Share News

Chanakya Ethics: ఈ రెండు ప్రధాన అలవాట్లే మనిషి నాశనానికి కారణం..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:15 PM

చాణక్య నీతి ప్రకారం, ఈ రెండు ప్రధాన అలవాట్లే మనిషి దుఃఖానికి కారణం. ఈ అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. ఆ అలవాట్లు ఏంటి? వాటిని ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Ethics: ఈ రెండు ప్రధాన అలవాట్లే మనిషి నాశనానికి కారణం..
Chanakya

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను మనకు ప్రస్తావించాడు. ఆయన సూత్రాలను పాటించడం వల్ల జీవితంలో విజయం సాధించడంతో పాటు ఎంతో సంతోషంగా జీవిస్తారు. అలాగే, చాణక్యుడు ప్రకారం, ఈ రెండు ప్రధాన లక్షణాలు మనిషి నాశనానికి కారణం అవుతాయి, జీవితంలో ఎప్పట్టికీ విజయం సాధించలేరు.

ఈ 2 లక్షణాలు నాశనానికి కారణం

చాణక్యుడి ప్రకారం, కోపం, అహంకారం ఈ రెండు లక్షణాలు మనిషిని దుఃఖం వైపు నడిపిస్తాయి. ఈ రెండు లక్షణాలు మనిషి నాశనానికి కారణం అని, తనకు తానే శత్రువుగా మారతాడని చాణక్య నీతి చెబుతోంది. ఈ అలవాట్లు ఎందుకు వినాశకరమైనవో, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కోపం

కోపం ఆలోచనా శక్తిని, అవగాహన శక్తిని నాశనం చేస్తుంది. కోపం అనేది ఒక వ్యక్తి తాను నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరిస్తుంది. మనం కోపంగా ఉన్నప్పుడు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తాము. తర్వాత మళ్లీ దాని గురించి చింతిస్తాము. దీని వల్ల కొన్ని నష్టాలు ఎదురుకోవాల్సి వస్తుంది. అవేంటంటే..

కోపం వల్ల కలిగే నష్టాలు

  • సంబంధాలు చెడిపోతాయి.

  • మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

  • తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

  • వృత్తి జీవితం ప్రభావితమవుతుంది.

కోపాన్ని ఎలా నివారించాలి:

  • లోతైన శ్వాస తీసుకొని మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.

  • మీరు కోపంగా ఉన్నప్పుడు సైలెంట్ ‌గా ఉండండి.

  • ధ్యానం, యోగా చేయండి.


అహంకారం

అహంకారం విజయాన్ని నాశనం చేస్తుంది. ఈ లక్షణం ఒక వ్యక్తిని వాస్తవం నుండి దూరం చేస్తుంది. ఎవరైనా తన విజయాల పట్ల చాలా గర్వపడినప్పుడు, అతను ఇతరులను తక్కువగా చూడటం, తనను తాను అందరికంటే ఉన్నతంగా భావించడం ప్రారంభిస్తాడు. దీని వల్ల దగ్గరి సంబంధాలు దూరం అవుతాయి. ఆ వ్యక్తి నేర్చుకోవాలనే కోరికను కోల్పోతాడు. విజయం శాశ్వతం కాదు, ఎందుకంటే గర్వం విధ్వంసానికి మూలం అవుతుంది. దీని వల్ల సమాజంలో గౌరవం తగ్గుతుంది. ఎల్లప్పుడూ మర్యాదగా ఉండండి, ఇతరులను గౌరవించండి. జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి, అహంకారాన్ని వదిలివేయండి.

కోపం, గర్వం ఒక వ్యక్తి జీవితంలో నాశనానికి అతిపెద్ద కారణాలని చాణక్య నీతి మనకు బోధిస్తుంది . ఈ అలవాట్లను మనం నియంత్రించుకోకపోతే తీవ్ర నష్టాలు ఎదురుకోవడం ఖాయం. కాబట్టి, సంతోషకరమైన జీవితం కోసం ఈ రెండు లక్షణాలను దూరం చేసుకోండి.


Also Read:

Funny Viral Video: కారులో మాజీ ప్రధాని.. కారు బయట ఉష్ణ పక్షి.. చివరకు జరిగింది చూస్తే..

Police Case: వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్త సస్పెండ్..

Michelle Obama On Divorce: విడాకులు తీసుకోబోతున్న ఒబామా దంపతులు.. మిచెల్ ఏమన్నారంటే..

Updated Date - Apr 10 , 2025 | 01:15 PM