక చర్చ
ఇరిగేషన్ ప్రాజెక్టులను అధ్యయనం చేశా: సీఎం చంద్రబాబు
ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్ట్‌లు నేను ప్రారంభించినవే
రైతులకు మొదటిసారి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చింది టీడీపీనే
ఉపాధి లేక పాలమూరు నుంచి వలసలు వెళ్లేవారు: చంద్రబాబు
ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించాం
నల్లగొండకు లిఫ్టు ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చాం: చంద్రబాబు
-
Sep 19, 2025 16:28 IST
విజయవాడ: లిక్కర్ కేసులో తొలిరోజు ముగిసిన మిథున్‌రెడ్డి కస్టడీ
4 గంటల పాటు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించిన సిట్
మిథున్‌రెడ్డి రేపు కూడా ప్రశ్నించనున్న సిట్ అధికారులు
ఐదేళ్లలో మిథున్‌రెడ్డి కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తులపై సిట్ ఆరా
ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ఉంచినట్టు తెలిపిన మిథున్‌రెడ్డి
మిథున్‌రెడ్డి ఫోన్‌ను FSLకు పంపాలని సిట్ నిర్ణయం
పలు ప్రశ్నలకు మిథున్‌రెడ్డి సహకరించలేదన్న భావనలో సిట్
కంపెనీల్లో డబ్బుల మళ్లింపుపై ప్రశ్నించిన సిట్ అధికారులు
తాను ఏ సంస్థలో డైరెక్టర్‌గా లేనని సమాధానం ఇచ్చిన మిథున్‌రెడ్డి
పలు ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని చెప్పిన మిథున్‌రెడ్డి
-
Sep 19, 2025 13:56 IST
సాయంత్రం టీడీపీ గూటికి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న..
MLCలు మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ
ఇప్పటికే వైసీపీకి, MLC పదవులకు ముగ్గురు రాజీనామా
రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మండలి చైర్మన్
-
Sep 19, 2025 13:43 IST
విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసు
సీబీఐ కోర్టులో ఆయేషా మీరా తండ్రి పిటిషన్
సీబీఐ తుది నివేదిక ఇవ్వాలని కోరిన ఇక్బాల్
రిపోర్టు ఇవ్వకుండా అభ్యంతరాలు తెలపలేమన్న ఇక్బాల్
-
Sep 19, 2025 13:32 IST
తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు దర్యాప్తు?
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించే యోచనలో ప్రభుత్వం
ఇప్పటికే కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
-
Sep 19, 2025 13:24 IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మైనింగ్ సరిహద్దుల ఖరారు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో ప్రత్యేక కమిటీ
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం
తదుపరి విచారణ 2026 జనవరికి వాయిదా
-
Sep 19, 2025 12:50 IST
ప్లాస్టిక్ నిషేధంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానం
ఏపీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది: పవన్‌కల్యాణ్
క్షేత్రస్థాయిలో అమలు సరిగా జరగటం లేదు: పవన్‌కల్యాణ్
ఒక్కసారి వారి పడేసిన ప్లాస్టిక్‌తో పర్యావరణానికి నష్టం: పవన్‌కల్యాణ్
-
Sep 19, 2025 12:49 IST
విజయవాడ: ఏపీ లిక్కర్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 22కు వాయిదా
రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి పిటిషన్లపై కౌంటర్ కోరుతూ విచారణ వాయిదా
-
Sep 19, 2025 12:38 IST
ఢిల్లీ: ట్రంప్ టారిఫ్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలారోజులు కొనసాగవు: రేవంత్
రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు అమలుచేస్తున్నారు: రేవంత్
తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారు: సీఎం రేవంత్
ట్రంప్ ఒకరోజు మోదీ నా మిత్రుడు అంటారు..
వెంటనే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించారు: సీఎం రేవంత్
భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టం: రేవంత్
-
Sep 19, 2025 12:30 IST
ఏపీలో పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ ఖరారు
ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
-
Sep 19, 2025 12:19 IST
ఢిల్లీ: ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ సంతకాల సేకరణ
సంతకాల ఉద్యమానికి సహకరించాలంటూ ప్రియాంకగాంధీ వీడియో
ప్రతి ఓటు ఎంత ముఖ్యమో.. ప్రతి సంతకమూ ముఖ్యమే: ప్రియాంక
ప్రజాస్వామ్య పరిరక్షణలో అంతా కలిసిరావాలి: ప్రియాంకగాంధీ
-
Sep 19, 2025 12:05 IST
ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్: పవన్
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నాం
ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలు ముందుకు రావాలి: పవన్
మన జీవితాల్లో ప్లాస్టిక్ ఓ భాగం అయిపోయింది: పవన్ కల్యాణ్
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తాం: పవన్ కల్యాణ్
తిరుమలలో క్రమశిక్షణతో ప్లాస్టిక్ నిషేధం అమలు అవుతోంది
ప్లాస్టిక్ నియంత్రణ రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలి
ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది: పవన్ కల్యాణ్
ఏ చిన్న కార్యక్రమమైనా ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు: పవన్
-
Sep 19, 2025 11:53 IST
చెన్నై: నటుడు విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం
విజయ్ నివాసంలోకి ప్రవేశించిన అగంతకుడు
టెర్రస్‌పై తిరుగుతుండగా నిందితుడిని గుర్తింపు
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Sep 19, 2025 11:42 IST
రష్యాపై ఆంక్షలకు UK ప్రధాని అంగీకారం: ట్రంప్
రష్యాపై ఆంక్షలకు కీర్ స్టార్మర్ ముందుకు వచ్చారు: ట్రంప్
-
Sep 19, 2025 11:10 IST
ఏపీ అసెంబ్లీ షెడ్యూల్‌లో మార్పులు
ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 22న వ్యవసాయం, 23న శాంతిభద్రతలపై చర్చ
24న ప్రభుత్వ బిజినెస్, 25న ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ
26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చ
27న సూపర్ సిక్స్ అమలుపై స్వల్పకాలిక చర్చ
-
Sep 19, 2025 10:39 IST
అమరావతి: సాయంత్రం టీడీపీ గూటికి MLC మర్రి రాజశేఖర్
సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్
రాజశేఖర్‌తో పాటు టీడీపీలో చేరనున్న చిలకలూరిపేట వైసీపీ నేతలు
ఇప్పటికే వైసీపీ సహా MLC పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా
-
Sep 19, 2025 10:18 IST
అమరావతి: మండలిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల..
ప్రైవేటీకరణ పీపీపీ విధానంపై వైసీపీ వాయిదా తీర్మానం
వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్
పోడియం వద్ద వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
-
Sep 19, 2025 10:09 IST
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
Sep 19, 2025 10:09 IST
విశాఖ: HPCL విస్తరణ పనుల ప్రాంతంలో లీకైన గ్యాస్
HPCL రఫ్ సైట్‌లో పేలిన నైట్రోజన్ గ్యాస్ కంప్రెషర్
మార్నింగ్ షిఫ్ట్‌లో బ్లూ షేడ్ వద్ద జరిగిన ప్రమాదం
భయంతో పరుగులు తీసిన కార్మికులు, స్థానికులు
-
Sep 19, 2025 10:06 IST
అక్టోబర్‌లో మలేషియాలో ఆసియాన్ సదస్సు
పాల్గొననున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్
సదస్సుకు అనుబంధంగా మోదీ-ప్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశం
ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు, భారత్‌పై టారిఫ్‌ల వేళ భేటీకి ప్రాధాన్యం
-
Sep 19, 2025 09:34 IST
ప్రపంచ భద్రతకు భారత్ కీలక భాగస్వామి: చైనా
అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వత్రాతో...
చైనా హౌస్ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ జాన్ మెలినార్ భేటీ
రక్షణ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో...
భారత్, చైనా మధ్య సహకారం కొనసాగుతోంది: మోలినార్
-
Sep 19, 2025 09:34 IST
హైదరాబాద్: నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల అభివృద్ధిపై సమావేశం
ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం
భేటీకి డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
-
Sep 19, 2025 08:54 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్
డివిజన్ల వారీగా పార్టీ నేతలో భేటీకానున్న కేటీఆర్
కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్
-
Sep 19, 2025 08:19 IST
తెలంగాణలో పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
సంజయ్, పోచారం, కాలె యాదయ్యకు స్పీకర్ నోటీసులు
తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి స్పీకర్ నోటీసులు
మరిన్ని ఆధారాలు కావాలని నోటీసుల్లో పేర్కొన్న స్పీకర్
BRS ఫిర్యాదుదారులకూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు
ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
-
Sep 19, 2025 08:16 IST
గత వైసీపీ ప్రభుత్వ పథకాల పేర్లు ప్రస్తావిస్తూ ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు
కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా తీరుమార్చుకోని అసెంబ్లీ సిబ్బంది
ఆరోగ్యశ్రీ పేరుని కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా..
ప్రశ్నోత్తరాల్లో పదేపదే ఆరోగ్యశ్రీ అని ప్రస్తావించిన అసెంబ్లీ సిబ్బంది
-
Sep 19, 2025 07:29 IST
మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
బిల్లులతో పాటు 15 అంశాలపై చర్చించనున్న ఏపీ కేబినెట్
-
Sep 19, 2025 07:16 IST
అమరావతి: DSCలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు..
నేడు నియామక పత్రాలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
-
Sep 19, 2025 07:08 IST
ఈనెల 25న బతుకమ్మ కుంటకు సీఎం రేవంత్ రెడ్డి
బతుకమ్మ కుంటను పునర్జీవనం పోసి సుందరీకరణ చేసిన హైడ్రా
బతుకమ్మ కుంటను పునఃప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 19, 2025 07:05 IST
తిరుమల: నేడు బ్రహ్మోత్సవాలపై TTD ఈఓ సమీక్ష
సమీక్షకు హాజరుకానున్న అన్ని శాఖల అధికారులు
-
Sep 19, 2025 07:04 IST
నేడు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం
తెలంగాణలో ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ
హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్, సీతక్క, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు
-
Sep 19, 2025 07:04 IST
నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మెడికల్ కాలేజీలపై వాయిదా తీర్మానం ఇవ్వనున్న వైసీపీ
మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ
-
Sep 19, 2025 07:04 IST
రష్యాలో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదు
రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ
-
Sep 19, 2025 06:48 IST
లిక్కర్ కేసులో సిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
నలుగురికి ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేసిన సిట్
నేడు తదుపరి విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
-
Sep 19, 2025 06:33 IST
APPSC గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో విచారణ
ఎంపిక కాని అభ్యర్థుల వాదనలు నేడు విననున్న హైకోర్టు
-
Sep 19, 2025 06:32 IST
నేటినుంచి కస్టడీకి ఎంపీ మిథున్‌రెడ్డి
మిథున్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ACB కోర్టు ఆదేశాలు
ఉ.8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు
-
Sep 19, 2025 06:32 IST
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
నేడు న్యూజెర్సీ గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
అమెజాన్, కార్ల్స్‌బర్గ్,..
కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
-
Sep 19, 2025 06:25 IST
భారత్, మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్
చైనాపై మరిన్ని సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉన్నా: ట్రంప్
ఆఫ్గాన్‌లో బగ్రామ్ ఎయిర్‌బేస్ తిరిగి స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్