Michelle Obama On Divorce: విడాకులు తీసుకోబోతున్న ఒబామా దంపతులు.. మిచెల్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:58 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్ని నెలలుగా వీరి విడాకులపై వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మిచెల్ ఈ వార్తలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆ వివరాలు..

ఒకప్పుడు అంటే విడాకులు తీసుకోవడాన్ని చాలా దారుణమైన నేరంగా చూసేవారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే.. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాల్సిందే అనే పరిస్థితులు ఉండేవి. అయితే మారుతున్న కాలంతో పాటుగా ఇలాంటి అభిప్రాయాల్లో కూడా మార్పులు వచ్చాయి. నేటి కాలంలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయ్యింది. ఇద్దరికి నచ్చితేనే బంధంలో కొనసాగుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా సరే.. వయసుతో సంబంధం లేకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిలో సెలబ్రిటీలే అధికంగా ఉంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేరాడు ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నాంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వారు విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికారు చేయసాగాయి. అయితే ఈ వార్తలపై మిచెల్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
గత కొన్నాళ్లుగా అమెరికాలో ఒబామా దంపతులకు సంబంధించిన వార్తలే అధికంగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉత్తమ జంటగా గుర్తింపు తెచ్చుకున్న ఒబామా దంపతులు.. ఏ కార్యక్రమానికి వెళ్లిన కలిసే వెళ్లేవారు. అయితే గత కొన్ని నెలలుగా ఎంత ముఖ్యమైన పని అయినా సరే.. బరాక్ ఒబామా ఒక్కటే కనిపిస్తున్నాడు. ఇంకేముంది పుకార్లకు రెక్కలు వచ్చాయి. ఒబామా దంపతులు విడాకులు తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఈ వార్తలపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మిచెల్.. తాజాగా స్పందించారు. గత కొంత కాలంగా తాను ఎందుకు ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాలేదో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మిచెల్ మాట్లాడుతూ.. "నా గురించి సంరక్షణ తీసుకోవాలని భావించాను. నాను నేను సమయం ఇచ్చుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాను. ఏం చేస్తే నేను ఉత్తమంగా ఉంటానో అదే పని చేస్తున్నాను. అంతేకాక మిగతా వాళ్లు ఏమనుకుంటారు.. సమాజం నా గురించి ఏమనుకుంటుంది అనే విషయాల గురించి పట్టించుకోవద్దని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాలకు హాజరుకాలేదు. అంతేతప్ప.. మా వివాహబంధంలో బీటలు వచ్చాయి.. మేం విడిపోతున్నాం.. విడాకులు తీసుకోబోతున్నాం.. అనే మాటలు వాస్తవం కాదు" అని చెప్పుకొచ్చారు.
ఓ మహిళ స్వతంత్రంగా ఉంటే ఈ సమాజం ఓర్చుకోలేదని.. ఈ విడాకులు వార్తలు చూస్తుంటే నాకు అర్థం అయ్యింది అని చెప్పుకొచ్చింది మిచెల్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఒబామా దంపతులు మాట్లాడుతూ.. తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మిచెల్ మాట్లాడుతూ.. "బరాక్ ఒబామా రాజకీయాల్లోకి రావడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. తన నిర్ణయం వల్ల నేను 10 సంవత్సరాలు బాధపడ్డాను. మా 30 ఏళ్ల వైవాహిక జీవితంలో పది సంవత్సరాలు బాధపడుతూనే గడిపానంటే అర్థం చేసుకోవచ్చు" అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి:
Cricket In 2028 Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ 6 జట్లకే ఆడే చాన్స్.. గట్టి షాకే
Viral Video: సమయాన్ని ఆదా చేయడమంటే ఇదేనేమో.. బస్సులో ఇతడి నిర్వాకం చూస్తే..