-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest and Breaking news from AP Telangana and abroad on 14th sept 2025 vREDDY
-
BREAKING: తురకపాలెంపై వైద్యారోగ్యశాఖ ప్రకటన
ABN , First Publish Date - Sep 14 , 2025 | 06:26 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 14, 2025 20:26 IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం అందరూ పని చేయాలి: సీఎం రేవంత్
సంక్షేమ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి: సీఎం రేవంత్
పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి
నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి
అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది: సీఎం రేవంత్
మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా
పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి: సీఎం రేవంత్
-
Sep 14, 2025 18:07 IST
గుంటూరు: తురకపాలెంపై వైద్యారోగ్యశాఖ ప్రకటన
తురకపాలెంలో యురేనియం సమస్య లేదు: వైద్యారోగ్యశాఖ
నీటి శాంపిల్స్ ఫలితాల్లో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉంది
ఇబ్బందికర స్థాయిలో యురేనియం అవశేషాలు లేవు: వైద్యారోగ్యశాఖ
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: వైద్యారోగ్యశాఖ
తురకపాలెంలో కాలుష్యం అరికట్టేందుకు చర్యలు: వైద్యారోగ్యశాఖ
-
Sep 14, 2025 18:07 IST
రంగారెడ్డి: చేవెళ్ల హనీ ట్రాప్ కేసులో ఐదుగురు అరెస్ట్
స్పై కెమెరాలతో యోగా గురువు రంగారెడ్డిని ట్రాప్ చేసిన మహిళలు
స్పై కెమెరాల కొనుగోలుకు ఫేక్ ప్రెస్‌కార్డులు సృష్టించిన మహిళలు
నిందితులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్టు గుర్తింపు
డబ్బులు సరిపోక హనీట్రాప్‌కు స్కెచ్ వేసిన నిందితులు
పోలీసుల అదుపులో మంజుల, రజినీతో పాటు మరో ముగ్గురు
-
Sep 14, 2025 18:07 IST
ఆసియా కప్‌లో 19సార్లు తలపడిన భారత్- పాక్
టీమిండియా-10, పాకిస్తాన్-6, 3 మ్యాచ్‌లు టై
ఆసియా కప్ టీ20లో మూడుసార్లు తలపడిన భారత్- పాక్
ఆసియా కప్ టీ20లో 2 మ్యాచుల్లో భారత్, ఒక మ్యాచ్‌లో పాక్ గెలుపు
-
Sep 14, 2025 18:07 IST
కాసేపట్లో దుబాయ్‌లో భారత్- పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి భారత్, పాక్ మ్యాచ్
టీ20ల్లో పాక్‌పై టీమిండియాదే లీడ్
టీమిండియాది విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్
టీ20ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్
బుమ్రా రాకతో బౌలింగ్‌లో పటిష్ఠం
-
Sep 14, 2025 17:22 IST
టోలిచౌకిలో జింక మాంసం రవాణా గుట్టురట్టు
మానివ్ క్లాసిక్ అపార్ట్‌మెంట్‌లో పోలీసుల సోదాలు
10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం
నిందితులు సలీం, ఇక్బాల్ అరెస్ట్, కారు సీజ్
నిందితుల నుంచి 5 రైఫిల్స్ స్వాధీనం
-
Sep 14, 2025 16:57 IST
ర్యాగింగ్ కలకలం..
హైదరాబాద్: బోడుప్పల్ ఎస్సార్ జూనియర్ బాయ్స్ కాలేజీలో ర్యాగింగ్
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గణేష్‌ను తీవ్రంగా కొట్టిన ముగ్గురు సీనియర్లు
విద్యార్థి గణేష్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఆందోళనలో గణేష్ కుటుంబసభ్యులు
-
Sep 14, 2025 16:56 IST
హైదరాబాద్: హనీట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి
అనారోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు
రంగారెడ్డితో మహిళలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన అమర్ గ్యాంగ్
రూ.50 లక్షల చెక్కులు ఇచ్చిన యోగా గురువు రంగారెడ్డి
మరో రూ.2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్
గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన రంగారెడ్డి
పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
-
Sep 14, 2025 13:04 IST
అసోంలో ప్రధాని మోదీ పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
1962లో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసింది: ప్రధాని మోదీ
ఆ తప్పిదాల ఫలితాలను అసోం ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు
భారత రత్న అవార్డు గ్రహీత హజారికాను కాంగ్రెస్ అవమానించింది
నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది: మోదీ
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అసోంలో 13శాతం వృద్ధి రేటు: ప్రధాని మోదీ
-
Sep 14, 2025 12:38 IST
జగన్‌కు పరోక్షంగా అయ్యన్నపాత్రుడు చురకలు
ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి: అయ్యన్న
అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలి: అయ్యన్న
సభకు హాజరుకాకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు: అయ్యన్న
-
Sep 14, 2025 12:14 IST
ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావు: కొల్లు
దేవస్థానం భూములు ఎవరికీ బదలాయింపు జరగడం లేదు: కొల్లు
కేవలం విజయవాడ ఉత్సవ్ నిర్వహణకే 56 రోజుల లీజు: మంత్రి కొల్లు
లీజు ద్వారా దేవస్థానానికి రికార్డుస్థాయిలో రూ.45 లక్షలు ఆదాయం: చిన్ని
కొందరు కావాలని చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఎంపీ కేశినేని చిన్ని
-
Sep 14, 2025 11:46 IST
హైదరాబాద్: నయాపూల్ దగ్గర మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలింపు
బండ్లగూడలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకును చంపిన తండ్రి
హత్య అనంతరం బాలుడి మృతదేహాన్ని మూసీలో పడేసిన తండ్రి అక్బర్
కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి మహ్మద్ అక్బర్
పోలీసులు విచారణలో వాస్తవాలు తెలిపిన బాలుడి తండ్రి మహ్మద్ అక్బర్
-
Sep 14, 2025 11:42 IST
లక్నో ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం టేకాప్ విఫలం
లక్నో-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
అప్రమత్తమై అతికష్టం మీద విమానాన్ని రన్‌వేపై ఆపిన పైలట్
విమానంలో ఎంపీ డింపుల్ సహా 151 మంది ప్రయాణికులు
-
Sep 14, 2025 11:27 IST
విశాఖ: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరిక
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన పోతుల సునీత
ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవి, వైసీపీకి రాజీనామా చేసిన సునీత
-
Sep 14, 2025 11:17 IST
తెలంగాణలో కాంగ్రెస్‌ను కేంద్రం కాపాడుతోంది: కేటీఆర్ ట్వీట్
కాళేశ్వరంలోని సమస్యలకు NDSA బృందాన్ని పంపిన కేంద్రం..
ఇప్పుడు ఎందుకు పంపడం లేదు?: కేటీఆర్ ట్వీట్
SLBC ఘటనపై దర్యాప్తునకు ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదు?: కేటీఆర్
-
Sep 14, 2025 10:40 IST
హైదరాబాద్: గంజాయి అమ్మడం లేదని ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్
కిడ్నాప్ చేసి షాబాజ్, ఫయిమ్‌ను చితకబాదిన ఆరుగురు దుండగులు
పాతబస్తీ భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
గతంలో గంజాయి విక్రయించిన షాబాజ్, ఫయిమ్
-
Sep 14, 2025 10:39 IST
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు
-
Sep 14, 2025 10:22 IST
తిరుపతిలో కురుస్తున్న వర్షం
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన సమయంలో మార్పు
తిరుపతిలో దట్టమైన మేఘాలు అలుముకుని ఉండటంతో చర్యలు
ఏవియేషన్ అధికారుల క్లియరెన్స్ తర్వాత పర్యటనపై స్పష్టత వచ్చే అకాశం
-
Sep 14, 2025 09:56 IST
హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ హాస్టల్‌పై ఆకతాయిల దాడులు
హాస్టల్‌పై కాలనీ డివిజన్ BRSV అధ్యక్షుడు దుర్గాప్రసాద్ దాడులు
మద్యం మత్తులో యువతిని కామెంట్ చేసిన దుర్గాప్రసాద్ బ్యాచ్‌ను...
వారించిన యువకుడు వెంకటేష్‌పై దుర్గాప్రసాద్ గ్యాంగ్ మూకుమ్మడి దాడి
తప్పించుకుని పరారై తను ఉంటున్న హాస్టల్‌లో తలదాచుకున్న వెంకటేష్
-
Sep 14, 2025 09:38 IST
కొమురం భీం: పొంగి పొర్లుతున్న పెన్ గంగా నది
సిర్పూర్-టి(మం)వెంకట్రావుపేట అంతరరాష్ట్ర వంతెనపై వరద ప్రవాహం
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు
-
Sep 14, 2025 09:37 IST
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్
SLBC సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా స్పందనలేదు: కేటీఆర్
ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆరు మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయలేదు
బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదు: కేటీఆర్
-
Sep 14, 2025 08:48 IST
ఆసియాకప్‌లో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్
టెన్షన్ టెన్షన్‌గా అబుదాబీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్
రాత్రి 8 గంటల నుంచి భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి మ్యాచ్
BCCIపై సోషల్ మీడియాలో భారత్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని అభిమానుల పోస్ట్‌లు
-
Sep 14, 2025 08:30 IST
నేపాల్‌లో మార్చి 5న ఎన్నికలు
గత పార్లమెంట్‌ను రద్దు చేసిన అధ్యక్షుడు రామచంద్ర
తాత్కాలిక ప్రధానిగా సుశీలాకార్కీ బాధ్యతలు స్వీకరణ
తాత్కాలిక ప్రధాని కార్కీ ఆధ్వర్యంలో నేడు కేబినెట్ భేటీ
నేపాల్‌లో సాధారణ పరిస్థితులు.. కర్ఫ్యూ, నిషేదాజ్ఞలు ఎత్తివేత
-
Sep 14, 2025 08:29 IST
రష్యా చమురు కొంటున్న చైనాపై 50-100% సుంకాలు విధించిన అమెరికా, చైనాపై భారీగా సుంకాల విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుంది: ట్రంప్
గాజాలో కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 32 మంది మృతి, మృతుల్లో 12 మంది చిన్నారులు
నేపాల్‌లో 2026 మార్చి 5న ఎన్నికలు, తాత్కాలిక ప్రధాని కార్కీ ఆధ్వర్యంలో ఇవాళ కేబినెట్ భేటీ
-
Sep 14, 2025 07:41 IST
రేపు వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
3 కీలక అంశాలపై ఉత్తర్వులు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
-
Sep 14, 2025 07:08 IST
కీవ్: రష్యాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై దాడి చేసిన ఉక్రెయిన్
కీవ్: 2026లోనూ రష్యాతో యుద్ధాన్ని కొనసాగించాలంటే 129 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
నేపాల్‌లో కేబినెట్ కూర్పుపై తాత్కాలిక ప్రధాని కార్కీ కసరత్తు, నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు 2026 మార్చి 5న నిర్వహిస్తామని ప్రకటన
-
Sep 14, 2025 07:07 IST
నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన
పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
-
Sep 14, 2025 07:07 IST
లండన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు
అక్రమ వలసదారులను పంపించేయాలనే డిమాండ్‌తో భారీ నిరసన
బ్రిటన్ జెండాలతో పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన నిరసనకారులు
బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ర్యాలీలో హింసాత్మక ఘటనల్లో 26మంది పోలీసులకు గాయాలు
-
Sep 14, 2025 06:27 IST
నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు
వివాహ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Sep 14, 2025 06:27 IST
తెలంగాణలో 4 రోజులపాటు భారీ వర్షాలు
నేడు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు
-
Sep 14, 2025 06:27 IST
నేడు ఆసియా కప్‌లో భారత్ Vs పాకిస్థాన్
రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్
-
Sep 14, 2025 06:27 IST
నేడు విశాఖలో సారథ్యం బహిరంగసభ
విశాఖ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న జేపీ నడ్డా
-
Sep 14, 2025 06:26 IST
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చించనున్న కమిటీ
పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపైనా చర్చించే అవకాశం