Honeymoon Destinations In India: హనీమూన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఇవే..
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:28 PM
పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, నూతన వధూవరులు హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇండియాలో తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: హనీమూన్ అనగానే చాలా మంది యూరప్‌కు వెళ్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే, యూరప్‌లో కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి. నూతన వధూవరులు పారిస్, ఇటలీలోని రోమ్, వెనిస్, స్విట్జర్లాండ్, గ్రీస్‌లోని శాంటోరిని వంటి మోస్ట్ రొమాంటిక్ ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే, దీని కోసం చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కానీ, భారతదేశంలో తక్కువ ఖర్చుతోనే సందర్శించగల అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి హనీమూన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న నూతన వధూవరులకు, మన భారతదేశంలో బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
గుల్మార్గ్ :
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ హనీమూన్‌కు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ మీరు అడవుల అందాలను, మంచుతో కప్పబడిన శిఖరాలను చూడవచ్చు. ఈ ప్రదేశానికి వెళ్లడానికి మీకు కేవలం రూ. 55,000 నుండి రూ. 90,000 బడ్జెట్ సరిపోతుంది.

ఔలి:
భారతదేశంలో అద్భుతమైన ప్రదేశాలలో ఔలి కూడా ఒకటి. ఔలి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్, ఇది హనీమూన్‌కు సరైన ప్రదేశం. దేవదారు చెట్లు, పొగమంచుతో చుట్టుముట్టబడిన ఈ ప్రదేశం స్విట్జర్లాండ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడికి హనీమూన్‌కు వెళ్లడానికి రూ. 45 వేల నుండి 70 వేల బడ్జెట్ సరిపోతుంది.
షిల్లాంగ్:
మేఘాలయలోని షిల్లాంగ్ యూరప్ లాగా కనిపించే అద్భుతమైన ప్రదేశం. చెట్లతో నిండిన వీధులు, ఆకట్టుకునే పర్వత శిఖరాలు, అందమైన సరస్సులు ఇక్కడ ఉన్నాయి. హనీమూన్‌కు వెళ్లాలనుకునే నూతన వధూవరులకు ఇది బెస్ట్ ప్లేస్, మీరు రూ. 40,000 నుండి 60,000 బడ్జెట్‌తో ఇక్కడ ప్రయాణించవచ్చు.

కూర్గ్
కూర్గ్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం, ఎందుకంటే ఇది దట్టమైన అడవులు, పచ్చని కొండలు, కాఫీ తోటలు, సుందరమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు, ట్రెక్కింగ్ చేయవచ్చు, వన్యప్రాణులను చూడవచ్చు. నూతన వధూవరులు హనీమూన్ కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. కేవలం రూ. 30,000 నుండి 50,000 బడ్జెట్ సరిపోతుంది.

మున్నార్:
కేరళలోని మున్నార్ భారతదేశంలో యూరప్ లాగా అనిపించే ప్రదేశాలలో ఒకటి. పచ్చని టీ తోటలు, రొమాంటిక్ హిల్ స్టేషన్లతో, ఇది హనీమూన్ కు సరైన ప్రదేశం. ఇక్కడ మీరు ఎరవికులం నేషనల్ పార్క్, అనముడి శిఖరం, లక్కం జలపాతం, ముత్తుపెట్టి ఆనకట్ట మొదలైన వాటిని సందర్శించవచ్చు. మీరు 35 వేల నుండి 55 వేల బడ్జెట్ లోపు ఇక్కడకు ట్రిప్ వెళ్ళవచ్చు.
Also Read:
ఈ ఇంటి చిట్కాలు మీ కాలేయాన్ని శుభ్రపరుస్తాయి!
చాక్లెట్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
For More Lifestyle News