Dubai Travel Mistakes to Avoid: దుబాయ్‌లో పొరపాటున కూడా ఇలా చేయకండి.. చేస్తే..
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:59 PM
మీరు దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే, పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. నగరం ఆధునికత, సంప్రదాయం రెండింటినీ అందిస్తుంది. ఇది అధిక-స్థాయి జీవనశైలితో కూడిన ఒక విలాసవంతమైన నగరం, ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే, ఈ నగరంలో కొన్ని కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి, మీరు దుబాయ్ వెళ్లాలనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా, బహిరంగంగా ప్రదేశాల్లో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. లేదంటే అక్కడ నియమాల ప్రకారం మీకు జైలు శిక్ష తప్పదు. సో లేట్ చేయకుండా, దుబాయ్‌లో చేయకూడని ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం..
బహిరంగంగా శృంగారం:
దుబాయ్‌లో బహిరంగంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా చేతులు పట్టుకోవడం చట్టవిరుద్ధం. కాబట్టి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దుబాయ్ ఈ తప్పులు చేయకూడదు. లేదంటే, అక్కడి అధికారులు మిమ్మల్ని జైలుకు తీసుకెళ్లవచ్చు.

బహిరంగంగా తాగి ఉండటం: లైసెన్స్ పొందిన క్లబ్ లేదా హోటల్‌లో మద్యం సేవించడం పర్వాలేదు, కానీ వీధిలో తాగి కనిపించడం వల్ల మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే, దుబాయ్‌లో బహిరంగంగా తాగడం, తాగి బహిరంగంగా తిరగడం నిషేధం. అలాగే, మాదకద్రవ్యాలు, సిగరెట్లు, గంజాయితో సహా ఏ మత్తు పదార్థాలకు అనుమతి ఉండదు. అంతేకాకుండా, కొన్ని మందులు కూడా నిషేధం. కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పు చేయకండి.

ప్రభుత్వ భవనాలను ఫొటోలు తీయడం: దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఫొటోలు తీసుకోకూడదు. ముఖ్యంగా, ప్రభుత్వ కార్యాలయాలు, వంతెనలు, సైనిక ప్రాంతాలు లేదా విమానాశ్రయాలను ఫొటోలు తీయడం జైలు శిక్షకు దారితీయవచ్చు. అంతేకాకుండా, స్థానికుల అనుమతి లేకుండా ఫొటోలు తీయడం కూడా నిషేధం.

బహిరంగంగా దుర్భాషలాడడం: మీరు దుబాయ్‌లో బహిరంగంగా కోపంతో ఎవరినైనా తిట్టినా లేదా శారీరకంగా దాడి చేసినా, పోలీసులు వెంటనే చర్య తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో దురుసుగా ప్రవర్తిస్తే జైలు శిక్ష తప్పదు.

షార్ట్స్ ధరించడం: దుబాయ్‌లో బీచ్‌లు, క్లబ్‌లు కాకుండా బహిరంగ ప్రదేశాలలో షార్ట్స్, డీప్ నెక్‌లైన్‌లు లేదా అతిగా కనిపించే దుస్తులను నివారించండి. ఎందుకంటే, మీరు ఇబ్బందులు పడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News